పవన్ సీక్రెట్ మీటింగా? ఇదిగో ఆధారం!: వారి అజ్ఞానానికి చింతిస్తున్నాం


హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన సమావేశాన్ని స్ట్రింగ్ ఆపరేషన్‌గా ప్రసారం చేసి, అబాసుపాలైన ఓ ఛానల్ పైన జనసేన అనుబంధ సంస్థ జనసేన శతఘ్ని ఆగ్రహం వ్యక్తం చేసింది. రహస్య సమావేశానికి, ఆహ్వానాలు అందించి జరుపుకునే సమావేశాలకు తేడా తెలియని వారి అజ్ఞానానికి చింతిస్తున్నామని పేర్కొంది.

పవన్ కళ్యాణ్‌పై స్ట్రింగ్ ఆపరేషన్..బెడిసి కొట్టిన వ్యూహం, ధీటుగా జవాబు ఇచ్చిన జనసేన

జనసేన శతఘ్ని

తీవ్రంగా స్పందించిన జనసేన శతఘ్ని

పవన్ కళ్యాణ్ ఓ సామాజిక వర్గానికి చెందిన నాయకులతో రహస్యంగా భేటీ అయి, రూ.10 లక్షలు ఇవ్వాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారని ఓ టీవీ ఛానల్ కలకలం రేపింది. అయితే అదంతా వట్టిదేనని తేలింది. అన్ని పార్టీలు చందాలు అడిగినట్లే పవన్ కళ్యాణ్ కూడా నేతలను అధికారికంగా ఆహ్వానించి అడిగారని తెలుస్తోంది. దీంతో వారు అబాసుపాలయ్యారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

దీనిపై జనసేన శతఘ్ని తీవ్రంగా స్పందించింది. అందరికీ ఆహ్వానం పలికామంటూ అందుకు సంబంధించిన ఇన్విటేషన్ లెటర్‌ను కూడా పోస్ట్ చేసింది.

రిపోర్టరే వచ్చాడు
మీ రిపోర్టరే వచ్చాడు
మీ రిపోర్టరే వచ్చాడు

పవన్ కళ్యాణ్ ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో సదరు ఛానల్ విలేకరి కూడా ఉన్నారని చెబుతన్నారు. ఇన్విటేషన్ ఇచ్చిన మీటింగ్.. పైగా దానికి రిపోర్టర్లు కూడా వచ్చినప్పుడు అది సీక్రెట్ మీటింగ్ ఎలా అవుతుందని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. మీ రిపోర్టరే వచ్చి దర్జాగా పవన్ వెనుక నిలుచున్నాడని చెబుతున్నారు.

సీక్రెట్ ఎలా అవుతుంది?
అది సీక్రెట్ ఎలా అవుతుంది?
అది సీక్రెట్ ఎలా అవుతుంది?

ఐటీసీ కాకతీయ లాంటి పెద్ద హోటల్లో మీటింగ్ పెడితే అది సీక్రెట్ ఎలా అవుతుందని ప్రశ్నిస్తూ.. నెటిజన్లు కూడా ఇన్విటేషన్ కార్డును పోస్టు చేస్తున్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం లేదని, మీడియా ముసుగులో రాజకీయ మాఫియా రాజ్యమేలుతోందని, దాదాపు అన్ని పేపర్లు, ఛానళ్లు ఒకే పార్టీకి కొమ్ముకాస్తున్నాయని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఆగ్రహం
మూసేసుకుంటారా అని ఆగ్రహం
మూసేసుకుంటారా అని ఆగ్రహం

పవన్ కళ్యాణ్ సీక్రెట్ మీటింగ్ జరిపారని ప్రసారం చేసిన వీడియోలో హాజరైన వ్యక్తులు అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కాదని, అది నిజం కాదని నిరూపిస్తే ఛానల్‌ను మూసేసుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు.

Have a great day!
Read more...

English Summary

False allegations on Jana Sena Party chief Pawan Kalyan that he convened a secret meeting with the bigwigs from the Kapu community at a star hotel in Hyderabad and collected Rs 10 lakh each from them.