మారుతున్న కాలానుగుణంగా పలు సంస్థలు రోజుకో స్మార్ట్ ఫోన్ ని రిలీజ్ చేస్తున్నాయి. భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో పోటీ రోజురోజుకూ పెరుగుతోంది. తక్కువ బడ్జెట్‌లో హై-ఎండ్ ఫీచర్లను అందించడానికి అనేక కంపెనీలు కొత్త మోడళ్లను తీసుకువస్తున్నాయి. ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు కస్టమర్లను ఆకర్షించేందుకు దిగ్గజ కంపెనీలు సైతం పోటీపడుతున్నారు. Tecno Mobile భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన స్థాయిని మరింత బలోపేతం చేసుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది.
కాగా ఇప్పుడు ప్రీమియం సెగ్మెంట్ లో మరో కొత్త డివైస్‌ను తీసుకొస్తోంది. TECNO CAMON 50 Ultra 5G పేరుతో కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను జూలై 17న మధ్యాహ్నం 12 గంటలకు అధికారికంగా భారత మార్కెట్‌లో లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. AI ఆధారిత కెమెరా ఫీచర్లు, ప్రీమియం డిజైన్, శక్తివంతమైన మల్టీమీడియా అనుభవంతో ఈ ఫోన్ మిడ్-ప్రీమియం విభాగంలో గట్టి పోటీ ఇవ్వనుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి.
AI కెమెరా ఫీచర్లు.. "Sees It All" అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ స్మార్ట్‌ఫోన్‌లో అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత కెమెరా సిస్టమ్‌ను అందిస్తున్నారు. ఫొటోలను మరింత సహజంగా, క్లియర్‌గా మార్చడమే కాకుండా ఎడిటింగ్ పనులను కూడా AI ద్వారా చాలా సులభంగా పూర్తి చేసుకునేలా ప్రత్యేక టూల్స్‌ను అందించారు. AI Photo Enhancement - ఫొటోల్లోని రంగులు, షార్ప్‌నెస్, డిటైల్స్‌ను ఆటోమేటిక్‌గా మెరుగుపరుస్తుంది. వెనుక భాగంలో మల్టీ కెమెరా సెటప్‌తో పాటు ప్రత్యేక LED ఫ్లాష్ మాడ్యూల్‌ను కూడా కంపెనీ అందించింది. దీంతో తక్కువ వెలుతురులో కూడా మెరుగైన ఫొటోగ్రఫీ అనుభవం లభించే అవకాశం ఉంది. ప్రీమియం డిజైన్.. ఈ ఫోన్ లో కంపెనీ ప్రత్యేకంగా రూపొందించిన Silk-Flow Designను ఉపయోగించింది. స్లిమ్ ప్రొఫైల్, గ్లాస్ తరహా ఫినిష్, ఆకర్షణీయమైన కెమెరా మాడ్యూల్, మెరుగైన బిల్డ్ క్వాలిటీతో ఈ ఫోన్ ప్రీమియం లుక్‌ను అందిస్తుంది. భారీ బ్యాటరీ.. ఈ ఫోన్‌లో ఎక్కువసేపు ఉపయోగించుకునేలా భారీ బ్యాటరీని అందించనున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. అయితే బ్యాటరీ సామర్థ్యం, ఛార్జింగ్ వేగానికి సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ లాంచ్ ఈవెంట్‌లో వెల్లడించనుంది. Dolby Atmos ఆడియో.. మ్యూజిక్ ప్రేమికులు, గేమింగ్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని ఈ స్మార్ట్‌ఫోన్‌లో Dolby Atmos సపోర్ట్‌ను అందించారు. దీంతో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూడటం, గేమ్స్ ఆడటం, పాటలు వినేటప్పుడు మరింత మెరుగైన ఆడియో అనుభూతి పొందవచ్చు. రంగులు.. Cypress Green ఈ మూడు రంగులలో ఫోన్ అందుబాటులోకి రానుంది. ఇక ఇప్పటివరకు కంపెనీ పూర్తి స్పెసిఫికేషన్లను వెల్లడించకపోయినా, ఈ ఫోన్‌లో శక్తివంతమైన 5G ప్రాసెసర్, అధిక ర్యామ్, వేగవంతమైన స్టోరేజ్, హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే వంటి ప్రీమియం ఫీచర్లు ఉండే అవకాశం ఉందని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ధర & సేల్ వివరాలు.. ఈ స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్ (Amazon) ద్వారా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. భారత మార్కెట్‌కు సంబంధించిన ధర, పూర్తి స్పెసిఫికేషన్లు, తొలి సేల్ తేదీ, ప్రారంభ ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్లు వంటి వివరాలను కంపెనీ లాంచ్ ఈవెంట్‌లో ప్రకటించనుంది.
AI Object Removal - ఫొటోల్లో అనవసరంగా కనిపించే వ్యక్తులు లేదా వస్తువులను ఒక్క ట్యాప్‌తో తొలగించవచ్చు.
AI Image Expansion - కట్ అయిన ఫ్రేమ్‌ను AI సహాయంతో విస్తరించి పూర్తి ఫొటోలా రూపొందిస్తుంది.
AI Portrait Optimization - పోర్ట్రెయిట్ ఫొటోల్లో ముఖాన్ని మరింత సహజంగా, ఆకర్షణీయంగా చూపిస్తుంది.
AI Content Creation Tools - సోషల్ మీడియా కోసం ఫొటోలు, వీడియోలను మొబైల్‌లోనే వేగంగా ఎడిట్ చేసుకునే అవకాశం.
AI Sky Replacement & Filters - ఫొటోల్లోని ఆకాశాన్ని మార్చడం, ప్రత్యేక ఎఫెక్ట్స్ జోడించడం వంటి సౌకర్యాలు.
Misty Purple
Nebula Titanium