పిచ్చెక్కించే ఫీచర్లతో RED MAGIC Gaming Tablet 5 Pro.. ఎంతంటే ???

మొబైల్ గేమింగ్ ప్రపంచంలో మరోసారి సంచలనం సృష్టించేందుకు ప్రముఖ గేమింగ్ బ్రాండ్ REDMAGIC సిద్దమైంది. తమ కొత్త ఫ్లాగ్‌షిప్ టాబ్లెట్ REDMAGIC Gaming Tablet 5 Proను చైనా మార్కెట్‌లో అధికారికంగా విడుదల చేసింది. గతంలో వచ్చిన Gaming Tablet 3 Proకు అప్‌గ్రేడ్‌గా తీసుకొచ్చిన ఈ కొత్త డివైస్ అత్యాధునిక హార్డ్‌వేర్, శక్తివంతమైన ప్రాసెసర్, ప్రీమియం OLED డిస్‌ప్లే, ఇండస్ట్రీలోనే తొలిసారిగా అందించిన యాక్టివ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో గేమింగ్ సెగ్మెంట్‌లో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేయనుంది.

Advertisement

అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ టాబ్లెట్ REDMAGIC Astra 2 Gaming Tablet పేరుతో విడుదల కానుంది. హై-ఎండ్ మొబైల్ గేమింగ్, కంటెంట్ క్రియేషన్, వీడియో స్ట్రీమింగ్, మల్టీటాస్కింగ్ కోరుకునే వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని దీనిని రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా ధరలు, లభ్యత, ప్రాంతాల వారీ హార్డ్‌వేర్ కాన్ఫిగరేషన్ వివరాలను కంపెనీ జూలై 17న అధికారికంగా ప్రకటించనుంది. ప్రొఫెషనల్ మొబైల్ గేమర్స్, ఈ-స్పోర్ట్స్ ప్లేయర్లు, హై-ఎండ్ మల్టీమీడియా అనుభవం కోరుకునే వినియోగదారులకు ఇది అత్యుత్తమ ఫ్లాగ్‌షిప్ గేమింగ్ టాబ్లెట్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Advertisement

REDMAGIC Gaming Tablet 5 Pro ఫీచర్స్..

డిజైన్..

డిజైన్ పరంగా REDMAGIC తన ప్రత్యేక గుర్తింపైన ట్రాన్స్‌పరెంట్ ఇండస్ట్రియల్ డిజైన్‌ను కొనసాగించింది. వెనుక భాగంలో పారదర్శక గ్లాస్ ప్యానెల్ ఉండటంతో లోపల ఉన్న లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ స్పష్టంగా కనిపిస్తుంది.

90.1% స్క్రీన్-టు-బాడీ రేషియో
కేవలం 4.9mm సన్నని బెజెల్స్
బలమైన అల్యూమినియం అల్లాయ్ ఫ్రేమ్
కేవలం 6.9mm మందం
363 గ్రాముల బరువు
11 RGB LED లైటింగ్ జోన్లు
గేమింగ్ సమయంలో మెరుగైన గ్రిప్ కోసం ఫ్లాట్ బ్యాక్ డిజైన్

RGB లైటింగ్‌ను యూజర్లు తమకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది.

Advertisement

పనితీరు..

ఈ టాబ్లెట్‌లో అత్యాధునిక 3nm Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్‌ను అందించారు. దీనికి REDMAGIC ప్రత్యేకంగా రూపొందించిన RedCore R4 Gaming Chip జత కావడంతో GPU పనితీరు మరింత మెరుగుపడుతుంది.

అలాగే...

AI ఆధారిత Energy Cube 3.0
CPU-GPU స్మార్ట్ లోడ్ మేనేజ్‌మెంట్
తక్కువ పవర్ వినియోగం
ఎక్కువసేపు స్థిరమైన ఫ్రేమ్‌రేట్లు
2K రిజల్యూషన్ గేమింగ్
200కు పైగా గేమ్స్‌లో 144Hz Frame Interpolation

డిస్‌ప్లే..

