హైదరాబాద్‌లో భారీ వర్షం, సమస్యలు ఉంటే ఈ నెంబర్‌కు ఫోన్ చేయొచ్చు


హైదరాబాద్: భాగ్యనగరంలో మంగళవారం భారీ వర్షం కురిసింది. నాంపల్లి, కోఠి, హిమయత్ నగర్, రామ్ నగర్, బషీర్ బాగ్, ఖైరతాబాద్, అప్జల్ గంజ్, నారాయణగూడ, పాతబస్తీ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా పలుచోట్ల ఇళ్లలోకి నీరు వచ్చింది.

చాలా ప్రాంతాల్లో వర్షం నీరు నిలవడంతో ప్రయాణీకులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడ్డారు. నగరంలో భారీ వర్షం కారణంగా అధికారులను జీహెచ్ఎంసీ అప్రమత్తం చేసింది. ఎమర్జెన్సీ బృందాలు, జలమండలి ఎమర్జెన్సీ బృందాలను అప్రమత్తం చేసింది.

నగరంలోని మ్యాన్ హోళ్లపై మూతలు తెరవొద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ సూచనలు చేశారు. భారీ వర్షాల వల్ల జీహెచ్ఎంసీలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. వర్షాల వల్ల సమస్యలు ఎదురైతే 040-21111111 నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.

జీహెచ్ఎంసీ, జలమండలి క్షేత్రస్థాయి అధికారులు, ఇంజనీర్లు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలన్నారు. నీటి నిల్వలు ఎప్పటికి అప్పుడు తొలగించాలన్నారు. నగరంలోని అన్ని మ్యాన్ హోళ్లను తనిఖీ చేయాలన్నారు.

Have a great day!
Read more...

English Summary

Heavy rain in Hyderabad, Greater Hyderabad Municipal Corporation alerted.