కుల్సుమ్! ఒక్కసారి కళ్లు తెరువు!: భార్యతో నవాజ్ షరీఫ్ చివరి మాటలు (వీడియో)


ఇస్లామాబాద్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సతీమణి కుల్సుం మంగళవారం కన్నుమూసిన విషయం తెలిసిందే. నవాజ్ తన భార్యతో గతంలో మాట్లాడిన చివరి మాటలకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.

గతంలో జైలుకు వెళ్లడానికి ముందు చివరిసారిగా భార్యను కలిసిన నవాజ్ షరీఫ్ ఆమె పక్కన నిల్చొని మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి.

'కుల్సుమ్.. కళ్లు తెరువు.. ఒక్కసారి కళ్లు తెరిచి నన్ను చూడు, అల్లా నీకు శక్తిని ప్రసాదిస్తాడు' అని నవాజ్ షరీఫ్ ఆమె పక్కనే ఉండి అన్నాడు.

కొంతకాలంగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న కుల్సుమ్ మంగళవారం లండన్‌లో తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భార్య అంత్యక్రియల్లో పాల్గొనేందుకు నవాజ్ షరీఫ్, కుమార్తె మరియం, అల్లుడు మహ్మద్ సఫ్దార్‌లు పెరోల్ పైన విడుదలయ్యారు.

ఈ వీడియోను సయ్యద్ హుస్సకేన్ అనే వ్యక్తి తొలుత తన ట్విట్టర్ అకౌంటులో పోస్ట్ చేశాడు. నవాజ్ తన భార్యతో కళ్లు తెరవమని చెప్పినప్పుడు ఆమె కొన్ని సెకన్ల పాటు కళ్లు తెరిచిందట. అనారోగ్యంతో ఉన్న తన భార్యను వదిలి వెళ్లేందుకు ఆయనకు మనసు ఒప్పలేదట.

Have a great day!
Read more...

English Summary

An unseen of video of former prime minister Nawaz Sharif bidding farewell to Begum Kulsoom Nawaz has gone viral on social media.