39 కోట్ల ఏళ్లనాటి మహా రహస్యం! గూగుల్ మ్యాప్‌కి దొరికిపోయింది

ఈ భూమిపై మనుషులకు తెలియని రహస్యాలు, వింతలు ఎన్నో దాగి ఉన్నాయి. మనం రోజూ వాడే టెక్నాలజీతోనే కొన్నిసార్లు ఊహించని అద్భుతాలు బయటపడుతుంటాయి. శతాబ్దాలుగా దట్టమైన అడవులు, కొండల మధ్య కంటికి కనిపించకుండా దాక్కున్న ఒక మహత్తర భూగోళ రహస్యాన్ని ఓ సాధారణ నెటిజన్ గూగుల్ మ్యాప్స్ సహాయంతో వెలికితీశాడు ఓ వ్యక్తి. అది కూడా చిన్నపాటి గొయ్యి కాదు.. ఏకంగా 39 కోట్ల సంవత్సరాల క్రితం ఆకాశం నుంచి పడిన ఒక భారీ గ్రహశకలం వల్ల ఏర్పడిన భారీ విస్ఫోటన గుర్తు! కెనడా అడవుల్లో బయటపడ్డ ఈ అరుదైన ఉల్క గుంట సైన్స్ ప్రపంచాన్ని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది.

Advertisement

క్యాంపింగ్ ప్లాన్ నుంచి మొదలైన ఉత్కంఠ!

ఈ కథనం వెనుక ఒక ఆసక్తికరమైన ఉదంతం ఉంది. జోయెల్ లాపాయింట్ అనే ఒక ఔత్సాహిక ఖగోళ ప్రియుడు కెనడాలోని ఈశాన్య అడవుల్లో క్యాంపింగ్ చేయాలనుకున్నాడు. దానికోసం మార్గాన్ని చూసుకునేందుకు గూగుల్ మ్యాప్స్ లో సాటిలైట్ వ్యూ ఓపెన్ చేశాడు. కొండలు, చెట్ల మధ్య వెతుకుతుండగా ఆయనకు ఒక విచిత్రమైన, అత్యంత ఖచ్చితమైన సర్క్యులర్ క్వారీ కనిపించింది. శాస్త్రవేత్తలు ఇప్పటికే దీనిపై పరిశోధన చేసి ఉంటారని భావించి ఆర్కైవ్‌లలో వెతకగా.. ఎక్కడా ఆ ప్రదేశం ప్రస్తావన లేదు. దీంతో వెంటనే గ్రహశకల పరిశోధక నిపుణులకు ఆ మ్యాప్ ఫోటోలను పంపాడు.

Advertisement

రంగంలోకి సైంటిస్టులు.. షాకింగ్ నిజాలు వెలుగులోకి!

లాపాయింట్ పంపిన ఆధారాలతో శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయి పరిశోధనకు సిద్ధమయ్యారు. కెనడాలోని ఆ దట్టమైన అడవికి వెళ్లిన భూగోళ శాస్త్రవేత్తల బృందం అక్కడ లభించిన ఆధారాలను చూసి నోరెళ్లబెట్టింది. అక్కడి రాతి పొరలలో 'ష్యాటర్ కోన్స్' (ఉల్క తీవ్రమైన వేగంతో వచ్చి పడినప్పుడు ఏర్పడే ప్రత్యేకమైన శంఖాకార రాతి నమూనాలు) కనిపించాయి. అంతేకాకుండా విపరీతమైన వేడికి కరిగి మళ్లీ గడ్డకట్టిన అరుదైన రాతి అవశేషాలు కూడా దొరికాయి. పరిశోధనల అనంతరం 'ఉహాకటిక్' (Uhackatik) అని నామకరణం చేసిన ఈ గొయ్యి సుమారు 25 కిలోమీటర్ల వెడల్పు ఉండి, 39 కోట్ల ఏళ్ల నాటిదని నిర్ధారించారు.

Advertisement
108 దేశాల పోటీని దాటుకుని.. ఇస్రో కల వైపు ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని

ప్రపంచంలోనే అత్యంత అరుదైన డిస్కవరీ!

భూగోళం మీద ఇలాంటి ఉల్క గుంటలు బయటపడటం అత్యంత అరుదైన విషయం. భూమి ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం 200 వరకు మాత్రమే ప్రసిద్ధ ఉల్క ఆధారిత గుంతలను శాస్త్రవేత్తలు గుర్తించగలిగారు. సాధారణంగా ఏడాదికి ఒకటి లేదా రెండు మాత్రమే కొత్తగా కనుగొంటారు. అలాంటిది 25 కిలోమీటర్ల వైశాల్యం ఉన్న ఇంత పెద్ద భూభాగం ఇన్నాళ్లూ కంటికి కనిపించకుండా దాగి ఉండటం విశేషం. చందమామ, అంగారక గ్రహాలపై ఉండే గుంటలతో పోల్చి చూస్తూ భూమి పరిణామాన్ని అధ్యయనం చేయడానికి ఈ ప్రాంతం శాస్త్రవేత్తలకు ఎంతో ఉపయోగపడనుంది.

Advertisement
74 ఏళ్ల తర్వాత కనిపించిన విమానం. మిస్టరీ ఫ్లైట్ దొరికేసినట్లేనా?

మన కళ్ల ముందే ఇంకా ఎన్ని రహస్యాలు ఉన్నాయో?

టెక్నాలజీ ఎంత పెరిగినా భూమి తన కడుపులో దాచుకున్న రహస్యాలు ఇంకా కొల్లలుగా ఉన్నాయని ఈ ఘటన రుజువు చేస్తోంది. దట్టమైన అడవులు, మంచు పర్వతాలు, ఎడారుల కింద భూమిపై పడిన పాత జ్ఞాపకాలు ఎన్నో నిద్రాణమై ఉన్నాయి. ఒక సాధారణ పౌరుడు గూగుల్ మ్యాప్స్‌లో చూసిన ఒక చిన్న విషయం.. భూగోళ శాస్త్రంలోనే అతిపెద్ద ఆవిష్కరణకు దారితీసింది. అంటే, మన కళ్ల ముందే మనకు తెలియని ఎన్నో వింతలు ఇంకా దాగి ఉన్నాయన్నమాట!

English Summary

An amateur astronomer spotted a circular anomaly on Google Maps, leading scientists to confirm a 390-million-year-old, 25-km-wide meteorite impact crater hidden in Canada's wilderness.