అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇరాన్‌పై దాడులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణాన్ని పూర్తిగా నివారించాలంటే ఇరాన్ త్వరితగతిన తమతో పాటు ఇతర మిత్రదేశాలతో శాంతి ఒప్పందానికి రావాలని తేల్చి చెప్పారు. దీనికోసం ఆయన గడువు సైతం విధించారు. ఈ వ్యూహాత్మక సంప్రదింపులకు ఇజ్రాయెల్ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించిందని స్పష్టం చేశారు.
దీనిపై ఆయన తాజాగా ఎయిర్ ఫోర్స్ వన్ లో విలేకరులతో మాట్లాడారు. ఒకవేళ ఆ దాడి జరిగి ఉంటే.. రెండో ప్రపంచ యుద్ధానికి మించి ఉండేదని తేల్చి చెప్పారు. ఇరాన్‌ను సమూలంగా తుడిచిపెట్టేసేదని పేర్కొన్నారు. యుద్ధం కంటే శాంతియుత దౌత్యచర్చలకే ప్రాధాన్యత ఇచ్చానని అన్నారు. సోమవారం మధ్యాహ్నం నుంచే అమెరికా- ఇరాన్ మధ్య శాంతి చర్చలు ప్రారంభం కానున్నాయని ట్రంప్ వెల్లడించారు. తాను తీసుకున్న ఈ నిర్ణయం ఎంతోమంది సైనికులు, పౌరుల ప్రాణాలు కాపాడిందని వ్యాఖ్యానించారు.
ఇరాన్‌తో చర్చలకు ఎటువంటి కఠిన గడువును విధించట్లేదని ట్రంప్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. హార్ముజ్ జలసంధిని వెంటనే పూర్తి స్థాయిలో పునఃప్రారంభించడం, ఇరాన్ అణు ముప్పును శాశ్వతంగా అంతం చేయడమే ఈ చర్చల ప్రధాన ఉద్దేశమని పునరుద్ఘాటించారు. ఈ రెండు షరతులకు ఇరాన్ అంగీకరించాల్సి ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. చర్చలకు తుది గడువు అంటూ ప్రస్తుతానికి ఏదీ లేదని వివరించారు. ఈ యుద్ధాన్ని నివారించడానికి సౌదీ అరేబియా కూడా దౌత్య మార్గాన్నే కోరుకుంటోందని గుర్తు చేశారు. ఈ విషయంపై సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఇదివరకే డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడిన విషయం తెలిసిందే. ఆయా దేశాల ఒత్తిళ్లతో త్వరలోనే ఇరాన్ తాము ప్రతిపాదించిన షరతులతో కూడిన ఒప్పందానికి అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైజల్ బిన్ ఫర్హాన్, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌లతో ఫోన్‌లో సంభాషించారు. ఈ సందర్భంగా ప్రాంతీయ భద్రత, పరస్పర సహకారంపై వారు విస్తృతంగా చర్చించారు. హార్ముజ్ జలసంధి నౌకాయానానికి సంబంధించి ఒమన్‌తో ఇరాన్ జరుపుతున్న చర్చలు కూడా ప్రస్తుతం తుది దశకు చేరుకున్నట్లు ఇరాన్ వెల్లడించింది.ఫైనల్ గా కామన్వెల్త్ లో భారత్ స్థానం ఇదీ.. !!