టీమిండియాకు విచిత్ర పరిస్థితి.. మ్యాచ్ మొదలయ్యే ముందే బిగ్ ట్విస్ట్!

IND vs ENG 5th T20: సౌతాంప్టన్‌లోని ది రోజ్ బౌల్ స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్లు మధ్య జరగుతున్న టీ20 సిరీస్లో భాగంగా ఐదో, చివరి టీ20 అంతర్జాతీయ మ్యాచ్ టాస్ ఆలస్యమైంది. దీనికి కారణం టీమిండియా ఓ విచిత్ర పరిస్థితి వల్ల స్టేడియానికి రాలేకపోవడంతో టాస్ ఆలస్యమైనట్లు తెలిసింది. సౌతాంప్టన్ రోడ్లపై భారీ ట్రాఫిక్ కారణంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్.. భారత జట్టులోని ఇతర సభ్యులు సమయానికి స్టేడియానికి చేరుకోలేకపోవడంతో మ్యాచ్ రిఫరీ టాస్‌ను వాయిదా వేయాల్సి వచ్చింది. 5 మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లాండ్ జట్టు ఇప్పటికే గెలుచుకున్నప్పటికీ.. టీమిండియాకు ఈ మ్యాచ్ గెలవడం చాలా అవసరం. ఇప్పటికే సిరీస్ లో 0-3తో వెనుకబడిన శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు తమ పరువును నిలబెట్టుకోవడానికి ఈ మ్యాచ్ చాలా కీలకం.

Advertisement

ఈ మ్యాచ్ చాలా కీలకం
భారత్ ఇప్పటికే ఈ సిరీస్ ఓడిపోయి ఉండొచ్చు.. కానీ టీ20 ర్యాంకింగ్స్‌లో తన ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి ఇదే చివరి అవకాశం. 0-3తో వెనుకబడిన భారత జట్టు ఇప్పటికే ఈ 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను కోల్పోయింది. సిరీస్ పరంగా ఈ మ్యాచ్ నామమాత్రపుది అయినప్పటికీ.. టీమిండియా కొంతైనా తమ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఈ మ్యాచ్ కీలకంగా మారింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ పర్యటనలో తన తొలి అంతర్జాతీయ గెలుపు కోసం ఎదురుచూస్తుండగా.. యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ కూడా ఇంగ్లీష్ గడ్డపై తన తొలి ప్రధాన విజయం కోసం ఎంతో ఆతృతగా ఉన్నాడు.

Advertisement

అన్నింటికన్నా ముఖ్యంగా ఐసీసీ పురుషుల టీ20 ర్యాంకింగ్స్‌లో తమ నంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే టీమిండియా ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాలి. ఒకవేళ భారత జట్టు ఈ మ్యాచ్‌లో ఓడిపోతే, మార్చి 2026లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత వారి ఆధిపత్యం ప్రమాదంలో పడుతుంది. ర్యాంకింగ్స్ పరంగానే కాక, పోటీ ప్రక్రియలోనూ క్లీన్ స్వీప్‌ను నివారించడానికి టీమిండియా ఈ మ్యాచ్ గెలవాలని కోరుకుంటుంది.

వైభవ్ సూర్యవంశీ స్థానంలో సంజూ శాంసన్
ఆలస్యంగా పడిన టాస్ లో భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ జట్టు ముందు బ్యాటింగ్ తో బరిలోకి దిగనుంది. అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. స్టేడియానికి చేరుకోవడానికి ఆలస్యమైందని.. దాని వల్ల ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన పేర్కొన్నారు. ఈ మ్యాచ్ లో ఫలితం గురంచి ఆలోచించకుండా.. 100 శాతం శ్రమించాలని అనుకుంటున్నామన్నారు. ఈ మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ స్థానంలో సూర్యాంశ్ షెడ్గే, వైభవ్ సూర్యవంశీ స్థానంలో సంజూ శాంసన్ జట్టులో ఉన్నారని తెలిపాడు.

Advertisement

ఇరు జట్లు
భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ

ఇంగ్లండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్

English Summary

IND vs ENG 5th T20 toss delayed as Team India gets stuck in Southampton traffic. Shreyas Iyer wins the toss and opts to bowl. Sanju Samson returns to the playing XI.