డొనాల్డ్ ట్రంప్‌కు తృటిలో తప్పిన ప్రమాదం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. మంగళవారం వాషింగ్టన్‌లో డొనాల్డ్ ట్రంప్ ప్రయాణిస్తున్న సైనిక హెలికాప్టర్ ఓ ప్రయాణీకుల విమానానికి చాలా సమీపంగా వెళ్లింది. ఆ సమయంలో హెలికాప్టర్‌లో డొనాల్డ్ ట్రంప్ ఉండటం.. మరోవైపు ప్రయాణీకుల విమానం కావడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్పోర్టు సమీపంలో జరిగిన ఈ ఘటన.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌పై ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ పరిస్థితి ఎందుకు తలెత్తింది.. తప్పెవరిది అని నిర్ధారించడానికి అమెరికా ఏజెన్సీలు ఇప్పుడు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నాయి.

Advertisement
ఫోన్ చేసి బతిమిలాడారు.. చివరి నిమిషంలో తప్పిన మహాయుద్ధం: ట్రంప్ సెన్సేషనల్ కామెంట్స్!
Advertisement

అసలేం జరిగిందంటే..
ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం సుమారు 2:30 గంటలకు జరిగింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెలికాప్టర్ వైట్ హౌస్ సమీపంలోని ఎలిప్స్ నుంచి జాయింట్ బేస్ ఆండ్రూస్‌కు బయలుదేరింది. సుమారు ఒక నిమిషం తరువాత, ఎన్వాయ్ ఎయిర్‌కు చెందిన E-170 అనే ప్రయాణీకుల విమానం రీగన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరింది. ఆ ప్రయాణీకుల విమానం ఎయిర్పోర్టు దాటిన కొద్దిసేపటికే ట్రంప్ హెలికాప్టర్ కూడా విమానాశ్రయం వైపుగా వెళ్ళింది. ఆ రెండు ఒకదానికొకటి సురక్షితమైన దూరంలోకి వచ్చాయి. అయితే డొనాల్డ్ ట్రంప్‌కు గానీ, ప్రయాణీకుల విమానంలోని ప్రయాణికులకు గానీ ప్రమాదం ఏమీ జరగలేదు.

Advertisement

రెండు విమానాల మధ్య ఎంత దూరం అవసరం?
నిబంధనల ప్రకారం ఈ ప్రాంతంలో ఎగిరే విమానాలు కనీసం 1.5 మైళ్ల దూరాన్ని, 500 అడుగుల ఎత్తు తేడాను పాటించాలి. అమెరికా అధికారులు జరిపిన ప్రాథమిక విచారణలో ఆ రెండు విమానాలు ఒకదానికొకటి నేరుగా ఎదురుగా రావడం లేదని, కానీ అనుమతించబడిన దూరం కంటే తక్కువ దూరంలో ఉన్నాయని వెల్లడైంది.

హసీనా రీఎంట్రీ ప్రకటన ఎఫెక్ట్.. మాజీ కెప్టెన్ ఇంటిపై పెట్రోల్ బాంబుల దాడి!

వైట్ హౌస్ ఏమి చెప్పిందంటే?
మరోవైపు అధ్యక్షుడికి ఎటువంటి ప్రమాదం లేదని వైట్ హౌస్ స్పందించింది. మెరైన్ వన్ హెలికాప్టర్లను అత్యంత ప్రతిభావంతమైన పైలట్లు నడుపుతారని.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపింది. రెండు విమానాల మధ్య దూరం తగ్గినప్పుడు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు కమర్షియల్ పైలట్, మెరైన్ వన్ పైలట్ ఇద్దరితోనూ సంప్రదింపులు జరిపారని యూఎస్ ఏవియేషన్ రెగ్యులేటర్(FAA) తెలిపింది. అధ్యక్షుడికి ఎటువంటి ప్రమాదం జరగలేదని.. ఈ ఘటన గురించి సమీక్షస్తున్నామని.. మా దర్యాప్తు ఆధారంగా అవసరమైన దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

Advertisement

English Summary

US President Donald Trump narrowly avoided a potential aviation incident after Marine One flew unusually close to a commercial passenger aircraft near Ronald Reagan Washington National Airport.