భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో ప్రస్తుతం శాస్త్రవేత్తల వలసలు కలకలం రేపుతున్నాయి. ప్రతిష్టాత్మక 'గగన్‌యాన్' వంటి ఎంతో కీలకమైన అంతరిక్ష ప్రయోగాల మధ్యలోనే పలువురు సీనియర్, జూనియర్ సైంటిస్టులు వరుసగా సంస్థకు గుడ్‌బై చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాలపై కేంద్ర అంతరిక్ష శాఖ (DoS) అప్రమత్తమైంది. కీలక ప్రాజెక్టులు అర్ధాంతరంగా ఆగిపోకుండా ఉండేందుకు వీలుగా.. శాస్త్రవేత్తల రాజీనామాలు, ముందస్తు పదవీ విరమణ (వీఆర్‌ఎస్) నిబంధనలను అత్యంత కఠినతరం చేస్తూ జూలై 14న అంతర్గతంగా ఒక కీలక ఉత్తర్వును జారీ చేసిందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
100 మందికి పైగా సైంటిస్టుల ఎగ్జిట్!
ఇస్రో నుంచి ఎంతమంది వెళ్లిపోయారనే విషయాన్ని అంతరిక్ష శాఖ అధికారికంగా బయటపెట్టనప్పటికీ.. ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. సమాచారం ప్రకారం.. ఇప్పటివరకు దాదాపు 100 నుంచి 120 మంది వరకు శాస్త్రవేత్తలు ఇప్పటికే ఇస్రోను వీడారు లేదా విడిచిపెట్టే ప్రక్రియలో ఉన్నారు. వీరిలో యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ (URSC) నుంచి దాదాపు 80 మంది, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) నుంచి కనీసం 20 మంది సైంటిస్టులు తప్పుకున్నట్లు తెలుస్తోంది.
మరీ ముఖ్యంగా ఇస్రో విజయాల్లో కీలక పాత్ర పోషించిన సీనియర్ అధికారులు కూడా ఈ లిస్ట్‌లో ఉండటం గమనార్హం. ఎల్‌వీఎమ్-3 (LVM-3) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా పనిచేసిన విక్టర్ జోసెఫ్‌తో పాటు స్పేస్‌డెక్స్ (SpaDeX) ప్రాజెక్ట్ డైరెక్టర్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు, దేశం గర్వపడేలా చేసిన 'చంద్రయాన్-3' ప్రయోగంలో కీలక పాత్ర పోషించిన ఒక ప్రతిభావంతుడైన యువ శాస్త్రవేత్త కూడా ఇస్రోను వీడటం విశేషం. విదేశీ సంస్థలు లేదా ప్రైవేట్ రంగంలో వస్తున్న భారీ ఆఫర్ల వల్లే వీరంతా వెళ్తున్నట్లు సమాచారం. తాజా ఉత్తర్వుల ప్రకారం.. గగన్‌యాన్ లాంటి జాతీయ ప్రాజెక్టులలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు ఇచ్చే రాజీనామాలు లేదా వీఆర్‌ఎస్ దరఖాస్తులను ఇకపై సాధారణ పద్ధతిలో ఆమోదించకూడదు. సదరు కీలక ప్రాజెక్టులు పూర్తిగా పూర్తయ్యేంత వరకు ఆయా సంస్థల డైరెక్టర్లు వీటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి వీల్లేదు. ప్రతి దరఖాస్తును పూర్తి కారణాలతో సహా కేంద్ర అంతరిక్ష శాఖకు పంపాల్సి ఉంటుంది. అక్కడి నుంచి వచ్చే తుది నిర్ణయం ఆధారంగానే చర్యలు ఉంటాయి. దీనివల్ల 2020 నవంబర్ నాటి పాత నిబంధన రద్దయినట్లయింది. అప్పట్లో గ్రూప్-A సైంటిఫిక్ అధికారుల రాజీనామాలను ఇస్రో కేంద్రాల డైరెక్టర్లే నేరుగా ఆమోదించేలా వెసులుబాటు ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ అధికారాన్ని కేంద్రం మళ్లీ తన చేతుల్లోకి తీసుకుంది. ఈ వలసలపై ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ స్పందిస్తూ.. "సంస్థల నుంచి ఉద్యోగులు వెళ్లడం సహజమే. అయితే ప్రాజెక్టులు మధ్యలో దెబ్బతినకుండా చూసేందుకే ఈ నిబంధనలు తెచ్చాం. ఒకరు వెళ్లినా మరొకరు ఆ బాధ్యతలు అందుకునేలా తగిన చర్యలు తీసుకుంటున్నాం" అని ధీమా వ్యక్తం చేశారు.ఇస్రో చేతికి రష్యా 'బ్రహ్మాస్త్రం'
ఇకపై అంత తేలిక కాదు.. కొత్త రూల్స్ ఇవే!
అంతరిక్ష కేంద్రంలో భారతీయుడికి గ్రాండ్ వెల్‌కమ్! మహోన్నత ఘట్టం..