పాపం: రూ. 10 కోసం టెక్కీ దారుణ హత్య, అదే రోజు భార్య పండంటి మగబిడ్డకు!


బెంగళూరు: విప్రో కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్న యువకుడు కేవలం రూ. 10 కోసం దారుణ హత్యకు గురైన ఘటన బెంగళూరు నగరంలోని గిరినగర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. గిరినగరలో నివాసం ఉంటున్న గురుప్రశాంత్ (31) అనే టెక్కీ హత్యకు గురైనాడు. అదే రోజు గురుప్రశాంత్ భార్యకు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.

బెంగళూరులోని బెళ్లందూరులోని విప్రో కంపెనీలో గురుప్రశాంత్ సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. గురుప్రశాంత్ భార్య మమత, తల్లిదండ్రులు హనుమంతరాయప్ప, సిద్దగంగమ్మతో కలిసి గిరినగరలో నివాసం ఉంటున్నాడు.

బెంగళూరులో మహిళలకు సైకో చిత్రహింసలు, ప్యాంట్ విప్పేసి అసభ్యంగా, చివరికి !

ఈనెల 6వ తేదీ రాత్రి గురుప్రశాంత్ రెస్యూమ్ ప్రింట్ తీసుకోవడానికి ఇంటి సమీపంలోని సైబర్ కేఫ్ సెంటర్ కు వెళ్లాడు. ఆ సమయంలో ఈ-మెయిల్ లో ఉన్న రెస్యూమ్ కలర్ ప్రింట్ తీసి ఇవ్వాలని గురుప్రశాంత్ సైబర్ కేఫ్ సెంటర్ లో ఉన్న కార్తిక్ కు చెప్పాడు.

కార్తిక్ కలర్ ప్రింట్ తీసి ఇవ్వకుండా రెస్యూమ్ బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ తీసి గురుప్రశాంత్ కు ఇచ్చాడు. కలర్ ప్రింట్ కు బ్లాక్ అండ్ వైట్ ప్రింట్ కు తేడా లేదా అంటూ గురుప్రశాంత్ కార్తిక్ ను ప్రశ్నించాడు. ఇద్దరి మద్య మాటామాటా పెరగడంతో గురుప్రశాంత్ సహనం కోల్పోయాడు.

కార్తిక్ షర్టు కాలర్ పట్టుకున్న గురుప్రశాంత్ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా అని గట్టిగా అన్నాడు. ఆ సమయంలో టేబుల్ మీద ఉన్న స్క్రూడ్రైవర్ తీసుకున్న కార్తిక్ ప్రశాంత్ ఎడమచెవి పక్కన బలంగా పోడిచాడు. తీవ్రగాయం కావడంతో గురుప్రశాంత్ అక్కడే కుప్పకూలిపోయాడు.

స్టార్ హీరోకు హైకోర్టులో చుక్కెదురు: రూ. 23 లక్షలు అద్దె చెల్లించి ఇల్లు ఖాళీ చెయ్యండి!

స్థానికులు విషయం గుర్తించి గురుప్రశాంత్ ను సమీపంలోని రాధాకృష్ణ ఆసుపత్రికి తరలించారు. స్క్రూడ్రైవర్ మెదడుకు తగలడంతో తీవ్రంగా రక్తం పోయి గురుప్రశాంత్ కోమాలోకి వెళ్లిపోయాడు. చికిత్స విఫలమై మంగళవారం గురుప్రశాంత్ మరణించాడని వైద్యులు తెలిపారు.

దురదృష్టం ఏమిటంటే గురుప్రశాంత్ మరణించిన రోజే అతని భార్య మమత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. గురుప్రశాంత్ మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగించిన గిరినగర పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Have a great day!
Read more...

English Summary

Murder: A 31-year-old software engineer, who walked into a South Bengaluru cybercafe to get colour print of his resume and was stabbed in the left ear after an altercation with a staffer.