భారత రక్షణ రంగం చరిత్రలో మరో సువర్ణాధ్యాయం ఆవిష్కృతమైంది. మన ఆకాశ సరిహద్దులను శత్రువుల కంటికి కూడా కనిపించకుండా కాపాడేందుకు శాస్త్రవేత్తలు మరో శక్తివంతమైన ఆయుధాన్ని సిద్ధం చేశారు. డీఆర్‌డీవో రూపకల్పన చేసిన అత్యంత శక్తివంతమైన లాంగ్ రేంజ్ మిస్సైల్.. ఉపరితలం నుంచి గగనతల క్షిపణి (LR-SAM) 'కుశ' వ్యవస్థను తొలిసారిగా విజయవంతంగా పరీక్షించారు. ఒడిశా తీరంలోని ప్రసిద్ధ ఏపీజే అబ్దుల్ కలాం ద్వీపం నుంచి ఈ భారీ ప్రయోగాన్ని నిర్వహించగా, లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించి సైంటిస్టులు సరికొత్త రికార్డు సృష్టించారు.
ఏ ప్రదేశంలో ఉన్నా అంతమే!
ప్రస్తుత ఆధునిక యుద్ధాల్లో శత్రుదేశాలు వాడే అధునాతన యుద్ధ విమానాలు, దొంగతనంగా దాడి చేసే డ్రోన్లు, వేగంగా వచ్చే క్షిపణులు, రాడార్లకు చిక్కని భారీ విమానాలను సైతం గాల్లోనే ధ్వంసం చేసే అమోఘమైన శక్తి ఈ 'కుశ' క్షిపణికి ఉంది. ఏ ఎత్తులో ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా శత్రువుల ఉనికిని తక్షణమే గుర్తించి గగనతలంలోనే మట్టికరిపించేలా డీఆర్‌డీవో దీనిని నమూనా చేసింది. దేశ సరిహద్దులను శత్రు శక్తులు తాకలేవని ఈ ప్రయోగం నిరూపించింది.
ఈ అద్భుత విజయంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్‌డీవో బృందానికి, శాస్త్రవేత్తలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారత రక్షణ రంగ పరిశోధనల్లో ఇది ఒక అతిపెద్ద మైలురాయి అని ఆయన అభివర్ణించారు. ఆకాశంలో చాలా దూరంలో ఉన్న లక్ష్యాలను పేల్చివేసే స్వదేశీ క్షిపణి వ్యవస్థలను తయారుచేసే సామర్థ్యం ప్రపంచంలో కేవలం వేళ్లమీద లెక్కపెట్టే కొన్ని దేశాలకు మాత్రమే ఉందనే విషయాన్ని గుర్తుచేశారు. ఈ సాంకేతికత అందుబాటులోకి రావడంతో ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదని, విదేశీ దిగుమతులు తగ్గి స్వదేశీ రక్షణ వ్యవస్థకు కొత్త ఊపిరి వస్తుందని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రష్యా ఎస్-400 రక్షణ వ్యవస్థకు ఏమాత్రం తీసిపోని విధంగా ఈ 'కుశ' ఆయుధ వ్యవస్థ రూపుదిద్దుకుంది. ఇందులో వేర్వేరు పరిధులను (150 కిలోమీటర్లు, 250 కిలోమీటర్లు, ఏకంగా 400 కిలోమీటర్ల దూరం) ఛేదించగల మూడు రకాల క్షిపణులను అందుబాటులోకి తేవడం అసలు విశేషం. దొంగచాటుగా వచ్చే విమానాలు, శబ్దానికంటే వేగంగా దూసుకొచ్చే హైపర్ సోనిక్ ఆయుధాల దాడి నుంచి మన సరిహద్దులను, ముఖ్యమైన ప్రాంతాలను రక్షించడానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. అధికారుల పర్యవేక్షణలో జరిగిన ఈ ప్రయోగం పూర్తి కాగా, మరో మూడేళ్లలో అంటే 2028-2030 నాటికి ఈ వ్యవస్థ పూర్తిస్థాయిలో మన సైన్యంలోకి చేరి సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది.కొన్ని దేశాలకే సాధ్యం.. రక్షణ మంత్రి ప్రశంసలు!
DRDO: పినాకా దెబ్బకు వణికిన శత్రు దేశాలు! లైవ్ విజువల్స్ చూస్తే షాకవ్వాల్సిందే
రష్యా ఎస్-400 కి సరిసాటి.. 2028 నాటికి ఆర్మీలో కమాండింగ్!
కర్నూలులో DRDO విశ్వరూపం.. గాల్లోనూ, నేలపైనా వేటాడే ఏకైక వెపన్!