అమెరికాకు బిగ్ షాక్ ఇచ్చిన చైనా..! మరోసారి టారిఫ్ వార్ తప్పదా..?

అగ్రరాజ్యం అమెరికాపై చైనా ప్రతీకార చర్యలకు పాల్పడుతోంది. దాంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు కలిగిన దేశాలుగా ఉన్న అమెరికా- చైనా మధ్య మరోసారి టారిఫ్ వార్ తప్పేలా లేదని తెలుస్తోంది. తాజాగా అమెరికా విధించిన వాణిజ్య ఆంక్షలకు ప్రతీకారంగా చైనా కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు అమెరికన్ కంపెనీలపై చైనా ఆంక్షలు విధించింది. అలాగే డ్రోన్స్ ఎగుమతులపై ఆంక్షలు విధించింది.

Advertisement

ఈ చర్యలను బుధవారం చైనా అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతకుముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యూహాత్మక విధానంలో భాగంగా చైనాతో పాటు 50 ఇతర దేశాలపై సుంకాలు విధిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. వాణిజ్య పరంగా ఉన్న అసమానతలను రూపుమాపేందుకు అమెరికా ఈ నిర్ణయం తీసుకుందని ట్రంప్ సమర్థించుకున్నారు. అయితే అమెరికా నిర్ణయానికి ప్రతీకారంగా చైనా దుందుడుకుగా వ్యవహరిస్తోంది. దాంతో ఇరు దేశాల వాణిజ్యం వార్ ప్రభావం చిన్న చిన్న దేశాలపై పడే ప్రమాదం ఉందని అంతర్జాతీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

చైనా వాణిజ్య వ్యవహారలకు అమెరికా భంగం కలిగిస్తోందని చైనాకు చెందిన మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికాపై ప్రతీకార చర్యలకు చైనా ఉపక్రమించిందని పేర్కొంది. వాటిలో డ్రోన్స్ ఎగుమతిపై ఆంక్షలు, టెక్నాలజీ ఇతర విభాగాల్లోని ఉత్పత్తుల ఎగుమతిపై ఆంక్షలు విధించింది. అలాగే ఆరు అమెరికన్ కంపెనీలపై ఆంక్షలు విధిస్తూ చైనా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ పేర్కొంది. ఇకపై ఈ కంపెనీలతో లావాదేవీలు, వాణిజ్యం జరిపేందుకు చైనా జాతీయులు నిషేధం అని తెలిపింది. దాంతో ఈ కంపెనీల అభివృద్ధిపై ప్రభావం పడే అవకాశం ఉంది.

Advertisement

చైనా బ్లాక్ లిస్ట్‌ లో చేర్చిన కంపెనీలలో బయోటెక్నాలజీ రంగానికి చెందిన అప్లైడ్ డీఎన్‌ ఏ సైన్సెస్ అలాగే స్ట్రాటమ్ రిజర్వాయర్ వంటి సంస్థలు ఉన్నాయి. ఇకపై ఈ కంపెనీలతో చైనా వ్యక్తులు, సంస్థలు వ్యాపార సంబంధాలు కొనసాగించకూడదని ఆదేశించింది. ఇందుకు సంబంధించిన ఆదేశాలను చైనా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు ఇప్పటికే చైనాలో తయారైన హ్యూమనాయిడ్, నాలుగు కాళ్లతో నడిచే రోబోట్ల దిగుమతులపై అమెరికా నిషేధం విధించింది. దాంతో రానున్న రోజుల్లో ఇరు దేశాల మధ్య టారిఫ్ వార్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.