ఇటీవల ప్రపంచం మొత్తాన్ని కదిలించిన పెంగ్విన్ వీడియోను మనమందరం చూశాం. అంటార్కిటికా మంచు కొండల్లో ఒంటిరి ప్రయాణం తాలుకా జ్ఞాపకాలు ఇంకా మనకు గుర్తున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఇదే అంటార్కిటికా మంచు ఖండంలో ఒక విచిత్రమైన, కలవరపెట్టే ఘటన వెలుగు చూసింది. రాకాసి మంచు కొండలు విరిగిపడి జీవులను నేరుగా ఢీకొట్టాల్సిన అవసరం లేదు.. అవి వెళ్లే దారికి అడ్డంగా నిలిచినా సరే, ఒక జాతి అంతమయ్యేంత పెద్ద విపత్తును మోసుకొస్తాయని శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది. సుమారు 14 కిలోమీటర్ల భారీ పొడవున్న ఒక మంచు కొండ, అంటార్కిటికాలోని పెంగ్విన్ల ఆహార మార్గాన్ని పూర్తిగా అడ్డుకోవడంతో ఒక్క సంతానోత్పత్తి కాలంలోనే పెంగ్విన్ పిల్లల సంఖ్య ఏకంగా 69 శాతం పడిపోయింది.
ఆహార మార్గానికి అతిపెద్ద ఆటంకం!
పెంగ్విన్లు సాధారణంగా సంతానోత్పత్తి సమయంలో సముద్రంలోకి వెళ్లి చేపలు, చిన్న రొయ్యల వంటి జీవులు వేటాడి తెచ్చి తమ పిల్లలకు తినిపిస్తుంటాయి. అయితే, అనూహ్యంగా వచ్చి పడిన ఈ 14 కిలోమీటర్ల భారీ మంచు కొండ పెంగ్విన్ల నివాస ప్రాంతానికి, సముద్రంలో అవి ఆహారం వేటాడుకునే ప్రదేశానికి మధ్యలో చిక్కుకుపోయింది. ఇది పెంగ్విన్ల ఆవాసాలను నేరుగా ధ్వంసం చేయనప్పటికీ, అవి సముద్రంలోకి వెళ్లే సాంప్రదాయ వేట మార్గాన్ని పూర్తిగా మూసివేసింది.
ఈ అడ్డంకి కారణంగా పెంగ్విన్లు తమ పిల్లలకు ఆహారం తీసుకురావడానికి చాలా దూరం చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చింది. సముద్రంలోకి వెళ్లడం, ఆహారాన్ని వేటాడటం, మళ్లీ గూటికి చేరుకోవడం కోసం తీవ్రంగా శ్రమించాల్సి రావడంతో వాటి సమయం, శక్తి అంతా ప్రయాణంలోనే సరిపోయింది. ఆహారం లభించే పరిమాణంలో కొరత లేకపోయినా, ఆహారాన్ని త్వరగా గూటికి చేర్చే దారి లేకపోవడమే ఇక్కడ పెద్ద సమస్యగా మారింది. పుట్టిన తొలి వారాల్లో పెంగ్విన్ పిల్లలు స్వయంగా ఆహారాన్ని వెతుక్కోలేవు. కచ్చితంగా తల్లిదండ్రులు తెచ్చే ఆహారంపైనే ఆధారపడతాయి. అయితే పెద్ద పెంగ్విన్లు దూరభార భారం వల్ల ఆలస్యంగా గూటికి చేరుకోవడంతో, పిల్లలకు సమయానికి తగినంత ఆహారం అందలేదు. ఫలితంగా గతంలో నమోదైన జననాలతో పోలిస్తే, ఈ ఒక్క ప్రతికూలత వల్ల పెంగ్విన్ పిల్లల సంఖ్య 69 శాతం మేర దారుణంగా పడిపోయినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వాతావరణ మార్పుల వల్ల అంటార్కిటికాలో ఉష్ణోగ్రతలు పెరిగి మంచు కరిగిపోవడమే కాకుండా, పెద్ద పెద్ద మంచు కొండలు విరిగిపడి సముద్ర మార్గాల్లో చిక్కుకుపోతున్నాయి. అంటార్కిటికా పర్యావరణ సమతుల్యతకు పెంగ్విన్లను ప్రధాన సూచికగా భావిస్తారు. కేవలం ఒక మంచు కొండ రాకతోనే జీవుల సంతానోత్పత్తి వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిన్న తీరు, రాబోయే రోజుల్లో దక్షిణ ధ్రువంలోని జీవవైవిధ్యం ఎదుర్కోబోయే గండానికి అద్దం పడుతోందని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.Penguin ప్రయాణం వెనక స్టోరీ? చివరికి ఏమైంది?
కిలోమీటర్ల మేర చుట్టు తిరిగి.. సమయం వృథా!
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర..
ఆకలితో అలమటించిన పెంగ్విన్ పిల్లలు!
పర్యావరణ వ్యవస్థకు హెచ్చరిక గంట!