ఆఫ్రికా ఖండం నుంచి ఐరోపాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన శరణార్థుల ఉప్పెన స్పెయిన్‌ను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ఉత్తర ఆఫ్రికా తీరంలో ఉన్న స్పెయిన్ భూభాగం 'సియుటా' సరిహద్దుల్లో చోటుచేసుకున్న ఈ భారీ చొరబాటు యత్నం ఏకంగా 67 మంది ప్రాణాలను బలిగొంది. ఈ ఘోర ఉదంతంతో తక్షణమే స్పందించిన స్పెయిన్ ప్రభుత్వం, సముద్ర మార్గం ద్వారా చొరబాట్లను శాశ్వతంగా అడ్డుకునేందుకు నీటిపై తేలియాడే 500 మీటర్ల పొడవైన సముద్ర రక్షణ గోడను ఏర్పాటు చేయడం ప్రారంభించింది.
కేవలం 48 గంటల వ్యవధిలోనే సుమారు 50,000 నుంచి 60,000 మంది శరణార్థులు ఒకేసారి మొరాకో సరిహద్దుల గుండా సియుటాలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఈత కొడుతూ సరిహద్దులు దాటే క్రమంలో అనేకమంది మునిగిపోగా, తారాజల్ బ్రేక్‌వాటర్ ప్రాంతంలో జరిగిన త్రోపులాట, తొక్కిసలాటలో పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 67కి చేరిందని స్పెయిన్ అధికారులు ధ్రువీకరించారు. యూరోపియన్ యూనియన్, నాటూ, ఆఫ్రికా ఖండంతో ఉన్న ఏకైక భూ సరిహద్దులు ఇవే కావడంతో ఈ ప్రాంతం ఎప్పుడూ సున్నితంగానే ఉంటుంది.
భవిష్యత్తులో ఇలాంటి భారీ చొరబాట్లను అడ్డుకునేందుకు స్పెయిన్ సైన్యం అత్యాధునిక రక్షణ చర్యలు చేపట్టింది. నీటిపైన 30 నుంచి 70 సెంటీమీటర్ల ఎత్తు, నీటి లోపల ఒక మీటరు లోతు వరకు విస్తరించేలా 500 మీటర్ల పొడవైన ఎయిర్-ఫిల్డ్ బారియర్‌ను సముద్రంలో అమర్చుతోంది. దీనికి అదనంగా స్పెయిన్ నేవీకి చెందిన భారీ బోయలను కూడా రక్షణగా ఉంచారు. కోస్ట్ గార్డ్, పోలీసు పెట్రోలింగ్ బోట్లు నిరంతరం నిఘా ఉంచేందుకు వీలుగా సముద్రంలో ప్రత్యేక మార్గాన్ని కేటాయించి భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రస్తుతం సరిహద్దుల్లో పరిస్థితి అదుపులోకి వచ్చిందని, అక్రమంగా లోపలికి వచ్చిన వారిలో మెజారిటీ మందిని తిరిగి మొరాకోకు పంపించివేసినట్లు స్పెయిన్ హోం శాఖ మంత్రి ఫెర్నాండో గ్రాండే-మార్లాస్కా తెలిపారు. సియుటాలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ.. "చట్టాన్ని ఉల్లంఘించే వారి పట్ల మేము అత్యంత కఠినంగా ఉంటాం" అని హెచ్చరించారు. ఈ ఘటనపై మొరాకో ప్రభుత్వంతో కలిసి ఉమ్మడి విచారణ జరుపుతామని, అయితే ఈ సంక్షోభాన్ని 24 గంటల్లోనే అదుపు చేయడంలో మొరాకో సహకారం మరువలేనిదని, వారు స్పెయిన్‌కు నమ్మకమైన భాగస్వామి అని ఆయన పేర్కొన్నారు. ఈ ఊహించని ఘటనతో ఐరోపా సమాఖ్యలోని 22 సభ్య దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. తక్షణమే ఈయూ అంతర్గత వ్యవహారాల మంత్రుల అత్యవసర సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి. మరోవైపు, స్పెయిన్‌ను 'షెంజెన్' (పాస్‌పోర్ట్ రహిత ప్రయాణ ప్రాంతం) నుంచి తాత్కాలికంగా తొలగించాలనే ప్రతిపాదనలపై స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయం, తప్పుడు ప్రచారాల వల్లే కొందరు నాయకులు ఇలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం సరిహద్దుల్లో స్పెయిన్ సైన్యం, పోలీసులు పూర్తిస్థాయి పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.సముద్రంలో అత్యాధునిక రక్షణ వలయం
118 ఏళ్ల నాటి సరిహద్దు గోడలు బద్దలు.. ఇకపై నో పాస్‌పోర్ట్, నో వీసా!
చొరబాటుదారులను వెనక్కి పంపిన స్పెయిన్
రాజు క్షమాభిక్ష.. 57 మంది మృతి! ఒక్క రాత్రిలో మారిన దేశ తలరాత
ఈయూలో వేడెక్కిన రాజకీయం.. 'షెంజెన్' రద్దుపై చర్చ!