ఉప ప్రధానిగా అమిత్ షా..? మోదీ నిర్ణయం వెనుక..!?

జాతీయ రాజకీయాల్లో మరో సంచలనం. మోదీ 4.0 లక్ష్యంగా కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇప్పటికే కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ప్రభుత్వం.. పార్టీలో సమూల ప్రక్షాళన దిశగా మోదీ టీం తుది కసరత్తు చేస్తోంది. ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలోనే కొత్త టీంల తో యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని భావిస్తున్నారు. అందులో భాగంగా హోం మంత్రి అమిత్ షా కు ప్రమోషన్ దక్కనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఈ చర్చ ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారుతోంది.

Advertisement

ప్రధాని మోదీ కొత్త నిర్ణయాలతో సిద్దం అవుతున్నారు. పాలనా పరంగా- రాజకీయంగా ఊహించని నిర్ణయాలు అమలుకు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తన కేబినెట్ సమూల ప్రక్షాళన చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. ప్రధాని మోదీకి అన్నింటా తోడుగా నిలుస్తున్న హోం మంత్రి అమిత్ షా కు మరింత కీలక బాధ్యతలు అప్పగించేందుకు సిద్దం అవుతున్నట్లు ఢిల్లీ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అమిత్ షా కు ఉప ప్రధానిగా అవకాశం ఇవ్వనున్నారనేది ఈ ప్రచార సారాంశం. గతంలో ఎల్ కే అద్వానీ సైతం వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్న సమయంలో ఉప ప్రధానిగా వ్యవహరించారు. బీజేపీ భవిష్యత్ కోసం వ్యూహాత్మకంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. త్వరలో జరిగే కేబినెట్ ప్రక్షాళనలో ఈ మార్పు ఉండే అవకాశం ఉందని సమాచారం.

Advertisement

మోదీ 4.0 లక్ష్యంగా అనూహ్య నిర్ణయాలు

అదే విధంగా పలువురు కీలక మంత్రుల శాఖలు మారనున్నాయి. నిర్మలా సీతారామన్ కు హెఆర్డీ, ఆర్బీఐ మాజీ గవర్నర్ శక్తికాంత్ దాస్ కు ఆర్దిక శాఖ, మనోజ్ సిన్హాకు రైల్వే శాఖ, నితీశ్ కుమార్ కు గ్రామీణాభివృద్ధి శాఖ, ఆప్ నుంచి బీజేపీలో చేరిన రాఘవ చద్దాకు విమానయాన శాఖ ఇవ్వటంతో పాటుగా కొందరి శాఖలు మార్చనున్నారని సమాచారం. కొందరికి ఉద్వాసన తప్పదని తెలుస్తోంది. తప్పించిన మంత్రులకు పార్టీ బాధ్యతలు అప్పగించనున్నారు. అమిత్ షా హోం శాఖ బాధ్యతలు చేపట్టిన తరువాత అనేక అనూహ్య నిర్ణయాలను అమలు చేసారు. అదే విధంగా హోం మంత్రి గా అద్వానీ 2,193 రోజులు పదవిలో కొనసాగారు. ఇప్పుడు ఆ రికార్డును అమిత్‌ షా అధిగమించారు.
ఆర్డికల్ 370 రద్దు, నక్సలిజం పై ఉక్కుపాదంతో పాటుగా రాజకీయంగానూ మోదీ నిర్ణయాలను అమలు చేయటంలో సక్సెస్ అయ్యారు. దీంతో.. ఇప్పుడు ఆయనకు ఉప ప్రధానిగా ప్రమోషన్ ఇస్తారనే ప్రచారం సాగుతోంది. కాగా.. నిజంగానే అమిత్ షా ఉప ప్రధాని అవుతారా.. లేదా అనేది అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

English Summary

Union Cabinet could witness a major reshuffle with Amit Shah likely to be elevated to the post of Deputy PM As reports