రోహిత్ భాయ్ రిటైర్మెంట్ పై ఎట్టకేలకు పెదవి విప్పిన బీసీసీఐ- జరగబోయేది ఇదే


భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే రిటైర్మెంట్ వార్తలపై బీసీసీఐ ఎట్టకేలకు స్పందించింది. ఈ ఊహాగానాలకు తెరదించింది. ఇప్పుడు వస్తోన్న వార్తలు, అంచనాలకు భిన్నంగా కీలక ప్రకటన చేసింది. ఇంగ్లాండ్‌తో లార్డ్స్ మైదానంలో జరగబోయే మూడో వన్డే తర్వాత రోహిత్ వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పబోతున్నారంటూ వార్తలు వెల్లువెత్తిన నేపథ్యంలో బీసీసీఐ నుంచి ఈ ప్రకటన రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Advertisement

ఈ వార్తలను బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా తోసిపుచ్చారు. ఆదివారం ఇంగ్లాండ్‌తో జరిగే మూడో వన్డే రోహిత్‌కు చివరి మ్యాచ్ కాదని స్పష్టం చేశారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. రోహిత్ రిటైర్మెంట్‌పై ఇప్పటివరకు బోర్డు స్థాయిలో ఎలాంటి చర్చలు జరగలేదని, ప్రస్తుతం అతను టీమిండియాలో రెగ్యులర్ సభ్యుడని, జట్టు ప్రణాళికల్లో ఉన్నంతవరకు దేశం తరఫున ఆడుతూనే ఉంటారని స్పష్టం చేశారు.

Advertisement

వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్ నేపథ్యంలో రోహిత్ శర్మకు బదులుగా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్‌కు మరిన్ని వన్డేల్లో అవకాశాలు ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలక్షన్ కమిటీ భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తున్నారని, 39 ఏళ్ల రోహిత్ శర్మ ఈ వరల్డ్ కప్ ప్లాన్ లో లేడనే ప్రచారం జరిగింది. ఇంగ్లాండ్ పర్యటన ముగిసిన తర్వాత సెలక్టర్లు రోహిత్‌ను పక్కన పెట్టవచ్చని అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.

ధరణిపై సిట్ తో విచారణ- ఎల్ నినోపై హైఅలర్ట్: 20న..: తెలంగాణ మంత్రివర్గం నిర్ణయాలు
Advertisement

ప్రస్తుత ఇంగ్లాండ్ సిరీస్‌లో మొదటి రెండు వన్డేల్లో రోహిత్ శర్మ అంచనాలకు తగ్గట్టుగా ఆడలేదు. షాట్ల ఎంపికపై విమర్శలు వచ్చాయి. రోహిత్ బ్యాటింగ్‌లో పాత మెరుపులు కనిపించట్లేదని, డాట్ బాల్స్ ఆడిన తర్వాత ఒత్తిడికి గురవుతున్నట్లు కనిపించిందని మాజీ ఆటగాడు దీప్ దాస్‌గుప్తా అభిప్రాయపడ్డారు. ఈ వరుస పరిణామాల వల్లే రోహిత్.. లార్డ్స్ వన్డే తర్వాత ఆటకు స్వస్తి పలుకుతారనే ప్రచారం మరింత ఊపందుకుంది. వీటన్నింటికీ దేవజిత్ సైకియా తెరదించారు.

అటు రోహిత్ శర్మ పట్ల జట్టు మేనేజ్‌మెంట్ వ్యవహరిస్తున్న తీరుపై రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకవేళ రోహిత్‌ను పక్కన పెట్టాలనుకుంటే ఆ విషయాన్ని గత ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే స్పష్టం చేయాల్సిందని అభిప్రాయపడ్డారు. రోహిత్ ఇప్పటికే వన్డే ప్రపంచకప్ కోసం ఫిట్‌నెస్‌పై దృష్టి సారించిన ఈ తరుణంలో, ఇలాంటి వార్తలు రావడం సరికాదని అశ్విన్ స్పష్టం చేశారు.

English Summary

After Ajit Agarkar, Gautam Gambhir Claims Row BCCI Breaks Silence Rohit Sharma Retirement WC Plans