తెలంగాణ అసెంబ్లీ రద్దు: జోక్యం చేసుకోమన్న హైకోర్టు, ఏం చేయాలో ఈసీకి తెలుసు


హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ రద్దును సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. రాజ్యాంగం, చట్టాల ఉల్లంఘన ఎలా జరిగిందో చూపకపోతే.. తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది.

Advertisement

ఎన్నికల సంఘం రాజ్యాంగ పరిధిలో తన పని తాను చేస్తుందని వ్యాఖ్యానించింది. అసెంబ్లీ రద్దు చెల్లదంటూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ న్యాయవాది రాపోలు భాస్కర్ దాఖలు చేసిన వ్యాజ్యాంపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది.

Advertisement

మరో షాక్: జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అవకతవకల కేసులో రేవంత్ రెడ్డికి నోటీసులు

ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయకుండా ఈసీని ఆదేశించాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. అసెంబ్లీ రద్దు వ్యవహారం రాజ్యాంగం లేదా ప్రజాప్రాతినిథ్యం చట్టం ఉల్లంఘన ఎలా అవుతుందో చెప్పాలని హైకోర్టు పేర్కొంది. రాజ్యాంగం, చట్టాల ఉల్లంఘన జరగకుండా కోర్టులు జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

English Summary

The state apex court on Wednesday quashed the petition filed against the dissolution of the assembly by the TRS government.
Advertisement