అణు ఒప్పందంలో కొత్త ట్విస్ట్: సౌదీ, పాకిస్థాన్‌లకు ట్రంప్ బిగ్ షాక్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం ఓ ఆసక్తికరమైన ప్రకటన చేశారు. అమెరికాతో పౌర అణు ఒప్పందం కుదుర్చుకోవాలంటే సౌదీ అరేబియా తప్పనిసరికా ఇజ్రాయెల్‌ను స్వతంంత్ర దేశంగా గుర్తించాలని.. అలాగే అబ్రహం ఒప్పందాల పరిధిలోకి రావాలని ట్రంప్ షరతు విధించారు. ఈ ప్రతిపాదనతో సౌదీ అరేబియాతో పాటు పాకిస్థాన్ పై కూడా ఇజ్రాయెల్ ను గుర్తించాలనే ఒత్తిడి పెరుగుతోందని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి చేస్తున్నప్పటికీ ఇజ్రాయెల్ తో సంబంధాలను పునరుద్ధరించుకోవడం సౌదీ అరేబియా, పాకిస్థాన్ లకు చాలా కష్టమైన నిర్ణయం అవుతుందని నిపుణులు భావిస్తున్నారు.

Advertisement
భారత్ పై మరోసారి డొనాల్డ్ ట్రంప్ గుస్సా: ఆ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం- తక్షణమే అమలు
Advertisement

అణు ఒప్పందంలో కొత్త ట్విస్ట్
గతంలో అమెరికా, సౌదీ అరేబియాల మధ్య చర్చలకు వచ్చిన పౌర అణు ఒప్పందంలో ఇజ్రాయెల్ అంశం ప్రధానంగా లేదు. ఇజ్రాయెల్ తో దౌత్య సంబంధాలు ఏర్పడాలంటే స్వతంత్ర పాలస్తీనా దేశ ఏర్పాటు జరగాలని సౌదీ అరేబియా దశాబ్ధాలుగా డిమాండ్ చేస్తోంది. అయితే డొనాల్డ్ ట్రంప్ అకస్మాత్తుగా అణు ఒప్పందానికి ఇజ్రాయెల్ గుర్తింపును ముడిపెట్టడంతో సౌదీ అరేబియా ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. వైట్ హౌస్ మీడియా సెక్రటరీ కరోలిన్ లెవిట్ స్పందిస్తూ.. అబ్రహం ఒప్పందంలో చేరకపోతే అణు ఒప్పందాన్ని రద్దు చేసి అధికారం ట్రంప్ కు ఉందనటంలో అమెరికా వైఖరి స్పష్టమవుతోంది. ఈ క్రమంలో సౌదీ నుంచి తక్షణ స్పందన ఏమీ రాలేదు. ఎలా స్పందించాలో తెలియక సౌదీ అరేబియా తికమక పడుతున్నట్లు కనిపిస్తోంది.

Advertisement

నెతన్యాహు ఆశాభావం
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ.. సౌదీ అరేబియా ప్రాంతీయ శక్తిగా, ఇస్లామిక్ పవిత్ర స్థలాల నిలయంగా ఉందని పేర్కొన్నారు. సౌదీ అరేబియా ఇజ్రాయెల్ ను గుర్తించడం మధ్యప్రాచ్యంలో శాంతి దిశగా మార్పునకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే యూకేకు చెందిన రక్షణ నిపుణుడు హెచ్ఏ హెల్లియర్ అభిప్రాయం ప్రకారం.. సౌదీ అరేబియా గత 30 ఏళ్లగా పాలస్తీనా అంశంపై స్పష్టమైన వైఖరితో ఉందని.. అమెరికా ఎంత ఒత్తిడి తెచ్చినా తన సిద్ధాంతాన్ని మార్చుకోదని అభిప్రాయపడ్డారు.

Advertisement
ఐక్యరాజ్యసమితి వేదికగా పాకిస్థాన్‌కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్!

మరోవైపు పాకిస్థాన్ కూడా ఇజ్రాయెల్ ను గుర్తించే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తోంది. పాకిస్తాన్‌లోని వివిధ పార్టీల ప్రభుత్వాలు ఈ వైఖరిలో ఏ మార్పునైనా పాలస్తీనా సమస్య పరిష్కారంతో ముడిపెట్టాయి. 1967 పూర్వపు సరిహద్దులతో కూడిన స్వతంత్ర పాలస్తీనా రాజ్యాన్ని స్థాపించకుండా విషయాలు పరిష్కారం కావని పాకిస్తానీ అధికారులు వాదిస్తున్నారు. అట్లాంటిక్ కౌన్సిల్‌లో దక్షిణాసియా సీనియర్ ఫెలో అయిన మైఖేల్ కుగెల్‌మన్ మాట్లాడుతూ.. సౌదీ అరేబియా అబ్రహం ఒప్పందాలలో చేరితే, పాకిస్తాన్ తన వైఖరిని పునఃపరిశీలించుకోవాలని ఒత్తిడి పెరుగుతుందని అన్నారు. అయితే, ఇందులో చేరే ఏ పాకిస్తాన్ ప్రభుత్వానికైనా అది రాజకీయ ఆత్మహత్యతో సమానమవుతుంది. గతంలో నెతన్యాహు తాము పాకిస్థాన్ కు శత్రువులం కాదని ప్రకటించినప్పటికీ.. పాక్ వైఖరిలో తక్షణ మార్పు వచ్చే అవకాశం కనిపించడం లేదు.

English Summary

Donald Trump links the US-Saudi nuclear deal to Abraham Accords, pressuring Saudi Arabia and Pakistan to recognize Israel. Read the full analysis.