నేను పోతే.. మీరూ పోతారు: పాత మోడల్ ఎయిర్ ఫోర్స్ వన్ లోనే జర్నీ

మధ్యప్రాచ్యంలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. హోర్ముజ్ జలసంధిలో అంతర్జాతీయ చమురు నౌకలపై జరిగిన దాడులకు ప్రతిచర్యగా అమెరికా సైన్యం ఇరాన్‌పై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇరాన్‌కు చెందిన సుమారు 80 వ్యూహాత్మక సైనిక స్థావనాలపై క్షిపణులతో దాడులు చేసింది. ఈ ఆకస్మిక పరిణామంతో పశ్చిమాసియా, మధ్యప్రాచ్యం మధ్య ఉద్రిక్తతలు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. గల్ఫ్ రీజియన్‌లో తీవ్ర ఆందోళనకర పరిస్థితులు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

ఈ తాజా సైనిక చర్యల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనను హతమార్చడానికి ఇరాన్ కుట్ర పన్నిందని ప్రకటించారు. ఆ దేశం రూపొందించిన హిల్ లిస్ట్ లో అందరికంటే మొదట తన పేరే ఉందని తేల్చి చెప్పారు. ఇరాన్ రూపొందించిన హిట్ లిస్ట్‌లో తానే మొదటి స్థానంలో ఉన్నానని చెప్పుకొన్నారు. ఆ దేశాన్ని అన్ని విధాలా దిగ్బంధించానని, అందుకే తనను మట్టు బెట్టడానికి శాయశక్తులా ప్రయత్నాలు సాగిస్తోందని పేర్కొన్నారు.

Advertisement

నాటో సదస్సు ముగించుకుని అంకారా నుంచి అమెరికాకు తిరుగు ప్రయాణమైన సమయంలో ఎయిర్ ఫోర్స్ వన్ లో మార్పులు చేశారు. ఇందులో ప్రయాణిస్తున్న విలేకరులకు విండో బ్లైండ్స్ పూర్తిగా మూసివేయాలని ఆదేశించారు. దీనికి గల కారణాలపై విలేకరులు ప్రశ్నించగా.. ఇరాన్‌ను ఉద్దేశించి ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఉన్న కొందరి వల్లే ఈ రకమైన కఠిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చిందని బదులిచ్చారు.

తనకు నిరంతరం ప్రాణహాని పొంచి ఉందని, ఇరాన్ ప్రధాన శత్రువును తానేనని గుర్తు చేశారు. ఇక్కడ ఏదైనా జరిగితే, తనతో పాటు ప్రయాణిస్తున్న విలేకరులకూ ప్రమాదం తప్పదని,. అంతగా భయం వేస్తే జర్నలిజం జాబ్ ను మార్చుకోవడం మంచిదని సలహా ఇచ్చారు. ఈ తిరుగు ప్రయాణంలో ట్రంప్ పాత మోడల్ ఎయిర్ ఫోర్స్ వన్ విమానాన్ని ఎంచుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అనేక ఊహాగానాలకు దారితీసింది.

Advertisement

నూతన జెట్ విమానంలో కొన్ని కీలక సాంకేతిక లోపాలు ఉన్నాయని, ఆ విమానం క్షిపణి దాడులను సమర్థంగా తిప్పికొట్టలేదనే వార్తలు వచ్చాయి. ఈ భద్రతా ఆందోళనల వల్లే ట్రంప్ ఆఖరి నిమిషంలో పాత మోడల్ విమాన ప్రయాణానికి మొగ్గు చూపారనే వాదనలు ఉన్నాయి. ఈ విమానం మార్పు వెనుక ఎలాంటి నిర్దిష్ట ఇంటెలిజెన్స్ సమాచారం లేదని ప్రెసిడెంట్ ట్రంప్ కొట్టిపారేశారు. పాత విమానంలో ప్రయాణించడంలో ఉన్న అనుభూతి నూతన జెట్ లో లేదని పేర్కొన్నారు. అందు కోసమే పాత మోడల్ ను ఎంచుకున్నానని సమర్థించుకున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో వైట్ హౌస్ ఓ ప్రకటన చేసింది. జెట్ విమానం అత్యంత సురక్షితమైనదని, ప్రెసిడెంట్ అధికారిక పర్యటనలకు అవసరమైన అత్యంత అధునాతన రక్షణ సాంకేతిక వ్యవస్థలు అందులో ఉన్నాయని స్పష్టం చేసింది. అయినప్పటికీ, విమానాన్ని మార్చడం, ప్రయాణంలో విండోస్ మూసివేయాలని చెప్పడం వంటి చర్యలు అమెరికా అధ్యక్ష భద్రత చుట్టూ ఉన్న ఆందోళనలను మరింత తీవ్రతరం చేశాయి.

English Summary

Donald Trump Defends Closed Blinds on Air Force One, Says “If I Go, You Go” as Iran Threat Concerns. The President further addressed concerns about potential threats from Iran, stating, I have a threat all the time. I'm No. 1 on their list, before you. But if I go, you go.