అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇరాన్‌పై దాడులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణాన్ని పూర్తిగా నివారించాలంటే ఇరాన్ త్వరితగతిన తమతో పాటు ఇతర మిత్రదేశాలతో శాంతి ఒప్పందానికి రావాలని తేల్చి చెప్పారు. దీనికోసం ఆయన గడువు సైతం విధించారు. ఈ వ్యూహాత్మక సంప్రదింపులకు ఇజ్రాయెల్ కూడా పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించిందని స్పష్టం చేశారు.
మధ్యప్రాచ్య దేశాల నుంచి వచ్చిన అత్యవసర అభ్యర్థనలు, దౌత్య ఒత్తిళ్ల మేరకే తాము ఈ దాడిని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ట్రంప్ తెలిపారు. దీనిపై తన అధికారిక మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ట్రూత్ సోషల్ పై దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. అమెరికా ప్రతిపాదించిన ఈ తాజా శాంతి ఒప్పందంలో రెండు షరతులు కీలకం అయ్యాయి. మొదటిది.. హోర్ముజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలను తక్షణమే పునరుద్ధరించడం. రెండోది.. అణు పరిశోధనలు, క్షిపణి తయారీ కార్యక్రమాలకు ఇరాన్ అడ్డుకట్ట వేయడం.
ఇరాన్ మనుగడ కోసమే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా సైనిక బలగాలు ప్రస్తుతం అతి తీవ్ర దాడులకు సిద్ధంగా ఉన్నాయని, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ లేనంత స్థాయిలో దాడి చేయడానికి ప్రణాళికలను రచించినట్లు స్పష్టం చేశారు. అయినప్పటికీ దౌత్యపరంగా ఇరాన్ కు మరో అవకాశం ఇస్తున్నామని, త్వరగా చర్చలు ముగించాలని, శాంతి ఒప్పందాలను సమగ్రంగా అమలు చేయడానికి ఇరాన్ ముందుకు రావాలని సూచించారు. అంతకుముందు.. ఇరాన్‌పై అమెరికా సైన్యం పెద్ద ఎత్తున దాడులు చేయడానికి సిద్ధమవుతోందన్న వార్తలపై సౌదీ అరేబియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్ ద్వారా మాట్లాడారు. ఇరాన్‌పై దాడులు జరిగితే పశ్చిమాసియా దేశాల్లో తీవ్ర అస్థిరత నెలకొంటుందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని పేర్కొన్నారు. ఈ భీకర దాడులను ప్రస్తుతానికి నిలిపివేయాలని సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ ట్రంప్‌కు స్వయంగా విజ్ఞప్తి చేశారు. ఈ ఫోన్ సంభాషణపై అటు వైట్ హౌస్ గానీ, ఇటు అమెరికాలోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం గానీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. దీనిపై యాక్సియస్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఇరాన్‌పై అమెరికా సమగ్ర దాడులు చేయాలనే ప్రతిపాదనలపై సౌదీ అరేబియా ప్రభుత్వం గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేసిందని తెలిపింది. పశ్చిమ ఆసియాలో శాంతి భద్రతలను కాపాడటానికి ఇరాన్ వ్యవహారంలో ఆచితూచి అడుగులు వేయాలని, ఉద్రిక్తతలను మరింత పెంచే నిర్ణయాలను తీసుకోవద్దని సౌదీ క్రౌన్ ప్రిన్స్ కోరినట్లు పేర్కొంది. నిజానికి.. ఇరాన్‌తో సైనిక ఉద్రిక్తతలను తగ్గించుకుని దౌత్య మార్గాలను అన్వేషించడానికి సౌదీ అరేబియా ముందు నుంచీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ కొద్దిరోజుల కిందటే వైట్ హౌస్‌ను కూడా సందర్శించారు. డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఇరాన్‌తో ఎలాంటి ఘర్షణలకు వెళ్లకుండా వివాదాస్పద అంశాలను శాంతియుత చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి మొగ్గు చూపాలని కోరారు.వాస్తు ప్రకారం మెట్ల కింద ఎంతమాత్రం ఉంచకూడని వస్తువులు
చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్సీ ఖాయమైన వేళ.. తిరుమల శ్రీవారి సేవలో హార్దిక్ పాండ్యా