డీఎస్పీలుగా మరో ఇద్దరు టీమిండియా ప్లేయర్లు- లక్కీ బాయ్స్

టీమిండియాలో ఇద్దరు ప్లేయర్లకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. వారిని డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్ గా నియమించింది. దీనికి అపాయింట్మెంట్ లెటర్లు కూడా వారి చేతికి అందాయి. ఇప్పటికే తెలంగాణ పోలీస్ శాఖలో డీఎస్పీగా నియమితుడయ్యాడు హైదరాబాద్ కు చెందిన భారత జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్. ఇప్పుడు అతని బాటలోనే మరో ఇద్దరు ప్లేయర్లు డీఎస్పీలుగా అపాయింట్ అయ్యారు. వాళ్లు కూడా ఫాస్ట్ బౌలర్లే.

Advertisement

వారిద్దరూ.. ఆకాశ్ దీప్, ముఖేష్ కుమార్‌. వీరికి బీహార్ ప్రభుత్వం ఊహించని ఈ గౌరవాన్ని అందించింది. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించేందుకు అమలు చేస్తున్న 'మెడల్ లావో- నౌకరి పావో' పథకం కింద ఈ నియామకాలు జరిగాయి. పాట్నాలో వైభవంగా జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి స్వయంగా ఈ ఇద్దరు స్పీడ్‌స్టర్లకు నియామక పత్రాలను అందజేశారు.

Advertisement

ఆకాశ్ దీప్, ముఖేష్‌ కుమార్ తో పాటు రాష్ట్రానికి చెందిన మరో 180 మంది ప్రతిభావంతులైన క్రీడాకారులకు వివిధ ప్రభుత్వ విభాగాలలో ఉద్యోగ నియామక పత్రాలను ఈ సందర్భంగా సామ్రాట్ చౌదరి అందజేశారు. అపాయింట్మెంట్ లెటర్ అందుకున్న అనంతరం పేసర్ ఆకాశ్ దీప్ మీడియాతో మాట్లాడాడు. దీన్ని ఓ ఉద్యోగంగా మాత్రమే భావించట్లేదని, ఓ బాధ్యత అని వ్యాఖ్యానించాడు. ఇటువంటి నిర్ణయాలు కష్టపడి ఆడే ప్లేయర్లకు స్ఫూర్తిని ఇస్తాయని చెప్పారు.

ఢిల్లీ పోలీసుల భలే ఎత్తుగడ- కాక్రోచ్ ల ముఖాలు లైవ్ స్కాన్
Advertisement

క్రీడల్లో రాణిస్తే తమ పిల్లల భవిష్యత్తు సురక్షితంగా ఉంటుందనే నమ్మకాన్ని ఈ పథకం తల్లిదండ్రులకు కలిగిస్తుందని అన్నాడు. బీహార్ క్రీడా ప్రాధికార సంస్థ నిబంధనల ప్రకారం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించే ప్లేయర్లు, అథ్లెట్లకు ఎటువంటి రాత పరీక్షలు లేకుండా నేరుగా డీఎస్‌పీ, సబ్ ఇన్‌స్పెక్టర్ల వంటి గ్రూప్-1 స్థాయి ఉద్యోగాలు లభిస్తాయి. వీటితో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 637 మంది క్రీడాకారులకు స్కాలర్‌షిప్స్ కూడా లభించనున్నాయి.

పసిడి రేట్లను ప్రభావితం చేస్తోన్న కీలకాంశాలు: ఇక ఇప్పట్లో.. !!

సక్షమ్ పథకం కింద ఏడాదికి రూ. 3 లక్షలు, ఉత్కర్ష్ ద్వారా రూ. 5 లక్షల నుండి రూ. 20 లక్షల వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుంది. దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్ జట్టు తరఫున ఆడుతున్నప్పటికీ, ఈ ఇద్దరు ఫాస్ట్ బౌలర్లకు బీహార్ మూలాలతో బలమైన అనుబంధం ఉంది. ఆకాశ్ దీప్ బీహార్‌లోని రోహ్‌తాస్ జిల్లాకు చెందినవాడు కాగా, ముఖేష్ కుమార్ గోపాల్‌గంజ్ నివాసి. ఆకాశ్ దీప్ ఇప్పటివరకు భారత జట్టు తరఫున 10 టెస్టు మ్యాచ్‌లు ఆడి 3.91 ఎకానమీతో 28 వికెట్లు పడగొట్టాడు. ముఖేష్ కుమార్ టీమిండియా తరఫున మూడు టెస్టులు, ఆరు వన్డేలు, 17 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

English Summary

CM Samrat Choudhary Hands Appointment Letters to Cricketers Akash Deep and Mukesh Kumar as DSPs. Under the Bring a Medal, Get a Job scheme of the Bihar govt, Certificates were also distributed to the selected athletes under the Sports Scholarship Scheme.