ఎంబాపే కొట్టిన ఆ షాట్ ను అడ్డుకునే దమ్ముందా: దిగ్విజయంగా క్వార్టర్స్ లో ఫ్రాన్స్

ఫిఫా ప్రపంచకప్ నాకౌట్ దశలో టైటిల్ ఫేవరెట్ ఫ్రాన్స్ తీవ్ర ఉత్కంఠత మధ్య మరో అద్భుత విజయాన్ని అందుకుంది. ఫిలడెల్ఫియా స్టేడియంలో నాకౌట్ మ్యాచ్‌లో పరాగ్వేపై 1-0 తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్ ఏకపక్షంగా సాగుతుందనుకున్నప్పటికీ.. పరాగ్వే డిఫెన్స్.. ఫ్రాన్స్ అటాకర్లను కట్టిపడేసింది. పక్కా వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరికి గురి చేసింది. దీంతో మ్యాచ్ 70వ నిమిషంలో సాధించిన ఒకే ఒక్క గోల్ తో గెలవాల్సొచ్చింది దిగ్గజ ఫ్రాన్స్ జట్టుకు.

Advertisement

అత్యంత ఒత్తిడితో కూడిన సమయంలో ఫ్రాన్స్ కెప్టెన్ కిలియన్ ఎంబాపె సాధించిన ఈ పెనాల్టీ గోల్‌తో పైచేయి సాధించింది. దిగ్విజయంగా క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. ఆట ప్రారంభం నుంచి దూకుడుగా ఆడారు ఈ రెండు జట్ల ప్లేయర్లు. ఘర్షణలు సైతం చోటుచేసుకున్నాయి. పరాగ్వే డిఫెండర్లు ఫ్రాన్స్ అనుభవజ్ఞులైన ఫార్వార్డ్‌లకు అస్సలు అవకాశం ఇవ్వకుండా అత్యంత పకడ్బందీగా వ్యవహరించారు. మొదటి అర్ధభాగంలో ఫ్రాన్స్ ఒక్క షాట్‌ కూడా ప్రత్యర్థి గోల్ పోస్ట్ వైపు కొట్టలేకపోయిందంటే పరాగ్వే వ్యూహాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

Advertisement

1966 తర్వాత ప్రపంచకప్ నాకౌట్ రౌండ్లలో ఫస్ట్ హాఫ్ లో రెండు జట్లూ కనీసం ఒక్క షాట్‌ను కూడా గోల్ పోస్ట్ వైపు కొట్టలేకపోవడం ఇది మూడోసారి మాత్రమే. దీన్ని ఛేదించడానికి ఫ్రాన్స్ కోచ్ డిడియర్ డెషాంప్స్ వ్యూహాత్మకంగా మార్పులు చేశారు. బార్కోలాను వెనక్కి పిలిచి అతని స్థానంలో పారిస్ సెయింట్ జెర్మైన్ యువ స్టార్ డెసిర్ డౌను సబ్‌స్టిట్యూట్‌గా దించాడు. దీంతో మ్యాచ్ స్వరూపం మారింది. పరాగ్వే కూడా తన తన డిఫెన్స్‌ను మరింత పటిష్టం చేయడానికి 58వ నిమిషంలో ఓమర్ ఆల్డెరెట్ స్థానంలో జోస్ కెనాల్‌, 61వ నిమిషంలో జూలియో ఎన్సిసో స్థానంలో గుస్తావో కాబల్లెరోను రంగంలోకి దంపింది.

Advertisement

ఈ మార్పుల తర్వాత ఆట స్వరూపం మారింది. చివరకు మ్యాచ్ 70వ నిమిషంలో ఫ్రాన్స్ క్రీడాకారుల నిరీక్షణకు తెరపడింది. డీబాక్స్ లోపల ప్రత్యర్థి డిఫెండర్ డిగో గోమెజ్.. డెసిర్ డౌను కిందపడేయడంతో ఫ్రాన్స్‌కు పెనాల్టీ లభించింది. అదే గోల్ తెచ్చి పెట్టింది ఫ్రాన్స్ కు. పెనాల్టీ కిక్ అందుకున్న ఎంబాపెను అడ్డుకోవడానికి పరాగ్వే ఆటగాళ్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి సాధ్యపడలేదు. ఏమాత్రం చలించని ఎంబాపే 70వ నిమిషంలో పెనాల్టీని క్లియర్ గోల్‌గా మార్చి ఫ్రాన్స్ శిబిరంలో ఆనందాన్ని నింపాడు.

ఆట ముగింపు సమయానికి చేరుకుంటున్న కొద్దీ మైదానంలో ఉద్రిక్తత పెరిగింది. పరాగ్వే దాడిని అడ్డుకునే క్రమంలో 81వ నిమిషంలో ఫ్రాన్స్ ఆటగాడు మను కోనె ఎల్లో కార్డు అందుకోవాల్సి వచ్చింది. చివరి నిమిషాల్లో ఒస్మానే డెంబ్లే స్థానంలో రాయన్ చెర్కీ గ్రౌండ్ లోకి దిగాడు. ఫ్రాన్స్ డిఫెన్స్‌ను మరింత పటిష్టం చేశాడు. పరాగ్వే జట్టు మ్యాచ్‌ను సమం చేయడానికి చివరి క్షణం వరకు గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ, ఫ్రాన్స్ డిఫెన్స్‌ను చేధించలేకపోయింది.

Advertisement

మొత్తంగా 19వ ప్రపంచకప్ గోల్ సాధించాడు ఎంబాపె. ఫుట్‌బాల్ ప్రపంచకప్ చరిత్రలోనే నాకౌట్ రౌండ్లలో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా నూతన రికార్డు నెలకొల్పాడు. ఇది.. ఫిఫా వరల్డ్ కప్ టోర్నమెంట్ చరిత్రలో ఫ్రాన్స్ జట్టుకు 150వ గోల్ కూడా. పరాగ్వేపై సాధించిన గెలుపుతో ఫ్రాన్స్ క్వార్టర్స్ లో అడుగు పెట్టింది.

English Summary

Mbappe Stuns Again as France Edge Paraguay Seals 1-0, with 19th World Cup Goal Reach the Quarterfinals. In fact, it was only the fourth time since 1966 Les Bleus manage a shot in the first 20 minutes of a World Cup match, though Manu Kon s deflected shot off Diego G mez.