US Iran War: చాబహార్ పోర్ట్‌పై అమెరికా దాడి.. భారత్‌లో టెన్షన్ టెన్షన్!

US Iran War: ఇరాన్‌పై సైనిక చర్యలను పెంచుతూనే వ్యూహాత్మకంగా చాలా కీలకమైన చాబహార్ పోర్టును కూడా అమెరికా లక్ష్యంగా చేసుకుంది. యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకారం.. ఇరాన్‌కు చెందిన 90 సైనిక స్థావరాలపై దాడి జరిగింది. చాబహార్‌తో సహా అనేక నగరాల్లో పేలుళ్లు, విద్యుత్ సరఫరాలో అంతరాయా ఏర్పడినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఈ దాడి కేవలం ఇరాన్‌కు మాత్రమే కాకుండా ఇండియాకు కూడా ఆందోళనను కలిగిస్తోంది. దానికి కారణంగా చాబహార్ పోర్టు ఇండియాకు అత్యంత కీలకమైన వ్యూహాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా ఉంది.

Advertisement

ఇండియాకు చాబహార్ ఎందుకు గేమ్ ఛేంజర్?
గల్ఫ్ ఆఫ్ ఒమన్ ముఖద్వారం వద్ద ఉన్న చాబహార్ పోర్టు ఇరాన్‌కు చెందిన మొదటి లోతైన ఓడరేవు. ఇండియా 2002 నుంచి ఈ ప్రాజెక్టుతో అనుబంధం కలిగి ఉంది. 2016లో భారత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందం అనంతరం చాబహార్ పోర్టు అభివృద్ధి ఊపందుకుంది. భారత్ ఇప్పటివరకు ఈ ప్రాజెక్టులో 120 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టింది. ఈ ఓడరేవు ద్వారా భారత్ 2017లో ఆఫ్ఘనిస్తాన్‌కు మొదటిసారిగా గోధమలను పంపింది.

Advertisement

పాకిస్థాన్‌ను దాటేవేసేందుకు అతిపెద్ద మార్గం
చాబహార్ పోర్టు పాకిస్థాన్ సరిహద్దును ఉపయోగించకుండా ఇండియాకు ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా, రష్యాకు ప్రవేశాన్ని కల్పిస్తుంది. అందుకే ఈ ఓడరేవు భారత కనెక్టివిటీ వ్యూహంలో కీలకమైన భాగం. ఇది ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్ కు కూడా అనుసంధానించబడి ఉంది. ఇది ఇండియాను ఇరాన్ మీదుగా మధ్య ఆసియా, రష్యా, యూరప్ లకు కలుపుతుంది.

చైనా గ్వాదర్ పోర్టుకు వ్యూహాత్మక సమాధానం
చాబహార్ పోర్టు ప్రాముఖ్యత కేవలం వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాదు. పాకిస్థాన్ కు చెందిన గ్వాదర్ ఓడరేవును చైనా అభివృద్ధి చేసింది. ఇది ఈ ప్రాంతంలో చైనా వ్యూహాత్మక ఉనికికి ప్రధాన కేంద్రంగా పరిగణించబడుతుంది. అటువంటి పరిస్థితిలో చాబహార్ పోర్టు ఆ ప్రాంతంలో సమతుల్యతను సృష్టించడానికి, చైనా-పాకిస్థాన్ దేశాల సముద్ర వ్యూహానికి ప్రతిస్పందించడానికి ఇండియాకు అవకాశాన్ని కల్పిస్తుంది. అందువల్ల ఈ ఓడరేవులో ఎలాంటి సంక్షోభం ఏర్పడినా ఇండియా వ్యూహాత్మక స్థితిని ప్రభావితం చేయవచ్చు.

Advertisement

పొంచి ఉన్న ముప్పు
చాబహార్ పోర్టు వద్ద పెరుగుతున్న సైనిక ఉద్రిక్తత భారత దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రణాళికలకు సవాలుగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో వివాదాలు పెరిగితే.. పెట్టుబడులు, వాణిజ్యం, కనెక్టివిటీ ప్రాజెక్టులు ప్రభావితమవుతాయి. ఈ క్రమంలో చాబహార్ పోర్టుకు సంబంధించిన ప్రతి పరిణామాన్ని భారత్ చాలా నిశితంగా గమనిస్తోంది.

English Summary

US Iran War, US Attacks Iran, Targeting th port City of Chabahar. This Port is Crucial not only to Iran but also to India. Know the Reason, Why?