ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో రద్దీ నెలకొంది. శనివారం నాడు 86,231 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 32,017 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు తీర్చుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.74 కోట్ల రూపాయల కానుకలు తిరుమల తిరుపతి దేవస్థానానికి అందాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పట్టింది. మొత్తం 4.73 లక్షల లడ్డూలు విక్రయం అయ్యాయి. అలాగే 2.47 లక్షల మంది భక్తులు అన్న ప్రసాదాన్ని స్వీకరించారు.
భారత క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన ప్రియురాలు మహికా శర్మతో కలిసి ఈ తెల్లవారు జామున సుప్రభాత సేవలో పాల్గొన్నారు. శ్రీవారి దర్శనం కోసం శనివారం రాత్రే ఆయన తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహంలో బస చేశారు. ఈ తెల్లవారు జామున స్వామివారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ ప్రాంగణంలోని రంగనాయకులవారి మండపంలో అర్చకులు ఆయనకు వేదాశీర్వచనాలు పలికారు. స్వామివారి శేషవస్త్రాన్ని బహూకరించారు.
కాగా.. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ వరకూ ముంబై ఇండియన్స్ కేప్టెన్ గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా.. ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్న విషయం తెలిసిందే. ఆ ఫ్రాంఛైజీకి గుడ్ బై చెప్పాడు. జట్టు నుంచీ బయటికొచ్చాడు. వచ్చే ఐపీఎల్ సీజన్ నాటికి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడటం దాదాపుగా ఖాయమైంది. తాను ఏ జట్టులో చేరినా కూడా కేప్టెన్ గా బాధ్యతలు చేపట్టాలని గట్టిగా కోరుకుంటున్నాడు హార్దిక్ పాండ్యా. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ కు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. హార్దిక్ పాండ్యా కోసం అతన్ని పక్కన పెట్టడానికి సీఎస్కే మేనేజ్మెంట్ పెద్దగా ఆసక్తి చూపట్లేదు. అలాగనీ హార్దిక్ పాండ్యాను కూడా వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. అటు బ్యాటింగ్ లో, ఇటు బౌలింగ్ లో సత్తా చాటే ఆల్ రౌండర్ జట్టులో లేకపోవడం వల్ల హార్దిక్ ను తీసుకోవాలనే పట్టుదలతో ఉంది. అతను కేప్టెన్సీని కోరుకుంటోండటం వల్ల పునరాలోచనలో పడింది. ఈ పరిస్థితిలో లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్, మాజీ కేప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జోక్యం చేసుకున్నట్లు చెబుతున్నారు. హార్దిక్ పాండ్యా, జట్టు మేనేజ్మెంట్ తో మాట్లాడి ఈ చిక్కును విడదీశారని అంటున్నారు. హార్దిక్ పాండ్యాను చెన్నై సూపర్ కింగ్స్ కేప్టెన్ గా నియమించడానికి దాదాపుగా గ్రీన్ సిగ్నల్ పడినట్టయింది. ఈ చర్చలు ఫలప్రదం అయినందున హార్దిక్ పాండ్యా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నాడని అంటున్నారు. ఒకవేళ సీఎస్‌కేతో కెప్టెన్సీ ప్రతిపాదనలు సఫలం కాకపోత.. కోల్‌కతా నైట్ రైడర్స్ లో హార్దిక్ పాండ్యా చేరుతాడనే ప్రచారం సాగింది. ప్రస్తుతం ఆ జట్టుకు సమర్థుడైన కెప్టెన్‌తో పాటు జట్టు సమతుల్యతను కాపాడే ఒక నాణ్యమైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అవసరం ఉంది. హార్దిక్ పాండ్యా ఈ రెండు స్థానాలను ఖచ్చితంగా భర్తీ చేయగలడని కేకేఆర్ భావించింది. అతను కోరుకున్నట్టే కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించేందుకు ఫ్రాంచైజీ యాజమాన్యం సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ సైతం హార్దిక్ పాండ్యాను తమ గూటికి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు సాగించింది. రిషభ్ పంత్.. తిరిగొచ్చినప్పటికీ.. నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి పెద్దగా ఆసక్తి చూపట్లేదు. దీంతో గత సీజన్లలో జట్టును నడిపించిన అక్షర్ పటేల్‌తో పాటు కేఎల్ రాహుల్ పేర్లు ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయి.సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళి బోనాలు ఆరంభం- జనసంద్రం: దారులన్నీ ఆలయం వైపే
వాస్తు ప్రకారం మెట్ల కింద ఎంతమాత్రం ఉంచకూడని వస్తువులు