రేపటి నుంచే తొలి హైడ్రోజన్ రైలు పరుగులు, రూట్ - షెడ్యూల్.. ప్రత్యేకతలు..!!


దేశంలో తొట్ట‌తొలి హైడ్రోజ‌న్ రైలు ప‌ట్టాలెక్క‌నున్న‌ది. హ‌ర్యానాలోని జింద్ నుంచి ఆ రైలు ప్రారంభం కానున్న‌ది. జూన్ 17వ తేదీన ప్ర‌ధాని మోదీ ఆ కొత్త రైలుకు ప‌చ్చ‌జెండా ఊప‌నున్నారు. పూర్తిగా పర్యావరణహితమైన హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీతో నడిచే ఈ రైలు, జింద్ మరియు సోనిపత్ నగరాల మధ్య గల 89 కిలోమీటర్ల దూరాన్ని కేవలం రెండు గంటల వ్యవధిలోనే చేరుకుంటుంది. ఈ రైలు పట్టాలెక్కటం ద్వారా భారతీయ రైల్వేలో కొత్త విప్లవంగా మారనుంది. ఈ రైలుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

Advertisement

దేశంలో తొలి హైడ్రోజర్ రైలు అందుబాటులోకి వచ్చింది. ప్రధాని మోదీ రేపు(శుక్రవారం) ఈ కొత్త రైలును
హ‌ర్యానాలోని జింద్ నుంచి ప్రారంభించనున్నారు. హైడ్రోజ‌న్ రైలు భార‌తీయ రైల్వే చ‌రిత్ర‌లో కొత్త అధ్యాయాన్ని లిఖించ‌నున్న‌ది. జింద్ నుంచి సోనిప‌ట్ మ‌ధ్య ఆ రైలు న‌డ‌వ‌నున్న‌ది. ఈ రెండు స్టేష‌న్ల మ‌ద్య 89 కిలోమీట‌ర్ల దూరం ఉంది. గ‌రిష్టంగా 75 కిలోమీట‌ర్ల వేగంతో వెళ్తుంది. చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్ట‌రీలో దీన్ని డిజైన్ చేశారు. ఫ్యూయ‌ల్ సెల్ డీపీఆర్ఎస్ విధానంలో రైలు న‌డ‌వ‌నున్న‌ది. ఈ రైలులో మొత్తం 10 కోచ్‌లు ఉంటాయి. 1200 కిలోవాట్ల ప్రొప‌ల్ష‌న్ సిస్ట‌మ్ ఆ రైలుకు ఉంటుంది. 2025లో జింద్‌-సోనిప‌ట మ‌ధ్య ట్ర‌య‌ల్స్ విజ‌య‌వంతంగా నిర్వ‌హించారు. హైడ్రోజ‌న్ ట్రైన్ నెంబ‌ర్ 74010 జింద్ రైల్వే స్టేష‌న్ నుంచి ఉద‌యం 740 నిమిషాల‌కు బ‌య‌లు దేరుతుంది. ఆ త‌ర్వాత సోనిపేట్‌కు 9.40 నిమిషాల‌కు చేరుకుంటుంది.

Advertisement
మోదీ కొత్త చరిత్ర - విపక్షాలు కుదేల్, ఒక్క నిర్ణయంతో సీన్ ఛేంజ్..!!

దశల వారీగా విస్తరణకు ప్రణాళికలు

కాగా, హైడ్రోజన్‌ ఫర్‌ హెరిటేజ్‌ ఇన్నోవేషన్‌ కింద హైడ్రోజన్‌ పవర్‌తో నడిచే 35 రైళ్లను నడపాలని రైల్వే భావిస్తోంది. ప్రతి రైలుకు దాదాపు 80 కోట్లు ఖర్చు అవుతోంది. గ్రౌండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కోసం అదనంగా 70కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తోంది. హెరిటేజ్‌, హిల్‌స్టేషన్స్‌ రూట్స్‌లో ఈ రైళ్లను నడపేందుకు ప్రణాళికలు రచిస్తోంది.చెన్నైలో తయా రు చేస్తున్న రైలును జీంద్​కు తీసుకువచ్చాక ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే ఈ నెల 17న ఈ రైలు పట్టాలెక్కనుంది. ఈ రైలులో సుమారుగా 27 హైడ్రోజన్ సిలిండర్లను అమర్చారు. రైలులో ముందస్తు చర్యల్లో భాగంగా ఫైర్ డిటెక్టర్లను కూడా అమర్చారు. వీటిని క్రమం తప్పకుండా తనిఖీ చేసి, శుభ్రం చేస్తారు. ఈ రైలు ప్రారంభం ద్వారా భారతీయ రైల్వేలో మరో కొత్త శకం మొదలైనట్లేననే విశ్లేషణలు ఉన్నాయి.

English Summary

PM Modi will flag off India’s first Hydrogen train between Jind and Sonipat at Jind railway station in Haryana