పట్టాలెక్కుతున్న తొలి హైడ్రోజన్ రైలు - ముహూర్తం ఫిక్స్: రూట్, ప్రత్యేకతలు..!!

దేశంలో తొలి హైడ్రోజన్ రైలు పట్టాలెక్కనుంది. ఇందుకు ముహూర్తం ఖరారైంది. రూట్ సైతం అధికారులు ఫిక్స్ చేసారు. ప్రధాని మోదీ ఈ రైలును ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకు డీజిల్, విద్యుత్ రైళ్లు నడుస్తుండగా.. హైడ్రోజన్‌తో నడిచే తొలి రైలు అందుబాటులోకి రాబోతోంది. జీంద్ నుంచి సోనిపత్ మధ్య నడవనుంది. ఈ రైలుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ రైలు ప్రారంభం అయిన తరువాత దశల వారీగా విస్తరించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.

Advertisement

హైడ్రోజన్‌తో నడిచే తొలి రైలు అందుబాటులోకి రాబోతోంది. ఇప్పటికే వందేభారత్, వందేభారత్ స్లీపర్, అమృత్ భారత్ రైళ్లకు ఆదరణ పెరుగుతోంది. రెండో వందేభారత్ స్లీపర్ ను ముంబాయి నుంచి బెంగళూరు మధ్య నడిపేందుకు రైల్వే శాఖ సిద్దం అయింది. ఇక.. ఇప్పుడు తొలి హైడ్రోజన్ రైలును నుంచి సోనిపత్ మధ్య నడవనుంది. ఈ నెల 17న ఈ రైలును ప్రారంభించే ఆలోచన చేస్తున్నారు. కాగా, 75 కిలోమీటర్ల ప్రారంభ వేగంతో నడుస్తుంది. రీసెర్చ్‌, డిజైన్‌, స్టాండర్డ్‌ సంస్థ తొలి హైడ్రోజన్‌ శక్తితో నడిచే రైలు డిజైన్‌ను రూపొందించింది. ఈ రైలు గరిష్ఠంగా గంటకు 110 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. హైడ్రోజన్‌ ఫర్‌ హెరిటేజ్‌ ఇన్నోవేషన్‌ కింద హైడ్రోజన్‌ పవర్‌తో నడిచే 35 రైళ్లను నడపాలని రైల్వే భావిస్తోంది. ప్రతి రైలుకు దాదాపు 80 కోట్లు ఖర్చు అవుతోంది.

Advertisement

రైల్వే నిర్వహణలో కొత్త విప్లవం

కాగా, గ్రౌండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ కోసం అదనంగా 70కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేస్తోంది. హెరిటేజ్‌, హిల్‌స్టేషన్స్‌ రూట్స్‌లో ఈ రైళ్లను నడపేందుకు ప్రణాళికలు రచిస్తోంది.చెన్నైలో తయా రు చేస్తున్న రైలును జీంద్​కు తీసుకువచ్చాక ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే ఈ నెల 17న ఈ రైలు పట్టాలెక్కనుంది. ఈ రైలులో సుమారుగా 27 హైడ్రోజన్ సిలిండర్లను అమర్చారు. రైలులో ముందస్తు చర్యల్లో భాగంగా ఫైర్ డిటెక్టర్లను కూడా అమర్చారు. వీటిని క్రమం తప్పకుండా తనిఖీ చేసి, శుభ్రం చేస్తారు. ఈ రైలు ప్రారంభం ద్వారా భారతీయ రైల్వేలో మరో కొత్త శకం ప్రారంభమైనట్లేనని భావిస్తున్నారు.

English Summary

Railways has approved the introduction of a 10-coach hydrogen fuel cell-based trainset on the Jind-Sonepat section of Northern Railway