బీహార్ లో అత్యంత కీలక నియోజకవర్గాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన బాంకీపూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తోన్నారు. ఈ ఉప ఎన్నిక ఫలితాలు.. దేశవ్యాప్తంగా ప్రాధాన్యతను చర్చనీయాంశం అయ్యాయి. అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ పోటీ చేశారు ఈ ఎన్నికల్లో. ఆయన భవితవ్యం ఏమిటనేది ఇంకాస్సేపట్లో తేలిపోతుంది.
బాంకీపూర్ తో పాటు మధ్యప్రదేశ్ లోని దతియా, గుజరాత్ లోని మంజాల్ పూర్ లో కూడా కిందటి నెల 31వ తేదీన పోలింగ్ ముగిసింది. ఈ ఉదయం సరిగ్గా 8 గంటలకు ఓట్ల లెక్కింపు ఆరంభమైంది. బాంకీపూర్ కు సంబంధించి పాట్నాలోని ఏఎన్ కాలేజీలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత ఈవీఎంలను ఓపెన్ చేస్తారు. దీనికోసం మొత్తం 14 టేబుళ్లను సిద్ధం చేశారు. మొత్తం 21 రౌండ్లలో ఈ లెక్కింపు పూర్తి కానుంది.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఖాళీ చేసిన నియోజకవర్గం ఇది. ఫలితంగా.. దీన్ని నిలబెట్టుకోవడానికి ఆ పార్టీ శక్తివంచన లేకుండా తన ప్రయత్నాలు సాగించింది. పార్టీ యువమోర్చా నాయకుడు నీరజ్ కుమార్ సిన్హాను బరిలో దింపింది. జన్ సురాజ్ తరఫున ఏకంగా ప్రశాంత్ కిశోర్ ఈ ఉప ఎన్నికల రేసులో నిల్చున్నారు. గట్టి పోటీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ఆర్జేడీ నుంచి రేఖా కుమారి గుప్తా పోటీ చేశారు. ఓట్ల లెక్కింపు కేంద్రం పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పాట్నా జిల్లా యంత్రాంగం, పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. పోలింగ్ సమయంలో కొన్ని ప్రాంతాల్లో జరిగిన చిన్నపాటి ఉద్రిక్తతలను దృష్టిలో ఉంచుకుని ఈసారి కౌంటింగ్ వద్ద మరింత జాగ్రత్త వహించారు. కౌంటింగ్ కేంద్రం ప్రధాన ద్వారం వద్ద అదనపు పోలీస్ బలగాలను మోహరించారు. బాంకీపూర్ శాసనసభ స్థానం ఉపఎన్నిక ఫలితం బీహార్ రాజకీయాల్లో కీలక మార్పులకు దారితీసే అవకాశం ఉంది. రాబోయే అసెంబ్లీ సమీకరణాలు, ప్రస్తుత ప్రభుత్వ ప్రజాదరణకు ఈ ఫలితాన్ని ఓ రెఫరెండంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాన పార్టీల అగ్రనేతలు అందరూ ప్రతిష్టాత్మకంగా ప్రచారం నిర్వహించిన నియోజకవర్గం కావడంతో ఇక్కడి గెలుపోటములపై దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతోంది.వరల్డ్ వార్ 2 ను మించిన దాడులు జరిగేవి: రెండే కండీషన్లు- డొనాల్డ్ ట్రంప్