ఆ రోజను ఇండియా డే గా ప్రకటించిన అమెరికన్ స్టేట్- మనోళ్ల కాంట్రిబ్యూషన్ కు గుర్తుగా

ఇంకొద్ది రోజుల్లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోబోతోన్నాం. ఇవి.. 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. ఈ నెల 15వ తేదీన శనివారం నాడు దేశ రాజధానిలోని ఎర్రకోట వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఆయన కొన్ని కీలక ప్రకటనలను చేసే అవకాశాలు లేకపోలేదు. గత ఏడాది ఇండిపెండెన్స్ డే నాడు జీఎస్టీ రాయితీలను ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

ఈ క్రమంలో అటు అమెరికాలో స్జిరపడ్డ భారతీయులు కూడా పంద్రాగస్టు వేడుకల కోసం సిద్ధమౌతున్నారు. ఈ క్రమంలో.. మసాచుసెట్స్ స్టేట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 15వ తేదీని మసాచుసెట్స్ ఇండియా డే గా జరుపుకోనుంది. ఇది ప్రతి సంవత్సరం కూడా దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఇండియా డే గా జరుపుకోవాలని గవర్నర్ మౌరా హీలీ ప్రకటించారు. ఈ రాష్ట్ర ఆర్థిక పురోగతి, సాంస్కృతిక వికాసానికి భారతీయ అమెరికన్లు అందిస్తోన్న విశేష సేవలను గుర్తిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Advertisement

బోస్టన్ సిటీ మేయర్ మిచెల్ వూ కూడా ఆగస్టు 15వ తేదీని ఇండియా డేగా ప్రకటిస్తూ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ స్థిరపడ్డ ఇండియన్ డయస్పొరా అమెరికాకు విశేష సేవలను అందించారని, నగర పురోగతిలో వారి పాత్ర ఎంతో ఉందని ప్రశంసించారు. భిన్న సంస్కృతుల మధ్య పరస్పర అవగాహనను పెంపొందించడానికి భారతీయులు ఎంతగానో కృషి చేస్తున్నారుని ప్రశంసించారు. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూనే, ఇక్కడి అభివృద్ధిలో భారతీయులు కీలక భాగస్వాములుగా మారారని పేర్కొన్నారు.

బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం: ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్
Advertisement

మసాచుసెట్స్ స్టేట్ లో ఉన్న భారతీయులు వైద్యం, సైన్స్, టెక్నాలజీ, విద్య, వ్యాపారం, ప్రజా సేవా రంగాలలో అద్భుతమైన విజయం సాధిస్తున్నారని గవర్నర్ మౌరా హీలీ కొనియాడారు. ప్రవాస భారతీయుల ఆవిష్కరణలు, సేవా దృక్పథం ఇక్కడి ఆర్థిక రంగాన్ని బలోపేతం చేశాయని వివరించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ద్వారా భారతీయులు తమ సంస్కృతిని వ్యాప్తి చేయడమే కాకుండా, శాంతి, ప్రగతి పట్ల తమకున్న అంకితభావాన్ని చాటుకుంటున్నారని తెలిపారు.

అలాంటి వారిపై ఉక్కుపాదం మోపండి- పోలీసులకు రేవంత్ పూర్తి స్వేచ్ఛ

భారత సుదీర్ఘ చరిత్ర, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే సాంస్కృతిక వైవిధ్యాన్ని హీలీ ప్రత్యేకంగా ప్రస్తావించారు ఈ ఉత్తర్వుల్లో. 1947లో బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొంది, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా భారత్ ఎదిగిన తీరును గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా 3.6 కోట్లకు పైగా ఉన్న భారతీయ ప్రవాసులలో దాదాపు 50 లక్షల మందికి పైగా అమెరికాలోనే స్థిరపడ్డారని, ఇక్కడి పౌర జీవనాన్ని ప్రభావితం చేస్తున్నారని పేర్కొన్నారు.

English Summary

Massachusetts Declares August 15 India Day to Celebrate Indian American Diaspora Contributions Honor. Massachusetts Governor Maura Healey has declared Independence day as India Day, recognising the contributions made by the Indian diaspora to the state.