ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటా - మొజ్తబా ఖమేనీ

ఇరాన్ సర్వాధ్యక్షుడు అయతొల్లా అలీ ఖమేనీ మరణం ప్రపంచ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ జరిపిన సైనిక దాడుల నేపథ్యంలో ఆయన మరణించిన విషయం తెలిసిందే. 1989లో సుప్రీం లీడర్ బాధ్యతలు చేపట్టిన ఖమేనీ, ఇరాన్‌లో అత్యున్నత అధికారిగా వ్యవహరించారు. అంతేకాక ఈ దాడుల్లో ఖమేనీ కుమార్తె, మనవడు, కోడలు, అల్లుడు మరణించారు. అయితే ఖమేనీ మరణంతో ఆయన వారసుడిగా మొజ్తబా ఖమేనీ ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్‌గా నియమించింది.

Advertisement

కాగా ఇన్ని రోజులు సీజ్ ఫైర్ ఉన్న నేపధ్యంలో అంతా ప్రశాంతంగా ఉందని భావించారు. అయితే అమెరికా-ఇరాన్‌ మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్న వేళ ఇరాన్‌ సుప్రీం లీడర్‌ మొజ్తబా ఖమేనీ (Mojtaba Khamenei) స్పందించారు. తన తండ్రి ఆయతుల్లా అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేశారు. బాధ్యులైన వారు పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఇది తమ దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్ అని.. దానిని ఖచ్చితంగా నెరవేరుస్తానని వ్యాఖ్యానించారు. ఈ మేరకు టెలిగ్రామ్‌లో ఓ సందేశాన్ని విడుదల చేయగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారింది.

Advertisement

మొజ్తబా ఖమేనీ ఇంకా ఏమన్నారంటే..

తమ నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీతో పాటు అమరులైన వారందరి కోసం హంతకులపై ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు. అయితే ఈ విషయం తన నాయకత్వంపై లేదా ఇతర అధికారులపైనా ఆధారపడి లేదన్నారు. తనను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ (Donald Trump) ఇరాన్‌ను హెచ్చరించిన విషయం తెలిసిందే.

ఇక ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త దాడుల్లో ఆయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందగా.. జూలై 9న ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. అయితే ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన మొజ్తబా మాత్రం.. తండ్రి అంత్యక్రియల కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. కానీ మిగతా కుతూఎంబిఏ సభ్యులు అంత్యక్రియాల్లో పాల్గొని నివాళులు అర్పించారు.

English Summary

The death of Iranian Supreme Leader Ayatollah Ali Khamenei has become a hot topic of debate in world politics. It is known that his death came in the wake of military attacks on Iran by the United States and Israel.