9.06 అంగుళాల 2.4K OLED Display
165Hz రిఫ్రెష్ రేట్
గరిష్టంగా 185Hz సపోర్ట్
1600 నిట్స్ Peak Brightness
5280Hz PWM Dimming
HDR సపోర్ట్
SGS Low Blue Light Certification
Flicker-Free Display

Advertisement

గేమింగ్ కోసం ప్రత్యేకంగా...

300Hz Multi-touch Sampling Rate
2000Hz Instant Touch Response
కేవలం 1ms Touch Latency

తడి చేతులతో కూడా టచ్ ఖచ్చితత్వం తగ్గకుండా Wet Touch Algorithmను అందించడం మరో ప్రత్యేకత.

ఇండస్ట్రీలో తొలిసారి Active Liquid Cooling..

గేమింగ్ సమయంలో టాబ్లెట్ వేడెక్కకుండా REDMAGIC ఇందులో ప్రపంచంలోనే తొలి Active Liquid Cooling Systemను అందించింది. ఈ కూలింగ్ సిస్టమ్‌లో... Liquid Metal 3.0, Fluorinated, Liquid Coolant, Ultra Thin Micro Pump, భారీ Vapor Chamber, Multi-layer Heat Dissipation Structure.. Intelligent Temperature Control వంటి టెక్నాలజీలు ఉన్నాయి. దీంతో గంటల తరబడి గేమింగ్ చేసినా పనితీరు తగ్గకుండా ఉంటుంది.

Advertisement

8300mAh భారీ బ్యాటరీ..

8300mAh Battery
80W Fast Charging
రెండు USB Type-C Ports
Bypass Charging Support
Gaming Charging Mode

గేమింగ్ చేస్తున్నప్పుడు ఛార్జింగ్ కేబుల్ చేతులకు అడ్డం కాకుండా ప్రత్యేకంగా రెండో USB-C పోర్ట్‌ను అమర్చడం గేమర్లకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

స్టోరేజ్ & RAM..

12GB RAM + 256GB Storage
16GB RAM + 512GB Storage
16GB RAM + 1TB Storage

హైస్పీడ్ LPDDR5X RAM, UFS 4.1 స్టోరేజ్ వల్ల యాప్స్, గేమ్స్ చాలా వేగంగా లోడ్ అవుతాయి.

AI ఫీచర్లు..

Android 16 ఆధారిత REDMAGIC OS 11.5పై పనిచేసే ఈ టాబ్లెట్‌లో MORA AI Agent 2.0ను అందించారు. దీని ద్వారా...

Game Performance Optimization
AI Game Recording
Smart Video Editing
Screen Assistant
Eye Care e-Ink Reading Mode
Voice Commands
Productivity Tools

ఆడియో & కనెక్టివిటీ..

మల్టీమీడియా కోసం...

DTS:X Ultra Dual Stereo Speakers
1620 Speaker Units
Hi-Res Audio Support

కనెక్టివిటీ విషయానికి వస్తే...

Wi-Fi 7
Bluetooth 5.4
USB 3.2 Gen 2
Side Fingerprint Scanner
Face Unlock
4K 144Hz External Display Output
Cross Device Calls & Messages Sync

Advertisement

కెమెరా..

13MP Rear Camera
8MP Front Camera
Full HD వీడియో కాలింగ్
AI Camera Enhancements
Document Scan Mode

ధర..

12GB + 256GB - 5,299 యువాన్ (సుమారు రూ.73,835)
16GB + 512GB - 5,999 యువాన్ (సుమారు రూ.83,600)
16GB + 1TB - 6,999 యువాన్ (సుమారు రూ.97,535)

కలర్స్..

ప్రస్తుతం చైనాలో బ్లాక్, సిల్వర్ రంగుల్లో అమ్మకాలు ప్రారంభమయ్యాయి.

English Summary

Leading gaming brand REDMAGIC is ready to create a sensation in the world of mobile gaming once again. It has officially launched its new flagship tablet, REDMAGIC Gaming Tablet 5 Pro, in the Chinese market.