టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్. క్లిష్ట సమయాల్లో జట్టుకు అద్భుతమైన విజయాలు అందించిన క్లాస్ ప్లేయర్.. స్టార్ బ్యాటర్ అజింక్యా రహానే క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. క్రికెట్ లో అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. కొంతకాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న ఈ వెటరన్ బ్యాటర్, తన భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. భారత జట్టుకు కెప్టెన్ గానూ వ్యవహరించాడు.
డీఎస్పీలుగా మరో ఇద్దరు టీమిండియా ప్లేయర్లు- లక్కీ బాయ్స్
అజింక్య రహానే సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తూ.. అభిమానులతో ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నాడు. 'సమయం వచ్చినప్పుడు దాన్ని గౌరవించి ముందుకు సాగాలి' అని తన అంతర్జాతీయ రిటైర్మెంట్ గురించి వెల్లడించాడు. 2011లో ఇంగ్లాండ్‌తో జరిగిన టి20 మ్యాచ్ ద్వారా రహానే భారత జట్టులోకి అడుగుపెట్టాడు. ఆరంభ మ్యాచ్‌లోనే ఓపెనర్‌గా బరిలోకి దిగి 31 బంతుల్లోనే 69 పరుగులు చేసి అందరి దృష్టినీ ఆకట్టుకున్నారు. తన సుదీర్ఘ కెరీర్‌లో ఎత్తుపల్లాలు చూసినప్పటికీ ఏనాడూ వివాదాలకు తావివ్వకుండా ఒక జెంటిల్‌మెన్‌లాగానే రెహానే వ్యవహరించాడు. జట్టులో అందరితోనూ కలివిడిగా వ్యవహరించేవాడు.
రహానే కెరీర్ లో ఆస్ట్రేలియా గడ్డపై సాధించిన ఆ చారిత్రాత్మక బోర్డర్-గావస్కర్ సిరీస్ విజయం కు ఓ ప్రత్యేకత ఉంది. ప్రధాన ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమై.. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి తిరిగి వచిన సమయంలో రహానే కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించి.. అనుభవం లేని కుర్రాళ్లతో కూడిన జట్టును ముందుండి నడిపించి కంగారూలను వాళ్ల సొంత గడ్డపైనే మట్టికరిపించాడు. అడిలైడ్ టెస్టులో ఘోర పరాజయం తర్వాత, మెల్‌బోర్న్ టెస్టులో అతను సాధించిన అద్భుతమైన శతకం రెహానే క్రికెట్ చరిత్రలోనే ఎప్పటికీ నిలిచిపోతుంది. టెస్ట్ ఫార్మాట్‌లో ఎన్నో అద్భుతమైన రికార్డులు నెలకొల్పాడు. విదేశీ గడ్డపై దారుణంగా స్వింగ్ అయ్యే బంతులను ఎదుర్కోవడంలో రెహానే బ్యాటింగ్ నైపుణ్యం స్పష్టమవుతుంది. ఐపీఎల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్, పుణే సూపర్ జెయింట్స్, చెన్నై సూపర్ కింగ్స్ లాంటి దిగ్గజ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పుడు రెహానే రిటైర్మెంట్ డెసిషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.టీమిండియా ఫేట్ మార్చిన వీవీఎస్: గంభీర్ కు ది బెస్ట్ ఆల్టర్నేటివ్ దొరికినట్టే