లియోనెల్ మెస్సీ.. దమ్మున్నోడు: ఓటమి కోరల్లో ఉన్న జట్టును లాక్కొచ్చి ఒడ్డున పడేశాడు

ఫిఫా వరల్డ్ కప్ లో అర్జెంటీనా మరోసారి తన తిరుగులేని పోరాట పటిమను ప్రదర్శించింది. అట్లాంటా స్టేడియంలో ఈజిప్ట్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో అర్జెంటీనా 3-2 తేడాతో అద్భుత విజయం సాధించింది. ఒక దశలో రెండు గోల్స్ వెనకబడి ఓటమి అంచున నిలిచినప్పటికీ.. ఆఖరి నిమిషాల్లో అసాధారణంగా పుంజుకుంది. మ్యాచ్ ను చేజిక్కించుకుంది. కెప్టెన్ లియోనెల్ మెస్సి తన అద్భుత ప్రదర్శనతో జట్టును విజయతీరాలకు చేర్చాడు.

Advertisement

ఈ మ్యాచ్‌లో ఆరంభం నుండి ఈజిప్ట్ పకడ్బందీ వ్యూహంతో ఆడింది. ఆట 15వ నిమిషంలోనే ఈజిప్ట్ ఆటగాడు యాసర్ ఇబ్రహీం గోల్ సాధించాడు. మరవాన్ అట్టియా అందించిన పాస్‌ను గోల్‌గా మార్చి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని ఇచ్చాడు. అనంతరం అర్జెంటీనా మ్యాచ్‌పై పట్టు సాధించేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఈజిప్ట్ డిఫెన్స్ ను ఏ మాత్రం కూడా ఛేదించలేకపోయింది.

Advertisement

పైగా ద్వితీయార్థంలో 67వ నిమిషంలో ముస్తఫా జికో మరో గోల్ చేయడంతో ఈజిప్ట్ జట్టు 2-0తో తిరుగులేని స్థితికి చేరుకుంది. 0-2 తేడాతో ఓటమి కోరల్లో చిక్కుకుంది అర్జెంటీనా. ఈ తరుణంలో అర్జెంటీనా వ్యూహాత్మక మార్పులు చేసింది. లాటారో మార్టినెజ్ మైదానంలోకి ప్రవేశించిన తర్వాత అర్జెంటీనా ఆట శైలి పూర్తిగా మారిపోయింది. మ్యాచ్ 79వ నిమిషంలో కెప్టెన్ లియోనెల్ మెస్సి అందించిన అద్భుతమైన పాస్‌ను డిఫెండర్ క్రిస్టియన్ రొమేరో హెడర్ ద్వారా గోల్‌గా మలిచాడు.

దీంతో అర్జెంటీనా మొదటి గోల్ సాధించి స్కోరును 1-2కు తగ్గించింది. ఈ గోల్ అర్జెంటీనా ఆటగాళ్లలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ గోల్ వచ్చిన దూకుడును అక్కడితో సరిపెట్టుకోలేదు. సరిగ్గా నాలుగే నాలుగు నిమిషాల తర్వాత అంటే 83వ నిమిషంలో గొంజాల్లో మోంటియల్ అందించిన అద్భుత పాస్‌ను క్లాసిక్ షాట్‌తో లియోనెల్ మెస్సి గోల్‌గా మార్చాడు. స్కోరు 2-2తో సమం కావడంతో మ్యాచ్ ఊహించని మలుపు తిరిగింది.

Advertisement

దీంతో పెనాల్టీ షూటౌల్ తప్పదనుకున్న దశలో మ్యాచ్ అనూహ్యంగా మలుపు తిరిగింది. ఇంజూరీ టైమ్ (90+3వ నిమిషం) లో లౌటారో మార్టినెజ్ అసిస్ట్‌తో ఎంజో ఫెర్నాండెజ్ మేజిక్ చేశాడు. ఈజిప్ట్ గోల్ కీపర్ ను ఏమార్చుతూ ఇచ్చిన కిక్.. మ్యాచ్ మొత్తానికీ హైలైట్. దీంతో అర్జెంటీనా 3-2తో అపూర్వ విజయాన్ని అందుకుంది.

ఈ మ్యాచ్ లో అర్జెంటీనా స్పష్టమైన ఆధిక్యం కనబర్చింది. మ్యాచ్ పొడుగునా 58 శాతం బంతిని తమ ఆధీనంలో ఉంచుకోగా, ఈజిప్ట్ 42 శాతానికే పరిమితమైంది. అర్జెంటీనా ఫార్వర్డ్ ఆటగాళ్లు ప్రత్యర్థి గోల్ పోస్ట్‌పై ఏకంగా 17 సార్లు దాడులు చేయగా, అందులో 7 షాట్లు నేరుగా లక్ష్యం వైపు వెళ్లాయి. మెస్సి సేన చూపించిన ఈ ఒత్తిడి చివరకు ఈజిప్ట్ డిఫెన్స్ ను కుప్పకూల్చింది.

Advertisement

ఈ ఘన విజయం ప్రపంచ కప్ ఛాంపియన్స్ అయిన అర్జెంటీనా జట్టులోని పోరాట పటిమను మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా విజయాన్ని ఎలా లాక్కోవాలో మెస్సి టీమ్ నిరూపించింది. ఈ ఓటమి ఈజిప్ట్ శిబిరానికి తీవ్ర నిరాశను మిగిల్చినప్పటికీ, మ్యాచ్ ముగిసే వరకు వారు ప్రదర్శించిన గట్టి పోటీ.. ప్రేక్షకులను కట్టిపడేసింది. ఉక్కిరిబిక్కిరికి గురి చేసింది.

English Summary

Lionel Messi Ignites Argentina Stunning FIFA World Cup Comeback vs Egypt After 3-2 Down Last-16 Thriller. But it only served to mark the start of the goalkeeping heroics of Shoubir, whose dive to the left easily stopped a left-footed effort from Messi that was too close to the keeper.