మహేంద్ర సింగ్ ధోనీ. మిస్టర్ కూల్ గా క్రికెట్ ఫ్యాన్స్ మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఈ రోజు 45వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. టీం ఇండియాకు అత్యధిక ఐసీసీ (ICC) ట్రోఫీలను అందించిన గొప్ప 'ట్రోఫీ కలెక్టర్'గా ఎదిగిన ధోనీ ప్రస్థానం ప్రపంచ క్రీడా చరిత్రలోనే ఎందరికో స్ఫూర్తిదాయకం. తలా జన్మదినం వేళ అభిమానులు విషెస్ తో హోరెత్తిస్తున్నారు. BCCI తో పాటుగా FIFA ధోనీకి ప్రత్యేకంగా జన్మదినం వేళ అరుదైన గుర్తింపు అందించింది.
ధోనీ జన్మదినం క్రికెట్ ఫ్యాన్స్ పండుగలా చేసుకుంటున్నారు. FIFA అధికారిక సోషల్ మీడియా ఐకానిక్ నెంబర్ 7 కి ప్రత్యేక గుర్తింపు ఇచ్చాయి. లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, మరియు కైలియన్ ఎంబాపే వంటి ఫుట్‌బాల్ దిగ్గజాలను ప్రసిద్ధ నంబర్ 7తో కలిపి చూపిస్తూ ప్రత్యేకంగా ధోనీ మేజిక్ ను గుర్తు చేసారు. అదే విధంగా ధోనికి బీసీసీఐ స్పెషల్ విషెస్ చెప్పింది. క్రికెట్ ఐకాన్ అంటూ అభివర్ణిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టింది. 538 అంతర్జాతీయ మ్యాచ్‌లు.. 17,266 పరుగులు.. 829 స్టంపింగ్స్.. కెప్టెన్‌గా మూడు ఐసీసీ ట్రోఫీలు.. రాంచీ వీధుల నుంచి ప్రపంచ క్రికెట్‌ను శాసించే వరకు ఎదిగిన కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని పుట్టిన రోజు నేడు. టికెట్ కలెక్టర్ స్థాయి నుంచి దేశానికి ట్రోఫీలు అందించే వరకు.. మాహీ ప్రస్థానం అద్వితీయం..అంటూ 45వ పడిలోకి అడుగుపెడుతున్న ధోనికి బీసీసీఐ స్పెషల్ విషెస్ చెప్పింది.
భారత్‌కు 200 వన్డేల్లో నాయకత్వం వహించి 110 మ్యాచ్‌ల్లో విజయాన్ని అందించాడు. 74 మ్యాచ్‌ల్లో ఓటమి ఎదురవగా, 5 మ్యాచ్‌లు టై అయ్యాయి. వన్డేల్లో అతని విన్నింగ్ శాతం 55% గా ఉంది.ధోనీ నాయకత్వంలోనే యువ భారత్ 2007లో మొట్టమొదటి ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఇది భారత క్రికెట్‌లో సరికొత్త శకానికి నాంది పలికింది. 2004లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ధోనీ...మొదట్లో బంతిని బాదే విధ్వంసకర బ్యాటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. కాలక్రమేణా తన దూకుడును వ్యూహాత్మకంగా మార్చుకుంటూ ప్రపంచంలోనే అత్యుత్తమ 'ఫినిషర్'గా అవతరించాడు. వికెట్ కీపర్-బ్యాటర్ పాత్రకు సరికొత్త నిర్వచనాన్ని ఇస్తూ వన్డే క్రికెట్‌లో సరికొత్త విప్లవాన్ని తెచ్చాడు. కెప్టెన్‌గా 72 టీ20 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించి 41 విజయాలను అందించాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో మూడు వేర్వేరు ఐసీసీ ట్రోఫీలను (2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ) గెలుచుకున్న ఏకైక కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ మాత్రమే. అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలిగినా.. క్రికెట్ ఫ్యాన్స్ మదిలో మాత్రం ధోనీ ఎప్పటికీ నిలిచిపోతాడు.ధోనీ ఫ్యాన్స్ పండుగ.. అరుదైన గుర్తింపు