హఠాత్తుగా నిలిచిపోయిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్


ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది సోషల్ మీడియా ప్రియులకు ఆదివారం ఒక పెద్ద షాక్ తగిలింది. నిత్యం కోట్ల మంది యాక్టివ్‌గా ఉండే ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లు హఠాత్తుగా ఆగిపోయాయి. మార్క్ జుకర్‌బర్గ్‌కు చెందిన మెటా (Meta) గ్రూప్ యాప్స్ అన్నీ ఒక్కసారిగా డౌన్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మొబైల్ యాప్‌తో పాటు వెబ్‌సైట్ వెర్షన్ కూడా పూర్తిగా పనిచేయకపోవడంతో డిజిటల్ ప్రపంచం కాసేపు కుప్పకూలినట్లయింది.

Advertisement

డౌన్‌డిటెక్టర్‌లో పెరిగిన ఫిర్యాదులు..

ఈ సాంకేతిక లోపం ఆదివారం ఒక్కసారిగా తలెత్తింది. యాప్స్ ఓపెన్ కాకపోవడం, ఫీడ్ లోడ్ అవ్వకపోవడం వంటి సమస్యలు ఎదురవడంతో వందలాది మంది యూజర్లు ఇంటర్నెట్ అంతరాయాలను పర్యవేక్షించే 'డౌన్‌డిటెక్టర్' (Downdetector) వెబ్‌సైట్‌లో ఫిర్యాదులు చేయడం ప్రారంభించారు. చూస్తుండగానే ఈ ఫిర్యాదుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. చాలా మందికి లాగిన్ కాకపోవడం, పేజీలు రీఫ్రెష్ కాకపోవడం, అలాగే యాప్ ఓపెన్ చేయగానే స్క్రీన్‌పై ఎర్రర్ మెసేజ్‌లు రావడం వంటి ఇబ్బందులు తలెత్తాయి. డౌన్‌డిటెక్టర్‌లో నమోదైన సంఖ్య వందల్లోనే ఉన్నప్పటికీ.. ఫిర్యాదు చేయని సాధారణ యూజర్ల సంఖ్య లక్షల్లో ఉండవచ్చని అంచనా.

Advertisement

Instagram పై కేంద్రం తీవ్ర ఆగ్రహం! ఏడు రోజుల్లోగా లెక్క తేలాలి

ఎక్స్ (ట్విట్టర్)లో నెటిజన్ల హల్‌చల్..

ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ రెండు కూడా ఒకేసారి డౌన్ కావడంతో యూజర్లు ఏం జరుగుతుందో అర్థం కాక అయోమయానికి గురయ్యారు. తమ ఫోన్లలో ఇంటర్నెట్ ప్రాబ్లం అనుకుని చాలా మంది వైఫై రీస్టార్ట్ చేశారు. కానీ, సమస్య తమది కాదని తేలడంతో.. నెటిజన్లంతా మరో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన 'ఎక్స్' (ట్విట్టర్) వైపు పరుగులు తీశారు. అక్కడ ఓపెన్ కాని ఫేస్‌బుక్ బ్లాంక్ స్క్రీన్ షాట్లను, ఎర్రర్ మెసేజ్ ఫొటోలను షేర్ చేస్తూ మీమ్స్‌తో హల్‌చల్ చేశారు. మీ ఫోన్లలో కూడా ఫేస్‌బుక్ పని చేయడం లేదా? అంటూ ఒకరినొకరు ఆరా తీశారు.

Advertisement
Facebook ఏఐ రచ్చ. ప్రొఫైల్ పిక్చర్‌కు ప్రాణం పోస్తుంది!

మౌనంగా ఉన్న మెటా యాజమాన్యం..

ఈ గ్లోబల్ అవుటేజ్ పై మెటా సంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అసలు సర్వర్లు ఎందుకు డౌన్ అయ్యాయి? ఈ సాంకేతిక లోపానికి గల ప్రధాన కారణాలు ఏంటి? అనే విషయాలపై యాజమాన్యం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అలాగే ఈ సమస్య కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమైందా లేదా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఇలాగే జరిగిందా అనే దానిపై కూడా కంపెనీ స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సర్వర్ల నిలిపివేత వ్యవహారం డిజిటల్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

English Summary

Hundreds of users report widespread access issues with Facebook and Instagram. Meta platforms experience major service disruption affecting both mobile apps and web versions.