ఉబర్ సంస్థ గోల్ మాల్: డ్రైవర్లను మోసం చేసి 500 మిలియన్ డాలర్లు స్వాహా, కోర్టులో!


స్యాన్ ఫ్యాన్సిస్కో: కాలిఫోర్నియా ప్రధాన కార్యాలయంగా పని చేస్తున్న ఉబర్ టెక్నాలజీ సంస్థ తన సంస్థలో పని చేస్తున్న డ్రైవర్లను మోసం చేసి వారికి అందవలసిన జీతభత్యాలు చెల్లించుకుండా భారీ మొత్తంలో స్వాహా చేసిందని ఆరోపణలు వచ్చాయి.

Advertisement

డ్రైవర్లకు ప్రతి గంటలకు చెల్లించాల్సిన 9.07 డాలర్ల భత్యం ఉబర్ సంస్థ చెల్లించడం లేదని, డ్రైవర్లను ఉద్యోగులుగా గుర్తించి వారికి చెల్లించాల్సిన జీత భత్యాలు చెల్లించుకుండా సంవత్సరానికి దాదాపు 500 మిలియన్ డాలర్లకు పైగా దోచుకుందని స్యాన్ ఫ్రాన్సిస్కోలోని ఫెడర్ కోర్టులో కేసు నమోదు అయ్యింది.

Advertisement

డ్రైవర్లకు సామాజిక భద్రత కల్పించడం లేదని, ఆరోగ్యం భీమా, జీతభత్యాలు చెల్లించడం లేదని, కనీస వేతనాలు ఇవ్వడం లేదని, ఓవర్ టైం పని చేసినా అంతే జీతం ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. భోజనం, ఆరోగ్య భీమా, విశ్రాంతి అవది, కార్మికుల పరిహారం చెల్లించుకుండా వారి శ్రమను దోచుకుంటున్నారని కోర్టులో వాదించారు.

గత ఏప్రిల్ నెలలో కాలిఫోర్నియా సుప్రీం కోర్టు స్వతంత్రంగా ఉద్యోగం చేస్తున్న వారిని (డ్రైవర్లు) కార్మికులుగా గుర్తించాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలు ఉబర్ సంస్థ పాటించడం లేదని కారు సర్వీస్ సంస్థ ఫిర్యాదు చేసింది. ఉబర్ సంస్థ డ్రైవర్లకు న్యాయం చెయ్యాలని స్యాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టులో కేసు వాదిస్తున్నారు.

Advertisement

English Summary

Uber Technologies Inc. may be saving more than $500 million a year by misclassifying its California drivers as independent contractors, according to a lawsuit that claims the ride-hailing company is flouting a ruling by the state’s highest court.
Advertisement