ఆకాశంలో ప్రవహించే ప్రచండ ప్రవాహాలు! సైంటిస్టుల చేతికి విపత్తుల జాతకం

నేల మీద ప్రవహించే నదులు అందరికీ తెలుసు.. కానీ ఆకాశంలో కూడా భారీగా నీటిని మోసుకెళ్లే అతిపెద్ద నదులు ప్రవహిస్తున్నాయంటే నమ్ముతారా? అవును, భూమికి కొన్ని కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించే ఈ అట్మాస్ఫిరిక్ రివర్స్ సాధారణ కంటికి కేవలం మబ్బుల గుంపులాగే కనిపిస్తాయి. కానీ ఇవి దాదాపు 2,000 కిలోమీటర్ల పొడవు, 500 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించి ప్రవహిస్తాయి.

Advertisement

వీటిలో ఏకంగా అమెజాన్ నది సముద్రంలోకి వదిలేంత నీటి పరిమాణం ప్రవహిస్తూ ఉంటుంది. ఇవి ఒక ప్రాంతంపై దాడి చేస్తే కుండపోత వర్షాలతో ప్రళయం సృష్టిస్తాయి, అదే దారి తప్పిపోతే అక్కడ తీవ్ర వర్షాభావం, కరువు తాండవిస్తుంది. తాజాగా అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఈ ఆకాశ నదుల ప్రయాణ మార్గాలను కచ్చితంగా గుర్తించి ప్రపంచానికి సరికొత్త అధ్యయనాన్ని అందించింది.

Advertisement

గ్రాఫ్ థియరీతో ఆకాశంలో గ్రిడ్ల తయారీ

జర్మనీలోని లీప్‌జిగ్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త టోబియాస్ బ్రాన్ నేతృత్వంలోని బృందం 1940 నుంచి నమోదైన డేటాను విశ్లేషించి ఈ రహస్య మార్గాలను ఆవిష్కరించింది. మన మొబైల్ ఫోన్లు తక్కువ దూరం ఉన్న దారిని వెతకడానికి వాడే 'గ్రాఫ్ థియరీ' అనే గణిత పద్ధతిని వీరు వినియోగించారు.

వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు.. 3 రాష్ట్రాలకు భారీ వరద ముప్పు!

అందుకోసం భూగోళం మొత్తాన్ని వేలాది ఆరుకోణాల గ్రిడ్లుగా విభజించి, గడిచిన ఎనిమిది దశాబ్దాల్లో ఈ ఆకాశ నదులు ఏయే మార్గాల్లో ప్రయాణించాయో లెక్కించారు. దీని ద్వారా అంతరిక్షంలో ప్రవాహాలు కలిసే ప్రధాన జంక్షన్లు, హైవేలను ఒక రోడ్డు నెట్‌వర్క్ మాదిరిగా మ్యాప్ రూపంలో రూపొందించారు.

Advertisement

కొత్తగా వెలుగులోకి వచ్చిన 'ఫ్యూయలింగ్ స్టేషన్లు'

ఈ మ్యాపింగ్ ద్వారా శాస్త్రవేత్తలు అనేక విస్తుపోయే నిజాలను కనుగొన్నారు. అట్లాంటిక్, పసిఫిక్, హిందూ మహాసముద్రాల మీదుగా సాగే సాధారణ మార్గాలే కాకుండా, ఇప్పటివరకు ఎవరూ గుర్తించని కొత్త కేంద్రాలను కనిపెట్టారు. ఆకాశ నదులు ప్రయాణిస్తూ ప్రయాణ మధ్యలో మరింత తేమను పీల్చుకుని ఉగ్రరూపం దాల్చే 'ఫ్యూయలింగ్ స్టేషన్లను' గురిపెట్టారు.

నక్షత్రాల్ని నమిలేసి.. రోదసిలోకి విసిరేస్తున్న రాక్షసి

ముఖ్యంగా ఆస్ట్రేలియా తూర్పు తీరం, మధ్య ఆసియా, దక్షిణ ఆఫ్రికా ప్రాంతాలు, మిడిల్ ఈస్ట్ తో పాటు మెడిటరేనియన్ సముద్రం పైన కూడా ఇటువంటి ఆకాశ నదుల కేంద్రాలు బలంగా పనిచేస్తున్నట్లు తేలింది. ఆస్ట్రేలియాలో సంభవించే భారీ ప్రళయాలకు ఈ ఆకాశ మార్గాలే కారణమని వాతావరణ నిపుణులు ధృవీకరిస్తున్నారు.

Advertisement

తుఫాణులు, వరదలకు ముందస్తు చెక్!

ఈ పరిశోధన భవిష్యత్తులో రాబోయే తీవ్ర వాతావరణ మార్పులను అంచనా వేయడానికి ఒక గేమ్‌చేంజర్‌గా మారనుంది. ఎల్ నినో వంటి వాతావరణ మార్పుల సమయంలో ఈ ఆకాశ హైవేలు ఎలా దారి మళ్లుతాయో తెలిస్తే, ఏ ప్రాంతంలో హఠాత్తుగా వరదలు ముంచెత్తుతాయో ముందే చెప్పడం సాధ్యమవుతుంది.

భూతాపం పెరుగుతున్న కొద్దీ ఈ నదుల దిశలు కొంత మారే అవకాశం ఉన్నప్పటికీ, ఇవి ఎక్కడ బలపడతాయి, ఎక్కడ వర్షంగా మారి ఆవిరైపోతాయో అంచనా వేయడానికి ఈ అధ్యయనం ఒక పునాదిగా ఉపయోగపడుతుందని వాతావరణ పరిశోధకులు వెల్లడిస్తున్నారు.

English Summary

Scientists uncover secret pathways of atmospheric rivers—massive rivers in the sky carrying vast moisture. Discover how mapping these highways will help predict floods and droughts. భూమికి కొన్ని కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించే ఈ అట్మాస్ఫిరిక్ రివర్స్ సాధారణ కంటికి కేవలం మబ్బుల గుంపులాగే కనిపిస్తాయి.