వరంగల్ మేయర్‌గా లారీడ్రైవర్ కొడుకు: ఎవరీ నన్నపునేని నరేందర్?


హైదరాబాద్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ) తొలి మేయర్‌గా నన్నపునేని నరేందర్ బాధ్యతలు స్వీకరించనున్నారు. తొలి డిప్యూటీ మేయర్‌గా సిరా జుద్దీన్ బాధ్యతలు చేపట్టనున్నారు. మేయర్‌గా, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక మంగళవారం లాంఛనంగా జరగనుంది.

Advertisement

ఈ మేరకు ఉదయం 11 గంటలకు వరంగల్‌లోని జీడబ్ల్యూఎంసీ కార్యా లయంలో కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించి మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. అందరూ ఊహించినట్లుగానే టీఆర్‌ఎస్ నుంచి మేయర్ అభ్యర్థిగా నన్నపునేని నరేందర్, డిప్యూటీ మేయర్‌గా సిరాజుద్దీన్ పేర్లను ఖరారు చేస్తూ సోమవారం హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటన చేశారు.

Advertisement

నన్నపనేని నరేందర్ వరంగల్‌తూర్పు శాసనసభ నియోజకవర్గంలోని 19వ డివిజన్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి 881 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. సిరాజుద్దీన్ వరంగల్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గంలోని 41వ డివిజన్ నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలో నిలిచి గెలిచారు.

మోదీ వలనే బంగారు రేటు పెరిగింది, ఐటీ అధికారులకు కళ్లు ఉన్నాయా, టీడీపీతో పొత్తు పెట్టుకుని ?

కాగా వరంగల్ గ్రేటర్ పరిధిలోని 58 డివిజన్లలో 44 డివిజన్లను గెలుచుకున్న టీఆర్‌ఎస్ ఒంటరిగానే మేయర్, డిప్యూటీ మేయర్ పీఠాలను కైవసం చేసుకుంది. నన్నపునేని నరేందర్ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించడంతో పట్టణంలోని వెనుకబడిన అండర్ రైల్వే గేట్ ప్రాంతానికి అపురూప గౌరవం దక్కింది.

Advertisement

ఇప్పటి వరకు వరంగల్ మేయర్‌గా హన్మకొండ ప్రాంతానికి చెందిన వారే ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు ముందు వరంగల్ పట్టణం గ్రేటర్ హోదా దక్కించుకుంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఎంపికైన తొలి మేయర్ నన్నపునేని నరేందర్ బాధ్యతలను స్వీకరించనున్నారు.

హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు

గతంలో వరంగల్ మున్సిపల్ ఛైర్మన్‌గా ఆరెళ్ళి బుచ్చయ్య రెండు పర్యాయాలు పనిచేశారు. అప్పటి నుంచి మరేవరు ఈ ప్రాంతం నుంచి చైర్మన్, మేయర్ పదవికి ఎంపిక కాలేదు. తొలిసారిగా 19వ డివిజన్ నుంచి కార్పొరేటర్‌గా గెలిచిన నన్నపునేని నరేందర్ గ్రేటర్ తొలి మేయర్‌గా చరిత్రలో నిలువబోతున్నాడు.

Advertisement

పేరు : నన్నపునేని నరేందర్
తండ్రి : నర్సింహమూర్తి.. లారీ డ్రైవర్‌గా పనిచేశారు.
తల్లి : కాంతమ్మ
భార్య : వాణి
కుమారులు : లోకేష్‌పటేల్, మనుప్రీత్ పటేల్
వయస్సు : 44 సంవత్సరాలు
చదువు : బీకాం

రాజకీయ ప్రవేశం
* 1995 కల్పలత సూపర్‌బజార్ డైరక్టర్‌గా ఎన్నిక, టీడీపీలో చేరిక
* 1997లో టీడీపీ డివిజన్ కార్యదర్శి, డివిజన్ అధ్యక్షుడు
* 2004 టీడీపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు
* 2005లో 16వ డివిజన్ కార్పోరేటర్‌గా గెలుపు
* 2008లో టీడీపీ జిల్లా ఉనాధ్యక్షుడు
* 2009లో టీఆర్‌ఎస్‌లో చేరిక
* 2010 ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ నగర అధ్యక్షుడు
* 2011లో ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు
* 2012లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు
* 2014లో టీఆర్‌ఎస్ గ్రేటర్ అధ్యక్షుడు
* 2016లో వరంగల్ మేయర్.

English Summary

TRS selects Nannapaneni Narender as Warangal Mayor .