దేశంలో పెద్ద బస్సు ప్రమాదం, కొండగట్టు ప్రమాదంలో 57 మంది మృతి: అతను ఉత్తమ డ్రైవర్


కొండగట్టు: జగిత్యాల జిల్లా కొండగట్టులో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో బస్సు డ్రైవర్ సహా 55 మందికి పైగా మృతి చెందారు. మృతికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. ఆర్టీసీ చరిత్రలోనే ఇది అతిపెద్ద ప్రమాదంగా చెబుతున్నారు. ఈ బస్సును నడిపిన డ్రైవర్ ఆగస్ట్ 15న ఉత్తమ డ్రైవర్‌గా అవార్డు అందుకున్నాడు. కాగా, కండక్టర్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఇది దేశంలోనే అతిపెద్ద బస్సు ప్రమాదంగా చెబుతున్నారు.

శనివారంపేట నుంచి జగిత్యాల వెళ్తున్న బస్సు కొండగట్టు ఘాట్‌ రోడ్డులో అదుపు తప్పి 30 అడుగుల లోయలో పడిపోయింది. ఇంతమందిని బలితీసుకున్న బస్సు ప్రమాదానికి అతివేగం, ఓవర్‌లోడ్‌తో పాటు బ్రేకులు విఫలమవడమే కారణమని చెబుతున్నారు. బస్సు డ్రైవర్‌ షార్ట్‌కట్‌ రూట్‌లో రావడం కూడా మరో కారణమని పలువురు చెబుతున్నారు.

50మందికి పైగా చనిపోవడానికి కారణమిదే!: కేసీఆర్ విచారం, రూ.5 లక్షల ఎక్స్‌గ్రేసియా

వాస్తవానికి ఈ బస్సు నాచ్‌పల్లి నుంచి దొంగలమర్రి మీదుగా వెళ్లాల్సి ఉంది. అయితే అప్పటికే ప్రయాణీకుల రద్దీ ఎక్కువగా ఉండటంతో బస్సును షార్ట్‌కట్‌ రూట్‌లో తీసుకెళ్లినట్టు చెబుతున్నారు. ఈ బస్సు సామర్థ్యానికి మించి ప్రయాణీకులను ఎక్కించుకోవడంతో ఘాట్‌ రోడ్డులో బస్సు అదుపు తప్పడంవల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని, ప్రమాద సమయంలో ఊపిరాడక కొందరు చెందారని తెలుస్తోంది.

గుండెలు పిండేసే విషాదం, మాటలు రావట్లేదు: బస్సు ప్రమాదంపై మోడీ, కోవింద్, పవన్ కళ్యాణ్

బస్సు ప్రమాదం జరిగిన సమయంలో వంద మందికి పైగా ప్రయాణీకులు ఉన్నారు. ఓవర్ టేక్ చేసే సమయంలో లేదా ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించే క్రమంలో ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ఇక్కడ ఉన్న డివైడర్లు కూడా నాణ్యతగా లేవని చెబుతున్నారు. బస్సు దాదాపు ముప్పై లోతుల అడుగులో పడిపోయింది. దీంతో భారీ ప్రాణనష్టం జరిగింది.

Have a great day!
Read more...

English Summary

In the worst ever bus accident in India, 57 people were killed after a Telangana State Road Transport Corporation bus fell into a valley, 30 feet down, from the ghat road at Sanivarampet village of Kondagattu mandal in Jagtial district.