కొండగట్టు బస్సు ప్రమాదం ప్రమాదం: డిపో మేనేజర్‌పై వేటు, మృతుల వివరాలు


కరీంనగర్: జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద జరిగిన పెను బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 55కు చేరుకుంది. 88మందితో వెళ్తున్న ఆర్టీసీ బస్సు కొండగట్టు ఘాట్ రోడ్డులోని చివరి మూల మలుపు వద్ద అదుపుతప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 55మంది మృతి చెందగా, క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కొండగట్టు వద్ద ఘోర ప్రమాదం: లోయలో పడ్డ బస్సు, 50మందికి పైగా మృతి, పలువురికి తీవ్రగాయాలు

మృతుల్లో 25మంది మహిళలే ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. కాగా, తీవ్రగాయాలపాలైన 8మందిని చికిత్స నిమిత్తం కరీంనగర్, హైదరాబాద్ ఆస్పత్రులకు తరలించారు. మరికొందరికి జగిత్యాల ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ప్రమాద ఘటనపై సమాచారం అందగానే జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్, ఎస్పీ సింధూ శర్మ హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువుల రోదనలతో ఆ ప్రాంతమంత హృదయవిదారకంగా మారింది.

కాగా, అపద్ధర్మ మంత్రులు మహేందర్ రెడ్డి, కేటీఆర్, ఎంపీ కవిత, ఆర్టీసీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ బాధితులను పరామర్శించారు. అండగా ఉంటామని తెలిపారు. జగిత్యాల ఆర్టీసీ డిపో మేనేజర్‌ హనుమంతరావుపై సస్పెన్షన్‌ వేటు వేశారు. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు.

కాగా, ఇప్పటి వరకు 38మంది వివరాలను అధికారులు వెల్లడించారు.

మృతుల వివరాలు:
1. నామాల మౌనిక (24), శనివారంపేట
2. బైరి రిత్విక్(3), రామసాగర్
3. పోలు లక్ష్మి(50), హిమ్మత్ రావుపేట
4. చెర్ల లక్ష్మి (45), హిమ్మత్ రావుపేట
5. గండి లక్ష్మీ (60), శనివారంపేట
6. డబ్బు అమ్మయి(50), డబ్బు తిమ్మయ్యపల్లి
7. బండపల్లి చిలుకవ్వ(76)
8. గోలి అమ్మాయి(44), శనివారంపేట
9. తిప్పర్తి వెంకటరత్నం(56), తిరుమలాపూర్
10. కంకణాల ఎల్లవ్వ(70), సండ్రలపల్లి
11. లాంబ కోటవ్వ(65), హిమ్మత్‌ రావుపేట
12. బందం లసవ్వ (65) ముత్యంపేట
13. బొల్లారం బాబు (54), శనివారంపేట
14. లైసెట్టి చంద్రయ్య (45), శనివారంపేట
15. ఎండికల ఎంకవ్వ, శనివారంపేట
16.ఇంద్రికాల సుమ(30), శనివారంపేట
17. రాజవ్వ (56), డబ్బు తిమ్మయ్యపల్లి
18. ఉత్తమ్ నందిని , కొనపూర్
19 మాల్యాల అనిల్(19), హిమ్మత్ రావుపేట
20. గాజుల చిన్నవ్వ (60), డబ్బు తిమ్మయ్యపల్లి
21. శమకురా మల్లవ్వ (38),
22. సలేంద్ర వరలక్ష్మి (28), శనివారంపేట
23. కుంబల సునంద (45), శనివారంపేట
24. గుడిసె రాజవ్వ (50), శనివారంపేట
25. పందిరి సతవ్వ (75), హిమ్మత్ రావుపేట
26. దాసరి సుశీల (55), తిరుమలపూర్
27. రాగల ఆనందం(55), రామసాగర్
28. నేదునూరి మదనవ్వ(75), హిమ్మత్‌ రావుపేట
29. చెర్ల హైమా(30), హిమ్మత్‌ రావుపేట
30. పిడిగు రాజవ్వ(30), డబ్బు తిమ్మయ్యపల్లి
31. చెర్ల గంగవ్వ(75), శనివారం పేట
32. ఒడినల లసమవ్వా(55), తిమ్మయ్యపల్లి
33. ఒడినల కాశిరం(65), తిమ్మయ్యపల్లి
34 బొంగిని మల్లయ్య(55)
35. గోల్కొండ లచవ్వ(50), డబ్బు తిమ్మయ్యపల్లి
36.గోల్కొండ దేవవ్వ(63), డబ్బు తిమ్మయ్యపల్లి
37.కొండ అరుణ్ సాయి(5), కోరెం
38. బొంగోని మదనవ్వా (65).

Have a great day!
Read more...

English Summary

Deaths details in Kondagattu bus accident Occurred on Tuesday.