త్వరలోనే REDMI Note 17 Pro లాంఛ్.. కొత్త కలర్, కొత్త బ్యాటరీ పాలసీ ??

నేటి కాలంలో సెల్ ఫోన్ ఒక నిత్యవసర వస్తువుగా మారిపోయింది. అందుకే ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థలు సైతం కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్స్ ని రిలీజ్ చేస్తున్నాయి. షావోమి సంస్థ రెడ్‌మీ బ్రాండ్ ఇండియా టెక్ మార్కెట్లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ఈ సంస్థ కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ REDMI Note 17 Proకు సంబంధించిన కీలక వివరాలను అధికారికంగా వెల్లదించింది. కాగా ఈ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో జూలై 14న విడుదల చేయనున్నారు. భారీ బ్యాటరీ, అత్యంత బలమైన బాడీ, అధునాతన డిస్‌ప్లేతో ఈ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది.

Advertisement

కొత్త కలర్..

REDMI Note 17 Proలో కంపెనీ ప్రత్యేకంగా Sky Blue కలర్ వేరియంట్‌ను అందిస్తోంది. లైట్ బ్లూ గ్రేడియెంట్ ఫినిష్, మ్యాట్ టెక్స్చర్‌తో ఫోన్‌కు స్టైలిష్ లుక్ వస్తుందని భావిస్తున్నారు. చేతిలో పట్టుకున్నప్పుడు ప్రీమియం ఫీలింగ్ ఇచ్చేలా ఉండేందుకు ఈ డిజైన్ రూపొందించినట్లు షావోమీ స్పష్టం చేసింది.

Advertisement

REDMI Note 17 Pro ఫీచర్స్..

డిస్‌ప్లే..

REDMI Note 17 Proలో 1.5K రిజల్యూషన్ ఫ్లాట్ OLED డిస్‌ప్లేను అందించారు. ఈ స్క్రీన్ గరిష్టంగా 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ను అందించగలదు. దీంతో ఎండలో కూడా స్క్రీన్‌పై ఉన్న కంటెంట్ స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, సోషల్ మీడియా వినియోగం మరింత మెరుగ్గా ఉండేలా డిస్‌ప్లేను ట్యూన్ చేశారు. అలానే కంటి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని Green Mountain Eye Protection Technologyను కూడా అందించారు. తక్కువ వెలుతురులో స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను కేవలం 1 నిట్ వరకు తగ్గించే సదుపాయం కూడా అందిస్తున్నారు.

Advertisement

బిల్డ్ క్వాలిటీ..

ఈ ఫోన్‌లో Corning Gorilla Glass Victus 2 రక్షణను అందించారు. కంపెనీ ప్రకారం, ఈ డివైస్ 3 మీటర్ల ఎత్తు నుంచి పడినా తట్టుకునేలా రూపొందించారు. అదే కాకుండా SGS Dual Five-Star Drop Resistance Certification, CQC Dual Five-Star Quality Certification లభించడం ద్వారా ఈ ఫోన్ బిల్డ్ క్వాలిటీ పట్ల ఆసక్తి నెలకొంది.

నీటిలో 72 గంటలు పనిచేసే సామర్థ్యం

డ్యూరబిలిటీ విషయంలో REDMI Note 17 Pro మరో అడుగు ముందుకేసింది. ఈ ఫోన్‌కు IP66, IP68, IP69, IP69K.. వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్స్ లభించాయి. అంతేకాకుండా TÜV SÜD సర్టిఫికేషన్ ప్రకారం ఈ ఫోన్ 2 మీటర్ల లోతు నీటిలో 72 గంటల వరకు పనిచేసే సామర్థ్యం కలిగి ఉందని షావోమీ వెల్లడించింది.

Advertisement

భారీ 9,000mAh బ్యాటరీ..

REDMI Note 17 Proలో ప్రధాన ఆకర్షణ 9,000mAh సూపర్ భారీ బ్యాటరీ. ఈ బ్యాటరీతో... ఎక్కువసేపు వీడియో స్ట్రీమింగ్, గంటల కొద్దీ గేమింగ్.. దీర్ఘకాలిక సోషల్ మీడియా వినియోగం లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 67W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు. అలాగే 22.5W Wired Reverse Charging సపోర్ట్ కూడా ఉంది. అవసరమైతే ఈ ఫోన్ ద్వారా ఇతర స్మార్ట్‌ఫోన్లు, TWS ఇయర్‌బడ్స్, స్మార్ట్‌వాచ్‌లు వంటి డివైస్‌లను కూడా ఛార్జ్ చేయవచ్చు.

ప్రత్యేక బ్యాటరీ గ్యారంటీ ప్రోగ్రామ్..

Advertisement

ఈసారి షావోమీ వినియోగదారుల కోసం ప్రత్యేక Battery Guarantee Programను కూడా ప్రకటించింది. మొదటి నాలుగేళ్లలో బ్యాటరీ ఆరోగ్యం 80% కంటే తగ్గితే ఉచితంగా కొత్త బ్యాటరీ అందిస్తారు.ఐదో ఏడాదిలో బ్యాటరీ సామర్థ్యం 80% కంటే తగ్గితే అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న కొత్త బ్యాటరీతో ఉచిత అప్‌గ్రేడ్ చేసే అవకాశం కల్పిస్తామని కంపెనీ ప్రకటించింది.

ఇక ప్రస్తుతం షావోమీ ఫోన్‌కు సంబంధించిన ముఖ్యమైన వివరాలను మాత్రమే వెల్లడించింది. ఇంకా ప్రాసెసర్ కెమెరా స్పెసిఫికేషన్లు, RAM & స్టోరేజ్ వేరియంట్లు, Android వెర్షన్.. HyperOS వివరాలు, ధర, గ్లోబల్ లాంచ్ ప్లాన్ వంటి వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. వివరాలన్నింటినీ జూలై 14న జరిగే అధికారిక లాంచ్ ఈవెంట్‌లో వెల్లడించే అవకాశం ఉంది.

English Summary

In today's era, cell phones have become an essential item. That is why even leading smartphone companies are releasing smartphones with new features to attract customers. Xiaomi's Redmi brand has created a good craze in the Indian tech market.