ఫోన్ చేసి బతిమిలాడారు.. చివరి నిమిషంలో తప్పిన మహాయుద్ధం: ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్!

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పశ్చిమాసియాలో శాంతి దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇరాన్ పై అతిపెద్ద సైనిక దాడికి అమెరికా అన్ని సన్నాహాలు పూర్తి చేసుకున్నప్పటికీ.. చివరి నిమిషంలో దౌత్యపరమైన చర్చలు ప్రారంభం కావడంతో ఆ ప్రమాదం తప్పిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన విషయాలను వెల్లడించారు.

Advertisement
ఇండియన్ ఆర్మీ సంచలనం.. 23 వేల కోట్లతో.. చైనా, పాక్ కు బ్యాడ్ న్యూస్..!
Advertisement

భయంతో చర్చలకు దిగొచ్చిన ఇరాన్
లాస్ వెగాస్ లో జరిగిన ఓ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. తమ సైనిక బలగాల తీవ్ర ఒత్తిడి కారణంగానే ఇరాన్ వెనక్కి తగ్గి చర్చల కోసం దిగొచ్చిందని ఆయన అన్నారు. అమెరికా ప్లాన్ చేసిన భారీ సైనిక చర్యకు కొద్దిసేపటి ముందే ఇరాన్ అధికారులు తమను సంప్రదించి.. దాడి చేయవద్దని, మాట్లాడి సమస్యను పరిష్కరించుకుందామని కోరినట్లు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. అమాయక ప్రజల ప్రాణాలు పోవడం తనకు ఇష్టం లేదని.. అందుకే యుద్ధం కంటే దౌత్యపరమైన ఒప్పందానికే తాను మొదటి ప్రాధాన్యత ఇస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాన్ని సాధించకూడదనే తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

Advertisement

యుద్ధ నష్టపరిహారంపై గల్ఫ్ దేశాల చర్చలు
ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించే క్రమంలో గల్ఫ్ సహకార మండలిలోని కొన్ని సభ్య దేశాలు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ వంటి దేశాలు ఇరాన్ కు యుద్ధ నష్టపరిహారంగా దాదాపు రూ.9 లక్షల కోట్లు చెల్లించేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం. అయితే సౌదీ అరేబియా మాత్రం ఈ విషయంలో ఇంకా సంకోచిస్తోంది. ప్రాంతీయ భద్రతలో భాగస్వామిగా ఉన్న ఇజ్రాయెల్ కూడా ఈ నష్టపరిహారంలో తన వాటాను చెల్లించాలని సౌదీ అరేబియా కోరుతోంది. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. అమెరికాతో మంచి సంబంధాలు ఉన్నప్పటికీ తమ దేశ రక్షణ కోసం ఎలాంటి నిర్ణయానికైనా సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు.

Advertisement
హసీనా రీఎంట్రీ ప్రకటన ఎఫెక్ట్.. మాజీ కెప్టెన్ ఇంటిపై పెట్రోల్ బాంబుల దాడి!

హార్ముజ్ జలసంధిపై కుదరనున్న ఒప్పందం
ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హార్ముజ్ జలసంధిని తిరిగి సురక్షితంగా తెరవడంపై జరుగుతున్న చర్చలు ఇప్పుడు చివరి దశకు చేరుకున్నాయి. ఒమన్ మధ్యవర్తిత్వంతో ఇరాన్ విదేశాంగ శాఖ ఓ సంయుక్త ఒప్పంద ముసాయిదాను సిద్ధం చేస్తోంది. ఇతర బాహ్య శక్తుల ప్రమేయం లేకపోతే ఒకట్రెండు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. అమెరికా సైనిక ఒత్తిడి, దౌత్యపరమైన వ్యూహాల వల్ల గల్ఫ్ ప్రాంతంలో ముప్పు తొలగిపోయి క్రమంగా స్థిరత్వం ఏర్పడే దిశగా అడుగులు పడుతున్నాయి.

English Summary

US President Donald Trump claimed Iran sought last-minute talks to prevent a major US military strike, saying diplomacy averted a wider conflict.