Vivo నుంచి రెండు కొత్త ఫోన్స్ లాంచ్... ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్ !!!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ సంస్థ "Vivo" భారత టెక్ మార్కెట్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. బడ్జెట్ రేంజ్ నుంచి ప్రీమియం రేంజ్ వరకు అన్ని రకాల ఫోన్లతో సపరేట్ ఫాలోయింగ్ ఏర్పరుచుకుంది. ఇప్పుడు లేటెస్ట్ గా చైనా మార్కెట్‌లో Vivo G5i, Vivo G5z పేర్లతో రెండు కొత్త 5G స్మార్ట్‌ఫోన్లను అధికారికంగా విడుదల చేసింది. భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే, IP68/IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్, స్నాప్‌డ్రాగన్ చిప్‌సెట్ వంటి ఫీచర్లతో ఈ ఫోన్లు మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో వినియోగదారులను ఆకట్టుకునేలా ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.

Advertisement

కాగా Vivo G5i, Vivo G5z మోడళ్ల మధ్య పెద్దగా తేడాలు లేవని అంటున్నారు. డిజైన్, డిస్‌ప్లే, ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ వంటి ప్రధాన స్పెసిఫికేషన్లు రెండింటిలోనూ ఒకే విధంగా ఉన్నాయి. మెమరీ వేరియంట్లు మాత్రమే భిన్నంగా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ రెండు ఫోన్లు చైనాలో విక్రయాలకు సిద్ధమవుతుండగా, భారత్ సహా ఇతర మార్కెట్లలో ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Advertisement

ఫీచర్స్..

డిస్‌ప్లే..

Vivo G5i, Vivo G5z స్మార్ట్‌ఫోన్లలో 6.75 అంగుళాల LCD డిస్‌ప్లేను అందించారు. ఈ స్క్రీన్ 1570 × 720 పిక్సెల్ HD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది. 19.6:9 యాస్పెక్ట్ రేషియో, 256ppi పిక్సెల్ డెన్సిటీ, 1500:1 కాంట్రాస్ట్ రేషియోతో స్క్రోలింగ్, వీడియో వీయింగ్, గేమింగ్ అనుభవం మరింత స్మూత్‌గా ఉంటుంది.

ప్రాసెసర్..

పర్ఫార్మెన్స్ కోసం ఈ రెండు ఫోన్లలో Qualcomm Snapdragon 4 Gen 2 4nm చిప్‌సెట్‌ను ఉపయోగించారు. దీనికి Adreno 613 GPU జత చేశారు. దీంతో రోజువారీ పనులతో పాటు మల్టీటాస్కింగ్, సాధారణ గేమింగ్ కూడా సాఫీగా సాగుతుంది. ఫోన్లు గరిష్టంగా 8GB LPDDR5 RAM, 256GB UFS 3.1 స్టోరేజ్తో అందుబాటులో ఉన్నాయి. అదనంగా Android 16 ఆధారిత OriginOS 6పై ఈ డివైస్‌లు పనిచేస్తాయి.

Advertisement

కెమెరా..

ఫోటోగ్రఫీ కోసం వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ఆటోఫోకస్ ప్రైమరీ కెమెరాను అందించారు. ఇది f/1.8 అపర్చర్, 10x డిజిటల్ జూమ్కు మద్దతు ఇస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. ముందు, వెనుక కెమెరాలు రెండూ 1080p వీడియో రికార్డింగ్ను సపోర్ట్ చేస్తాయి. అయితే ఈ ఫోన్లలో OIS (Optical Image Stabilization) లేదా EIS (Electronic Image Stabilization) ఫీచర్లు లేవు.

భారీ బ్యాటరీ..

ఈ రెండు ఫోన్లలో ప్రధాన ఆకర్షణ 7,200mAh భారీ బ్యాటరీ. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే ఎక్కువసేపు బ్యాటరీ బ్యాకప్ అందేలా Vivo రూపొందించింది. దీనికి 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండగా, 33W, 22.5W ఛార్జింగ్ స్టాండర్డ్స్కు కూడా అనుకూలంగా ఉంటుంది. అదనంగా OTG రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అవసరమైతే ఇతర డివైస్‌లను కూడా ఈ ఫోన్‌తో ఛార్జ్ చేసుకోవచ్చు.

Advertisement

ఇతర ముఖ్యమైన ఫీచర్లు..

Vivo G5i, Vivo G5z ఫోన్లలో IP68, IP69 వాటర్ & డస్ట్ రెసిస్టెన్స్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, Face Wake, స్టీరియో స్పీకర్లు, NFC, USB Type-C పోర్ట్, డ్యూయల్ 5G సిమ్ సపోర్ట్, Wi-Fi, Bluetooth, GPS వంటి ఆధునిక కనెక్టివిటీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. డిజైన్ పరంగా కూడా ప్రీమియం ఫినిష్‌తో ఈ ఫోన్లు ఆకట్టుకుంటాయి.

ధరలు..

చైనా మార్కెట్‌లో 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర 2,199 యువాన్‌లు (సుమారు రూ.30,900)గా నిర్ణయించారు. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర 2,899 యువాన్‌లు (సుమారు రూ.40,700)గా ఉంది. ఈ రెండు మోడళ్లు ప్రస్తుతం Obsidian Black కలర్‌లో విడుదలయ్యాయి. త్వరలో మరిన్ని కలర్ ఆప్షన్లు కూడా వచ్చే అవకాశం ఉంది.

Advertisement

భారత్‌లో ఎప్పుడు?

ప్రస్తుతం Vivo G5i, Vivo G5z ఫోన్లు చైనా మార్కెట్‌కే పరిమితమయ్యాయి. భారత్‌లో విడుదలపై Vivo ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే భారీ బ్యాటరీ, 5G కనెక్టివిటీ, ప్రీమియం ఫీచర్లను దృష్టిలో ఉంచుకుంటే, ఈ ఫోన్లు భారత మార్కెట్‌లో కూడా విడుదలైతే మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో Samsung, Redmi, Realme, iQOO, Poco వంటి బ్రాండ్లకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

English Summary

Leading smartphone giant Vivo has announced some exciting news for smartphone lovers.