మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ iQOO ఎదుగుతోంది. కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు నూతన సిరీస్ లతో మార్కెట్ ను పెంచుకుంటూనే ఉంటుంది. దీంతో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో బడ్జెట్-ఫ్రెండ్లీ సెగ్మెంట్‌లో మరో బలమైన పోటీదారుగా మారుతోంది. బడ్జెట్ సెగ్మెంట్‌లో వరుసగా కొత్త స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొస్తున్న ఈ సంస్థ iQOO తాజాగా తన Z సిరీస్లో మరో కొత్త 5G స్మార్ట్‌ఫోన్ iQOO Z11iను అధికారికంగా చైనా మార్కెట్‌లో విడుదల చేసింది.
పెద్ద బ్యాటరీ, స్మూత్ డిస్‌ప్లే, రోజువారీ వినియోగానికి సరిపోయే ప్రాసెసర్, IP65 రేటింగ్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకునేలా రూపొందించారు. ముఖ్యంగా ఎక్కువసేపు బ్యాటరీ బ్యాకప్ కోరుకునే విద్యార్థులు, ఉద్యోగులు, సాధారణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ డివైస్‌ను తీసుకొచ్చింది. ఈ ఫోన్ ఫీచర్స్, ధర పూర్తి వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
iQOO Z11i ఫీచర్స్.. భారీ 6500mAh బ్యాటరీ.. iQOO Z11iలో 6500mAh భారీ బ్యాటరీను అందించారు. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సాధారణ వినియోగంలో రెండు రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ లభించే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది. సోషల్ మీడియా బ్రౌజింగ్, వీడియో స్ట్రీమింగ్, కాలింగ్, గేమింగ్ వంటి పనులను ఎక్కువసేపు చేసేవారికి ఈ బ్యాటరీ ఉపయోగపడుతుంది. బ్యాటరీకి 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అలాగే రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉండటంతో అవసరమైతే ఇతర చిన్న డివైస్‌లను కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. డిస్‌ప్లే.. ఈ ఫోన్‌లో 6.74 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉండటంతో స్క్రోలింగ్, సోషల్ మీడియా వినియోగం, గేమింగ్ మరింత స్మూత్‌గా ఉంటుంది. డిస్‌ప్లే స్పెసిఫికేషన్స్.. 6.74 అంగుళాల HD+ LCD స్క్రీన్ ప్రాసెసర్.. పనితీరు కోసం Qualcomm Snapdragon 4 Gen 2 చిప్‌సెట్‌ను ఉపయోగించారు. 4nm టెక్నాలజీపై రూపొందిన ఈ ప్రాసెసర్ తక్కువ పవర్ వినియోగంతో మెరుగైన పనితీరును అందిస్తుంది. దీనికి 8GB వరకు LPDDR4X RAM, 256GB వరకు UFS 3.1 స్టోరేజ్ జత చేశారు. అదనంగా Virtual RAM ఫీచర్ ద్వారా మెమరీని మరింత పెంచుకునే అవకాశం కూడా ఉంది. అలాగే మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను విస్తరించుకోవచ్చు. ఫోన్ Android 16 ఆధారిత OriginOS 6పై పనిచేస్తుంది. కొత్త UIతో పాటు మెరుగైన ప్రైవసీ, AI ఆధారిత సిస్టమ్ ఆప్టిమైజేషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కెమెరా.. బడ్జెట్ ఫోన్ అయినప్పటికీ రోజువారీ ఫోటోగ్రఫీ అవసరాలకు సరిపడే కెమెరా సెటప్‌ను అందించారు. రియర్ కెమెరా AI Portrait, HDR, Night Mode, Panorama వంటి పలు కెమెరా ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. కనెక్టివిటీ & ఇతర ఫీచర్లు.. iQOO Z11iలో పలు ఉపయోగకరమైన ఫీచర్లను కూడా అందించారు. Dual 5G SIM Support దుమ్ము, స్వల్ప నీటి చినుకుల నుంచి రక్షణ కల్పించే IP65 రేటింగ్ ఈ ఫోన్‌కు అదనపు ప్లస్ పాయింట్. iQOO Z11i ధర.. ప్రస్తుతం ఈ ఫోన్ చైనా మార్కెట్‌లో మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 6GB + 128GB - 1,299 యువాన్ (సుమారు రూ.18,000) కలర్ ఆప్షన్స్.. iQOO Z11i మూడు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. Ink Shadow భారత్‌లో ఎప్పుడు? ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనా మార్కెట్‌లో మాత్రమే విడుదల చేశారు. భారత్‌లో లాంచ్‌పై కంపెనీ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే గతంలో వచ్చిన iQOO Z సిరీస్ ఫోన్ల మాదిరిగానే ఈ మోడల్ కూడా త్వరలో భారత మార్కెట్‌లో మరో పేరుతో లేదా ఇదే పేరుతో విడుదలయ్యే అవకాశం ఉందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
1600 × 720 పిక్సెల్స్ రిజల్యూషన్
120Hz రిఫ్రెష్ రేట్
1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
వాటర్‌డ్రాప్ నాచ్ డిజైన్
DC Dimming
TÜV Rheinland Low Blue Light సర్టిఫికేషన్
కళ్లపై ఒత్తిడిని తగ్గించే Eye Protection Mode
13MP ప్రైమరీ కెమెరా
ఆటో ఫోకస్
LED Flash
1080p వీడియో రికార్డింగ్
ఫ్రంట్ కెమెరా
5MP సెల్ఫీ కెమెరా
వీడియో కాల్స్, సోషల్ మీడియా సెల్ఫీల కోసం అనుకూలం
Side Mounted Fingerprint Sensor
Face Unlock
USB Type-C పోర్ట్
Bluetooth 5.1
Dual Band Wi-Fi
GPS
IR Blaster
3.5mm హెడ్‌ఫోన్ జాక్
IP65 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్
Hi-Res Audio సపోర్ట్
8GB + 128GB - 1,499 యువాన్ (సుమారు రూ.21,000)
8GB + 256GB - 1,699 యువాన్ (సుమారు రూ.24,000)
Qingfeng Green
Desert Gold