బోట్ లో చెలరేగిన మంటలు ఐదుగురు మృతి.. 41 మంది గల్లంతు

ఇండోనేషియాలోని మదురా ఐలాండ్ లో ఆదివారం తీవ్ర విషాదం నెలకొంది. 271 మందితో వెళ్తున్న పడవలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 41 మంది గల్లంతు అయ్యారు.

Advertisement

భారీ సంఖ్యలో ప్రయాణికులు గల్లంతైన నేపథ్యంలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నారు. ఇండోనేషియాలోని రెండో అతిపెద్ద నగరం అయిన ఈస్ట్ జావా లోని సురభాయ నుంచి సౌత్ సులవేసి ప్రాంతంలోని మకస్సార్ ప్రాంతానికి వెళ్తోంది.

Advertisement

ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. పడవలోని వెజెల్ నుంచి పొగ వచ్చిన వెంటనే అగ్ని ప్రమాదం జరిగిందని ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు చూస్తుంటే అర్థం అవుతోంది. ఇక ఇప్పటికే నౌకలోని చాలా మందిని సహాయక బృందాలు రక్షించి వెలికి తీశాయి. ఇప్పటి వరకు దాదాపు 225 మందిని సురక్షితంగా బయటకు తీశారు. గల్లంతైన మరో 41 మంది కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. ఫెర్రీలో అగ్ని ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నట్లు స్పష్టం చేశారు.