మోడీతో కుమ్మక్కు, కేసీఆర్‌ను తొలగించండి: విపక్షాలకు గవర్నర్ గట్టి షాక్


హైదరాబాద్: కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటే ఎన్నికలు సజావుగా జరగవని, ఆయనను తొలగించాలని అఖిలపక్షం నేతలు మంగళవారం గవర్నర్ నరసింహన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆయనను రాజ్ భవన్‌లో కలిశారు. అనంతరం వారు మాట్లాడారు.

దానం నాగేందర్‌కు గోషామహల్ టిక్కెట్! రాజాసింగ్‌పై సత్తా చూపేనా?

కేసీఆర్ ఆపద్ధర్మ సీఎంగా ఉంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని అనుమానాలు వ్యక్తం చేశారు. ఆయనను తొలగించి, రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. ఫ్రీ అండ్ ఫెయిర్ ఎన్నికలు జరగాలంటే కేసీఆర్‌ను తొలగించాల్సిందే అన్నారు.

ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారు

తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రే ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తే ఎలాగని నిలదీశారు. ఈసీని ఒక అధికారి తెరాస తరఫున ఏ విధంగా కలిసి అడుగుతారని ప్రశ్నించారు. కేసీఆర్ వ్యాఖ్యలను ఈసీ స్టుపిడ్ అండ్ సిల్లీగా పేర్కొందన్నారు.

మోడీతో కేసీఆర్ కుమ్మక్కు

ప్రధాని నరేంద్ర మోడీతో కేసీఆర్ కుమ్మక్కై ముందుకు వెళ్తున్నారని ఎల్ రమణ అన్నారు. కుటుంబ రాజకీయ మనుగడ కోసమే ఈ ప్రయత్నాలు అన్నారు. కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ పైన దాడులు జరిగాయని మండిపడ్డారు. రాష్ట్రపతిని కూడా కలవాలని నిర్ణయించినట్లు తెలిపారు. జాతీయస్థాయి పార్టీలను కూడా కలుస్తామని చెప్పారు. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిని తొలగిస్తేనే ప్రజాస్వామ్య మనుగడ అన్నారు.

మా అభ్యర్థనపై గవర్నర్ స్పందించలేదు

20 లక్షలకు పైగా ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయని కోదండరాం చెప్పారు. దొడ్డిదారిన అధికారంలోకి రావాలని కేసీఆర్ చూస్తున్నారని దుయ్యబట్టారు. గవర్నర్ మా అభ్యర్థనపై స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీల వారీగా ఈసీతో భేటీ

ఇదిలా ఉండగా, తెలంగాణలో ముందస్తు వేడి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల బృందం మంగళవారం హైదరాబాద్ చేరుకుంది. మంగళవారం సాయంత్రం, బుధవారం వివిధ పార్టీలతో ఈసీ అధికారులు భేటీ కానున్నారు. సాయంత్రం ఆరు గంటల నుంచి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశమవుతున్నారు. పార్టీల వారీగా ప్రతినిధులు హాజరవుతారు. తెరాస నుంచి వినోద్, శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి మర్రి శశిధర్ రెడ్డి బృందం, బీజేపీ నుంచి వెంకట్ రెడ్డి బృందం, సీపీఎం నుంచి డీజీ నరసింహా రావు, సీపీఐ నుంచి చాడ వెంకట రెడ్డి, కూనంనేని, పల్లా, మజ్లిస్ నుంచి జాఫ్రీ, అక్బరుద్దీన్ హాజరు కానున్నారు.

Have a great day!
Read more...

English Summary

Telangana Congress, TDP and other party leaders on Tuesday met Governor Narasimhan over KCR's caretaker Chief Minister issue.