అమెరికా- ఇరాన్ యుద్దంలోకి రష్యా ఎంట్రీ.. ఈ రాత్రి బతికి బట్టకట్టేది ఎవరో..!!


పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఏమాత్రం తగ్గడం లేదు. ఇరాన్- అమెరికా మధ్య తాజాగా కాల్పుల విరమణ ముగిసిన వెంటనే పరస్పరం తీవ్ర స్థాయిలో దాడులు చేసుకున్నాయి. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధి వేదికగా ఇరాన్- అమెరికా మధ్య యుద్ధ వాతావరణం తీవ్ర స్థాయికి చేరింది. ఇరాన్ లోని కీలకమైన బందర్ అబ్బాస్, సిరిఖ్, ఖేశ్మ్, జాస్క్ తదితర ప్రాంతాల్లో అమెరికా సైన్యం పేలుళ్లు జరిపింది. అటు బహ్రెయిన్, కువైట్, ఒమన్, జోర్డాన్ దేశాల్లోని అమెరికన్ మిలిటరీ స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. ఈ క్రమంలో మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.

Advertisement

ఇరాన్- అమెరికా యుద్ధంలోకి ఇప్పుడు రష్యా కూడా వచ్చింది. ఈ మేరకు ఇరాన్ రాజధాని టెహ్రాన్ లోకి రష్యా తన అధునాతన టీయూ-214పీయూ కమాండ్ ఎయిర్ క్రాఫ్ట్ ను పంపించినట్లు స్పష్టం అవుతోంది. ఫ్లైట్ ట్రాకింగ్ డేటా అందించిన వివరాల ప్రకారం ఇరాన్- అమెరికా మధ్య హార్మూజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు అధికం అవుతున్న క్రమంలో ఈ ఎయిర్ క్రాఫ్ట్ టెహ్రాన్ కు చేరుకున్నట్లు వివరించింది. దాంతో రష్యా వ్యూహాత్మకంగా ఇరాన్ కు సపోర్ట్ చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది.

Advertisement

ఇరాన్- అమెరికా మధ్య గత రెండు మూడు రోజులు ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను హతమార్చేందుకు ఇరాన్ మాస్టర్ ప్లాన్ చేస్తోందని ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వర్గాలు ఇటీవల వెల్లడించాయి. ఇదే అంశంపై ట్రంప్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఒకవేళ తనను చంపేస్తే ఆ దేశాన్ని బాంబులతో బూడిద చేయండి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక ఇరాన్ లిస్టులో తాను ఫస్ట్ ప్లేస్ లో ఎప్పటినుంచో ఉన్నానని పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.

Advertisement

ఈ కారణంతోనే ఇరాన్- అమెరికా పరస్పర దాడులు భారీస్థాయిలో చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇరాన్ లోని టెహ్రాన్ కు రష్యా తన టీయూ-214పీయూ కమాండ్ ఎయిర్ క్రాఫ్ట్ ను పంపించినట్లు స్పష్టం అవుతోంది. అయితే ఈ అంశంపై రష్యా నుంచి ఎలాంటి ప్రకటన రానప్పటికీ డిఫెన్స్ విశ్లేషకుల అంచనా ప్రకారం.. ఇరాన్ కు మిలిటరీ సహకారం అందించేందుకు ఈ ఎయిర్ క్రాఫ్ట్ టెహ్రాన్ కు చేరినట్లు తెలుస్తోంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ చాలా ముఖ్యమైనదిగా చెబుతారు.

ఎందుకంటే..? యుద్ధ సమయంలో, ఎమర్జెన్సీ సమయంలో ఈ ఎయిర్ క్రాఫ్ట్ లో నుంచి ఆర్మీ అధికారులు ఎప్పటికప్పుడు తమ సైన్యాన్ని కమ్యూనికేట్ చేసుకునే సదుపాయం ఉంది. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఇందులోని ప్రత్యేకమైన సామాగ్రి, సమాచార వ్యవస్థ ధ్వంసం కాదు. దీనిని ఫ్లైయింగ్ కమాండ్ పోస్ట్ అని పిలుస్తుంటారు. అలాగే దీనిని డూమ్స్ డే ఎయిర్ క్రాఫ్ట్ అని అంటారు. ఇక రష్యా ఎంట్రీతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరం అయ్యాయి. మరోవైపు ఇరు దేశాల మధ్య మరోసారి సంధి కుదిర్చేందుకు పాకిస్థాన్, టర్కీ తమ ప్రయత్నాలు చేస్తున్నాయి.