శభాష్ సువేందు.. మమత బెనర్జీ చేయలేనిది మీరు చేసి చూపించారు

పశ్చిమ బెంగాల్‌లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. దక్షిణ 24 పరగణా జిల్లా బరుయ్ పూర్ లో సంచలనం సృష్టించిన మైనర్ బాలిక అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు ప్రభాస్ మొండల్ పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. ఈ తెల్లవారుజామున క్రైమ్ సీన్ రీక్రియేషన్ కోసం పోలీసులు నిందితుడిని ఘటనా స్థలానికి తీసుకువెళ్లిన సమయంలో ఈ ఎన్‌కౌంటర్‌ చోటు చేసుకుంది. పోలీసుల నుంచి ఆయుధం లాక్కుని కాల్పులు జరపడంతో, ఆత్మరక్షణ కోసం జరిపిన ఎదురుకాల్పుల్లో అతను మృతి చెందాడు.

ఈ ఎన్‌కౌంటర్ వివరాలను పోలీసులు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 12:45 గంటల సమయంలో నిందితుడు ప్రభాస్ మొండల్‌ను సూర్జ్యాపూర్ హాట్‌కు తీసుకెళ్లారు. అక్కడ సీన్ రీకన్ స్ట్రక్షన్ ప్రక్రియను చేపట్టారు. ఈలోపే నిందితుడు హఠాత్తుగా విధి నిర్వహణలో ఉన్న ఒక పోలీసు అధికారి తుపాకీని లాక్కున్నాడు. వెంటనే వారిపై ఒక రౌండ్ కాల్పులు జరిపి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు.

ఈ అనూహ్య చర్యతో ఉలిక్కిపడ్డ పోలీసులు వెంటనే ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఈ ఎన్ కౌంటర్ లో నిందితుడి బుల్లెట్ గాయాలయ్యాయి. అతన్ని వెంటనే చికిత్స నిమిత్తం బరుయ్ పూర్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు డాక్టర్లు ధృవీకరించారు. ఈ ఘటనపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమౌతోన్నాయి. అత్యాచారం నిందితులకు సువేందు అధికారి ప్రభుత్వం తగిన శిక్ష విధించిందని ప్రశంసిస్తోన్నారు.

ప్రభాస్ మండల్ ఈ నెల 4న తొమ్మిదేళ్ల మైనర్ బాలిక అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు. 5వ తేదీన సూర్జ్యాపూర్ హాట్ పరిసరాల్లో ఓ గోనె సంచిలో ఆ బాలిక మృతదేహం లభ్యమవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిరసనకారులు బరుయ్ పూర్-జయనగర్ రహదారిని దిగ్బంధించారు. టైర్లను తగులబెట్టారు. గంటల కొద్దీ బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసు వాహనాలను కూడా పెద్ద ఎత్తున ధ్వంసం చేశారు.

బాలిక మృతదేహం లభించిన కొన్ని గంటల్లోనే ఆగ్రహించిన స్థానికులు.. ఈ నేరంలో భాగస్వామ్యం ఉందనే అనుమానంతో ఇంద్రజిత్ మండల్ అనే వ్యక్తిని దారుణంగా కొట్టి చంపారు. పోలీసులు ఈ కేసును తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఆరుమంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ముగ్గురు నిందితులను అరెస్ట్ అయ్యాడు. ఈ కేసుతో ఎటువంటి ప్రమేయం లేని ఇంద్రజిత్ మండల్ హత్యకు గురి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అమాయకుడి ప్రాణాలు తీసి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి సువేందు అధికారి స్పష్టం చేశారు. స్థానికుల డిమాండ్ మేరకు సూర్జ్యాపూర్ ప్రాంతంలో ఒక కొత్త పోలీస్ అవుట్‌పోస్ట్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాలకు త్వరలోనే ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తామని పేర్కొన్నారు.

English Summary

Prabhas Mondal, Accused in Baruipur Case, Shot Dead During Crime Scene Reconstruction encounter. According to the police, the Baruipur Police Station s investigating officer, along with a team of other police officers, left the police station with accused Prabash Mondal at around 12 45 am.