విద్యార్థులను కేంద్రం అంధభక్తులుగా మార్చుతోంది- సమస్య అంతా ఆర్ఎస్ఎస్ తోనే

లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన.. విద్యావ్యవస్థ మొత్తం కూడా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గుప్పిట్లోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల దేశంలోని విద్యార్థులకు ఆర్ఎస్ఎస్ అసలు శత్రువుగా మారిందని ఆరోపించారు.

Advertisement

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై రాహుల్ గాంధీ మాట్లాడారు. ఆయన రాజీనామా పైపైన కనిపించే కంటితుడుపు చర్యలు మాత్రమేనని తేల్చి చెప్పారు. విద్యా శాఖను ధర్మేంద్ర ప్రధాన్ స్వయంగా నడపలేదని, కీ అంతా కూడా ఆయన కార్యాలయంలో ఉన్న ఓ ఓఎస్డీ చేతుల్లోకి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో విద్యా మంత్రిత్వ శాఖ నడుస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

దేశంలో విద్యార్థులు తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకునే పూర్తి స్వేచ్ఛను కోల్పోతున్నారని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. నిరంతరం ప్రశ్నించే తత్వాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అణచివేస్తోందని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ తన ఊహాజనిత భావజాలంతో కూడిన అశాస్త్రీయ చరిత్రను విద్యార్థులపై బలవంతంగా రుద్దుతోందని ఆరోపించారు. దేశంలో విద్యార్థులు తమ మనసులోని మాటను ధైర్యంగా చెప్పడానికి, సందేహాలను నివృత్తి చేసుకోవడానికి వీలు లేకుండా ఈ వ్యవస్థ తయారైందని ధ్వజమెత్తారు.

టెలిగ్రామ్ కు సంకటం- రష్యా మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లో.. !!

గతంలో యూపీఏ హయాంలో లాగా తమ ప్రభుత్వంలో మంత్రులు రాజీనామాలు చేయబోరంటూ కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ ఈ సందర్భంగా సభలో గుర్తుచేశారు. ఆ వ్యాఖ్యలు నూటికి నూరు శాతం నిజమేనని, ఎందుకంటే ఇక్కడ నిర్ణయాధికారాలు కేంద్ర మంత్రుల చేతుల్లో లేవని ఎద్దేవా చేశారు. ఇదంతా ఒక దోపిడీ వ్యవస్థగా మారిందని, విద్యార్థులను ప్రశ్నించే జ్ఞానం లేకుండా అంధభక్తులుగా మార్చడమే ఆర్ఎస్ఎస్ అంతిమ లక్ష్యమని దుయ్యబట్టారు.

Advertisement

నీట్ పేపర్ లీకేజీ అంశాన్నీ రాహుల్ గాంధీ సభలో ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు చేసిన ఉద్యమాన్ని హింసగానో, వారి ఆగ్రహంగానో చిత్రీకరించడం తగదని సూచించారు. దేశ యువత తమ ఆశయాలు, ఉజ్వల భవిష్యత్తును కాపాడుకునేందుకు శాంతియుతంగా వ్యక్తం చేసిన నిరసనగా గుర్తించాలని అధికార పక్షానికి హితవు పలికారు. విద్యార్థుల ఆవేదనను, వారి గొంతుకను గౌరవించడం అన్ని రాజకీయ పార్టీల కనీస బాధ్యత అని స్పష్టం చేశారు.

English Summary

Rahul Gandhi Says in Lok Sabha Education System Run by RSS, they want people to be Andhbhakts. Referring to the demand for the resignation of Union Education Minister Dharmendra Pradhan, Gandhi said, Rajnath Singh said that we are not the UPA, our ministers never resign. He is right.