కేసీఆర్‌పై మహాకూటమి యుద్ధం: పోలీస్ స్టేషన్లో పొత్తు, హోటల్లో చర్చలు


తెరాసను ఓడించాలంటే ఒక్కటి కావాలి

హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ మినహా విపక్షాలు మహా కూటమి దిశగా సాగుతున్నాయి. కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ పార్టీలు మంగళవారం భేటీ అయ్యాయి. పొత్తులు, సీట్ల సర్దుబాటు తదితర అంశాలపై చర్చించాయి. ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ, సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి తదితరులు ఉన్నారు.

నేను గిన్నెలు శుభ్రం చేస్తా: కేటీఆర్‌కు మద్దతుగా ఫోటోలు పెడుతూ నెటిజన్ల ఆగ్రహం

కోదండరాం పార్టీ, జనసేనలతోను వివిధ పార్టీలు చర్చలు జరుపుతున్నాయి. వీటిలో ఏయే పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయో మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. కాంగ్రెస్, టీడీపీల పొత్తు మాత్రం దాదాపు ఖాయంగా తెలుస్తోంది.

మహాకూటమి ప్రయత్నం

మహాకూటమి ఏర్పాటుకు పొత్తు ప్రయత్నాలపై టీడీపీ, తెలంగాణ జన సమితి మధ్య సోమవారం చర్చలు జరిగాయి. కూటమి ఏర్పాటుకు కలసి రావాలని ఎల్ రమణ చేసిన ప్రతిపాదనకు తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం సానుకూలంగా స్పందించారు. పొత్తులపై సోమవారం రెండు దఫాలుగా కోదండరాం, రమణ చర్చించారు. తొలుత భారత్ బంద్‌లో భాగంగా సోమవారం ఉదయం నిరసన తెలుపుతున్న వివిధ పార్టీల నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

హోటల్లో భేటీ

ఈ సందర్భంగా కోదండరాంతో రమణ మాట్లాడారు. పొత్తులపై రాజకీయ చర్చలు జరుపుదామన్నారు. దానికి కోదండ సరే అన్నారు. తమ పార్టీలో అంతర్గతంగా చర్చించిన తర్వాత కూర్చొని మాట్లాడుకుందామని కోదండరాం చెప్పారు. ఆ తర్వాత పోలీసులు వారిని విడుదల చేసిన అనంతరం తిరిగి సాయంత్రం హోటల్ మినర్వాలో భేటీ అయ్యారు. ఈ భేటీలో సీపీఐ చాడ కూడా పాల్గొన్నారు. మహా కూటమి ఏర్పాటుపై వీరి చర్చించారు.

తెరాసను ఓడించాలంటే ఒక్కటి కావాలి

తెలంగాణలో అధికార దుర్వినియోగం జరుగుతోందని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తెరాసను ఓడించాలని, అందరం కలసి పోటీచే స్తేనే అది సాధ్యమని ఈ సందర్భంగా నేతలు అభిప్రాయపడ్డారు. అనంతరం కాంగ్రెస్ పార్టీతో చర్చించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రమణ, చాడలు మంగళవారం కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు.

పొత్తు కుదిరాక సీట్ల లెక్కలు

పొత్తులపై అవగాహన కుదిరిన తర్వాత అన్ని పార్టీలు కలిసి ఓ ప్రకటన చేయనున్నాయి. కలిసి పోటీ చేయాలనే అంశంపై కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌ల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన తర్వాత, ఎవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలో చర్చిస్తారు. సీట్ల విషయంలో త్యాగాలు చేయాలని ఇప్పటికే ఎల్ రమణ అభిప్రాయపడ్డారు. దీంతో మిగతా పార్టీల నేతలు కూడా ఏకీభవించారు.

Have a great day!
Read more...

English Summary

Mahakutami Against Caretaker Chief Minister KCR in Telangana Assembly Elections.