అదే మా కొంపముంచింది.. కార్డిఫ్ వన్డేలో ఓటమిపై గిల్ ఆవేదన!


IND vs ENG: గురువారం ఇంగ్లాండ్‌లోని కార్డిఫ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత్ 6 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడటంతో 3 మ్యాచ్‌ల సిరీస్ 1-1తో సమమైంది. మ్యాచ్ అనంతరం అనంతరం టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ భారత జట్టు చేసి తప్పుల గురించి బహిరంగంగా మాట్లాడాడు. పటిష్టమైన స్థితిలో ఉన్నప్పటికీ భారత జట్టు పెద్ద స్కోరు చేయడంలో విఫలమైందని శుభ్‌మన్ గిల్ అంగీకరించాడు. మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడమే మ్యాచ్ ఓడిపోవడానికి కారణమని గిల్ పేర్కొన్నాడు. వాషింగ్టన్ సుందర్ గాయం, జో రూట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఈ ఓటమికి కారణాలు అని గిల్ సూచించాడు. తాము సులభంగా 300 పరుగులు చేయాల్సిన పిచ్‌పై బ్యాటర్లు చేతులెత్తేయడం వల్లే మ్యాచ్ చేజారిందని అంగీకరించాడు.

Advertisement
మార్కెట్లోకి రాయల్ ఎన్‌ఫీల్డ్ మాస్టర్ పీస్: ఇండియాలో కేవలం 25 మందికే ఛాన్స్!
Advertisement

ఈ మ్యాచ్‌లో 32 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 178 పరుగుల వద్ద పటిష్టంగా ఉన్న భారత్.. ఆ తర్వాత 44 ఓవర్లలో 233 పరుగులకే కుప్పకూలింది. ఆ తర్వాత మిడిలార్డర్‌ కుప్పకూలడం వల్లే టీమిండియా 233 పరుగుల వద్ద ఆలౌట్ అయిందని పేర్కొన్నాడు. టెయిలెండర్ల నుంచి ఎక్కువ పరుగులు ఆశించకూడదని, అయితే వారు ఆరంభంలో లభించిన ఆధిక్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందని ఆయన అన్నారు. ఇకపై చిన్న చిన్న భాగస్వామ్యాలను నిర్మించడంపై జట్టు దృష్టి సారిస్తుందని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

బ్యాటింగ్ తో పాటు ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడటం కూడా జట్టు వ్యూహాలను భారీగా దెబ్బతీసిందని కెప్టెన్ పేర్కొన్నాడు. వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా తాము బౌలింగ్ కాంబినేషన్ ను మార్చాల్సి వచ్చిందని.. దీని వల్ల ప్రధాన బౌలర్లపై అదనపు భారం పడిందని గిల్ తెలిపాడు. అయినప్పటికీ పిచ్ నుంచి పేసర్లకు లభించిన సహకారం వల్ల మ్యాచ్ ను నిలబెట్టే ప్రయత్నం చేశామని.. కానీ తక్కువ స్కోరు కావడం వల్ల ఇంగ్లాండ్ జట్టును కట్టడి చేయలేకపోయామని గిల్ స్పష్టం చేశాడు.

Advertisement
హార్ముజ్ ఉద్రిక్తతల ఎఫెక్ట్- షిప్పింగ్ కంపెనీలకు కేంద్రం కీలక ఆదేశం..!

ఇంగ్లాండ్ సీనియర్ ఆటగాడు జోరూట్ అజేయంగా 99 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లాండ్ జట్టుకు విజయాన్ని అందించడాన్ని గిల్ ప్రశంసించాడు. భారత జట్టు స్కోరు బోర్డుపై 300 పరుగులు ఉంచి ఉంటే.. రన్ రేట్ ఒత్తిడి పెరిగి జో రూట్ ను తప్పులు చేసే ఒత్తిడికి గురిచేసేవాళ్లమని అభిప్రాయపడ్డాడు. కానీ 240 పరుగుల లోపు లక్ష్యాన్ని ఛేదించడంలో జో రూట్ లాంటి క్లాస్ ప్లేయర్ మాస్టర్ అని.. అతడిని అడ్డుకోవడంలో తమ బౌలర్లు విఫలమయ్యారని గిల్ అంగీకరించాడు. ఆదివారం జరగనున్న సిరీస్ డిసైడింగ్ మ్యాచ్ లో ఈ తప్పులను సరిదిద్దుకుని బరిలోకి దిగుతామని కెప్టెన్ గిల్ ధీమా వ్యక్తం చేశాడు.

Advertisement

ఓటమి కథ 5 పాయింట్లలో..
*భారత్ 178/3 నుండి 233 పరుగులకే ఆలౌట్ అయింది.
*జట్టు 300-310 పరుగులు చేసి ఉండవచ్చని శుభ్‌మన్ గిల్ అంగీకరించాడు.
*లోయర్ మిడిల్ ఆర్డర్ ప్రదర్శన పట్ల కెప్టెన్ నిరాశ వ్యక్తం చేశాడు.
*వాషింగ్టన్ సుందర్ గాయం బౌలింగ్ వ్యూహాన్ని ప్రభావితం చేసింది.
*జో రూట్ అజేయంగా 99 పరుగులు చేసి ఇంగ్లండ్‌కు 6 వికెట్ల విజయాన్ని అందించాడు.

English Summary

India vs England 2nd ODI, Team India Captain Shubman Gill points out middle-order collapse, Washington Sundar's injury, and Joe Root's masterclass as key reasons for India's Cardiff ODI defeat.